News


బలమైన మద్దతు...11700 పాయింట్ల స్థాయి!

Wednesday 30th October 2019
Markets_main1572409173.png-29227

నిఫ్టీపై నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు కొత్త సంవత్‌లో కదం తొక్కడం ఆరంభించాయి. దీపావళి నుంచి ఆటో, మెటల్‌, ఎనర్జీ స్టాకుల్లో పెరిగిన కొనుగోళ్లు నిఫ్టీని 11800 పాయింట్ల పైకి పంపాయి. దీంతో ఇప్పటివరకు కీలక నిరోధంగా ఉన్న 11700 పాయింట్లను నిఫ్టీ విజయవంతంగా దాటినట్లయింది. ఇప్పటివరకు నిరోధంగా ఉన్న 11700 పాయింట్లు ఇకపై కీలక మద్దతుగా నిలుస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు.

దీపావళికి ముందు ఐదు సెషన్లుగా నిఫ్టీ 11500- 11700 పాయింట్ల మధ్యనే కదలాడుతూవచ్చింది. నిఫ్టీ డెరివేటివ్స్‌ చూస్తే 11700 పాయింట్ల వద్ద భారీగా పుట్‌ రైటింగ్‌ జరగడం కూడా 11700 పాయింట్లను కీలక మద్దతుగా మారుస్తోంది. రాబోయే సెషన్లలో బుల్స్‌కే ఎక్కువ మద్దతు దొరుకుతుందని నిపుణుల అంచనా. అందువల్ల ఏ చిన్న వెనుకంజ కనిపించినా కొత్త లాంగ్స్‌ తీసుకోవడానికి అవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. నిఫ్టీకి 11650- 11700 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతోంది. దీనికి దిగువన 11500, 11300, 11100 పాయింట్లు మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. పైన 11900 పాయింట్లు తక్షణ నిరోధంగా కనిపిస్తోంది. దీన్నిదాటితే 12000, 12100 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చని అనలిస్టుల అంచనా.



You may be interested

ప్రభుత్వ రంగ షేర్ల ర్యాలీ

Wednesday 30th October 2019

బుధవారం మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 1.50శాతం లాభపడింది. ప్రభుత్వరంగానికి చెందిన ఐటీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌, భెల్‌, యూనైటెడ్‌ బ్యాంక్‌, ఆర్‌సీఎఫ్‌ షేర్లు 10శాతానికి పైగా లాభపడ్డాయి. బీఈఎంఎల్‌, జీఎండీసీలిమిటెడ్‌, సిండికేట్‌ బ్యాంక్‌, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, హిందూస్థాన్‌ కాపర్‌, బీడీఎల్‌, ఆంధ్రాబ్యాంక్‌, యూనికో బ్యాంక్‌, ఎస్‌సీఐ షేర్లు 10 నుంచి 5శాతం పెరిగాయి. కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఐడీబీ బ్యాంక్‌,

రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో భెల్‌కు జోష్‌

Wednesday 30th October 2019

13.50శాతం ర్యాలీ చేసిన షేర్లు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో ప్రారంభంలో 13.50శాతం లాభపడ్డాయి. ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ షేర్లపై రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం చేయడం ఇందుకు కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.58.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 13.50శాతం లాభపడి రూ.61.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.9:40ని.లకు షేర్లు క్రితం

Most from this category