News


నెల గరిష్ఠానికి చమురు

Thursday 11th July 2019
Markets_main1562819198.png-26965

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో హరికేన్‌ పొం‍చి ఉండడంతో చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనితో పాటు బ్రిటిష్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ మధ్యప్రాచ్యంలో చిక్కుకోవడంతో గురువారం(జులై 11) ట్రేడింగ్‌లో డబ్యూటీఐ క్రూడ్‌ 11సెంట్‌లు పెరిగి బ్యారెల్‌కు 66.54 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ 5 సెంట్లు పెరిగా బ్యారెల్‌కు 66.96 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇరాన్‌ బ్రిటన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను బుధవారం నిలిపివేయడంతో మధ్యప్రాచ్యంలో ఒత్తిళ్లు పెరిగాయి. ఫలితంగా బుధవారం ఆయిల్‌ ధరలు ఈ నెలలో గరిష్ఠాలను తాకాయి. డబ్యూటీఐ క్రూడ్‌ 4.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 60.43 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ 4.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 66.91 డాలర్ల వద్ద ముగిశాయి.  
     ఇరాన్‌ సముద్ర జలాలకు దగ్గరగా ఉన్నందువలన 5 ఇరానియన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ బ్రిటిష్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను బుధవారం నిలువరించాయి. ఈ విషయంపై బ్రిటష్‌ యుద్ద నౌక ఇరాన్‌ను హెచ్చరించిందని అమెరికా రక్షణ అధికారులు గురువారం తెలిపారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమెన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి, అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడంతో గత నెలలో మధ్యప్రాచ్య దేశాలలో తీవ్ర ఒత్తిడి నెలకొన్న విషయం తెలిసిందే. 
    అట్లాంటిక్‌ హరికేన్‌కు భయపెట్టడంతో  అమెరికా ఆయిల్‌ ఉత్పత్తిదారులు చమురు ఉత్పత్తిలో కోతను విధించారు. అంతేకాకుండా అమెరికాలోని అతిపెద్ద ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ పోర్ట్‌ లోసియానాని వర్షం ముంచెత్తడంతో  అమెరికా ఆఫ్‌షోర్‌ చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. హరికేన్‌ శుక్రవారం తీరాన్ని​ తాకుతుందన్న వార్తల నేపథ్యంలో ఇక్కడి వర్కర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు ఊహించని విధంగా అమెరికా చమురు నిల్వలు తగ్గడంతో ఆయిల్‌ ధరలు పెరిగాయి. 31 లక్షల బ్యారెల్లా  చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే అది 81 లక్షల బ్యారెల్లు తగ్గి 4,614 లక్షల  బ్యారెల్‌కు చేరిందని అమెరికా పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌ మంగళవారం తెలిపిన విషయం​తెలిసిందే. 



You may be interested

పసిడికి పావెల్‌ బూస్ట్‌

Thursday 11th July 2019

వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ బలహీనతతో పసిడి ధర తిరిగి లాభాల బాట పట్టింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో వారం రోజుల గరిష్టాన్ని అందుకున్న పసిడి ధర గురురం ట్రేడింగ్‌లో మరో 15డాలర్లు అందుకుంది. నిన్న అమెరికా కాం‍గ్రెస్‌ ఎదుట ప్రసగించిన ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ వడ్డీరేట్ల తగ్గింపునుకు మద్ధతుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ నెలాఖరున చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల

బుధవారం వార్తల్లోని షేర్లు

Thursday 11th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  స‌న్ ఫార్మా:- రైస్ డ్రోనేట్ సోడియం ఔష‌ధాల‌ను యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు ద‌క్కించుకుంది. అర‌బిందో ఫార్మా:- అమెరికా మార్కెట్లో సెన్సిప‌ర్ ఔష‌ధాల‌ను ఆవిష్కరించింది.  పిరమిల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా కంపెనీ రూ.1500 కోట్ల నిధుల స‌మీక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది. గ్రేవీస్ కాట‌న్‌:- ఆంపియర్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అదనంగా 15 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో తన మొత్తం

Most from this category