News


కరెక‌్షన్‌లో కొనుగోళ్లకు అవకాశాలు!

Wednesday 8th January 2020
Markets_main1578474977.png-30766

నిపుణుల సూచన
యూఎస్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా యూఎస్‌కు చెందిన మిలటరీ బేస్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది. దీంతో యూఎస్‌ ఫ్యూచర్లు ఒక్కమారుగా భారీ నష్టాల్లోకి మరలాయి. కానీ వెనువెంటనే ఆల్‌ ఈజ్‌ వెల్‌ అంటూ ట్రంప్‌ చేసిన ట్వీట్‌తో ఉపశమనం పొందాయి. దేశీయ సూచీలు సైతం ఆరంభంలో భారీ నష్టం చూపి క్రమంగా కొంత కోలుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా నుంచి భారీ ప్రతిస్పందన ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ కొంత మేర కరెక‌్షన్‌ వచ్చినా అది ఆరోగ్యకరమైనదని, దాన్ని కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. బుధవారం ఉదయం ట్రంప్‌ చేసే ప్రకటన తదుపరి మార్కెట్‌ మార్గాన్ని డిసైడ్‌ చేయవచ్చు. (అప్పటికి ఇండియా మార్కెట్‌ క్లోజవుతుంది). ప్రస్తుతానికి కొంత మూలధనాన్ని విడిగా ఉంచుకోమని నిపుణులు సూచిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని అనలిస్టు సందీప్‌ సభర్వాల్‌ చెప్పారు.

ఇరాన్‌ సంక్షోభం అనుకోకుండా వచ్చిందని, ఎలా ముగుస్తుందో చెప్పలేమని మరో అనలిస్టు అరవింద్‌ సాగర్‌ చెప్పారు. ఈ గొడవలో ఇరాక్‌ ఏమవుతుందో చూడాలని, ప్రపంచంలో ఇరాక్‌ సైతం అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఒకటని చెప్పారు. ఇరాక్‌ సరఫరా దెబ్బతింటే క్రూడ్‌ ధరకు రెక్కలు వస్తాయన్నారు. అలాంటి తరుణంలో మార్కెట్లు నెగిటివ్‌గా స్పందిస్తాయని చెప్పారు. మార్కెట్లో ఇరాన్‌ ప్రతిస్పందనతో సురక్షిత పెట్టుబడి సాధానాలు దూసుకుపోతున్నాయని మరో అనలిస్టు కార్డిలో చెప్పారు. ఇరాన్‌ కనుక హర్ముజ్‌ జలసంధిని టార్గెట్‌ చేస్తే ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా వేశారు. మార్కెట్లో వచ్చే నెగిటివ్‌ స్పందనలను క్వాలిటీ స్టాక్స్‌ కొనుగోలు చేసే అవకాశంగా మలచుకోవాలని సీనియర్‌ అనలిస్టు కేఆర్‌ చౌక్సీ సలహా ఇచ్చారు. ముఖ్యంగా ఫైనాన్షియల్స్‌లో వచ్చే పతనాలు మంచి కొనుగోలు అవకాశాలవుతాయన్నారు. You may be interested

యాక్సిస్‌ బ్యాంకులో భారీగా రాజీనామాలు..!

Wednesday 8th January 2020

నెలల వ్యవధిలో 15వేల మంది రాజీనామా గడచిన కొన్ని నెలల్లో యాక్సిస్‌ బ్యాంక్‌లో దాదాపు 15వేల మంది రాజీనామా చేశారు. ముఖ్యంగా వినియోగదారులకు ప్రత్యక్షంగా సేవలను అందించే శాఖల నుంచే ఎక్కువగా రాజీనామాలు జరిగినట్లు తెలుస్తుంది. అలాగే కొందరు సీనియర్‌ స్థాయి అధికారులు కూడా తన పదవుల నుంచి వైదొలిగారు. అటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అత్యధునిక సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా బ్యాంకు అడుగులు వేస్తోంది. ఈ అంశం పాత ఉద్యోగులకు అసౌకర్యాన్ని

రామ్‌కో, మాస్టెక్‌, జూబిలెంట్‌.. జూమ్‌

Wednesday 8th January 2020

మార్కెట్లు డౌన్‌- ఈ షేర్లు అప్‌ రామ్‌కో సిస్టమ్స్‌  మాస్టెక్‌ లిమిటెడ్‌ జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 93 పాయింట్లు తక్కువగా 40,776కు చేరగా.. నిఫ్టీ 39 పాయింట్లు క్షీణించి 12,014 వద్ద ట్రేడవుతోంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ మిసైల్‌ దాడులు చేపట్టినట్లు వెల్లడించడంతో తొలుత సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు పతనంకాగా..నిఫ్టీ 12,000

Most from this category