News


యుఎస్‌ ఎక్సేంజ్‌ల నుంచి చైనా కంపెనీల డీలిస్టింగ్‌?

Saturday 28th September 2019
Markets_main1569650929.png-28601

యుఎస్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ల నుంచి చైనా కంపెనీలను డీ లిస్టింగ్‌ చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే వార్తల నేపథ్యంలో శుక్రవారం యుఎస్‌ మార్కెట్‌లు భారీగా నష్టపోయాయి. చైనా కంపెనీలలోకి యుఎస్‌ పెట్టుబడులు వెళ్లకుండా ఉండేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ఈ చర్యను తీసుకోనుందని పరిశీలకులు తెలిపారు. ఈ చర్య వలన గత ఏడాది కాలం నుంచి కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తిరిగి పుం‍జుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. కాగా యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య అక్టోబర్‌ 10-11న వాణిజ్య చర్చలు జరగనున్నాయి. 
పెన్స్‌న్‌ ఫండ్లపై పరిమితి..
 యుఎస్‌ ఎక్సెంజ్‌ల నుంచి చైనా కంపెనీలను డీ లిస్ట్‌ చేయడంతో పాటు,  చైనా కంపెనీలలోకి పెన్సన్‌ ఫండ్లు వంటి పెట్టుబడులపై పరిమితులను విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోందని పరిశీలకులు తెలిపారు. ‘యుఎస్‌ పాలసీల వలన చైనా మార్కెట్‌లో అధికంగా అమ్మకాలు చోటుచేసుకుంటాయి. ఇది చైనాకు అనేక సమస్యలను తీసుకొస్తుంది. ఫలితంగా యుఎస్‌-చైనా మధ్య అక్టోబర్‌ 10న జరగనున్న వాణిజ్య చర్చలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది’ అని జోన్స్‌ ట్రేడింగ్‌, చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ మైఖెల్‌ ఓ రోర్క్‌ అన్నారు. కాగా శుక్రవారం ట్రేడింగ్‌లో ఎస్‌ అండ్‌ పీ టెక్నాలజీ ఇండెక్స్‌ 1.3 శాతం పడిపోగా, యుఎస్‌లో లిస్ట్‌యిన చైనా కంపెనీలు ఆలిబాబా గ్రూప్‌ హోల్డింగ్స్‌, బైడూ, జేడీ.కామ్‌ షేర్లు నష్టపోయాయి. 
    ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ తన 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ కంటే దిగువకు పడిపోయింది. ఈ ఇండెక్స్‌ 15.83 పాయింట్లు కోల్పోయి 2,961.79 పాయింట్ల వద్ద ముగిసింది. డోజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 70.87 పాయింట్లు కోల్పోయి 26,820.25 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 91.03 పాయింట్లు కోల్పోయి 7,939. 63 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ మూడు ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌లు అగష్టు తర్వాత ఈ వారం అధికంగా పతనమయ్యాయి. 
యుఎస్‌ ఎక్సేంజ్‌లో లిస్టైన చైనా కంపెనీలు..
ఆలిబాబా.కామ్‌(మార్కెట్‌ క్యాప్‌-459.9 బిలియన్‌ డాలర్లు), జేడీ.కామ్‌(43.6 బిలియన్‌ డాలర్లు), పిన్‌డ్యూడ్యూ(37.5 బిలియన్‌ డాలర్లు), బై డూ(35.8 బిలియన్‌ డాలర్లు), నెట్‌ఈజ్‌(34.0 బిలియన్‌ డాలర్లు), టెన్సంట్‌(27.4 బిలియన్‌ డాలర్లు), టాల్‌ ఎడ్యుకేషనల్‌ గ్రూప్‌(20.8 బిలియన్‌ డాలర్లు), సీట్రిప్‌(17.8 బిలియన్‌ డాలర్లు), న్యూ ఓరియంటల్‌ ఎడ్యుకేషన్‌(17.8 బిలియన్‌ డాలర్లు)



You may be interested

ఐఆర్‌సీటీసీ ఐపీఓ: విశ్లేషకుల అభిప్రాయమిదే..!

Saturday 28th September 2019

సోమవారం ప్రారంభం కానున్న ఇష్యూ  ప్రభుత్వ రంగ ఇండియన్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ సోమవారం ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 3న ముగుస్తుంది.  ఐపీఓ ధర శ్రేణి రూ.315–320గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఇష్యూ సైజు రూ.645 కోట్లు. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 2.01 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ మొత్తంలో ఉద్యోగులకు 1,60,000 షేర్లను కేటాయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు,

అమెరికా నుంచి భారీ చమురు దిగుమతులు

Saturday 28th September 2019

ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 72 శాతం అప్‌ మొదటి స్థానం ఇరాక్‌దే మొత్తంగా తగ్గిన దిగుమతులు న్యూఢిల్లీ: అమెరికా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి ఐదు నెలలూ- ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ చూస్తే, (2018 ఇదే కాలంతో పోల్చి) చమురు దిగుమతులు 72 శాతం పెరిగాయి. అయితే చమురు దిగుమతుల విషయంలో మొదటి స్థానంలో ఇరాక్‌ నిలిచింది.  భారత్‌ సాంప్రదాయకంగా మధ్యప్రాశ్చ్య దేశాల నుంచే

Most from this category