News


యూఎస్‌ మార్కెట్‌ డౌన్‌- ఇన్ఫీ అప్‌

Saturday 11th January 2020
Markets_main1578714307.png-30851

రికార్డ్‌ గరిష్టాల నుంచి వెనక్కి
ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.6 శాతం ప్లస్‌ 
టాటా మోటార్స్‌ 2 శాతం అప్‌

వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు చివర్లో డీలాపడ్డాయి. తొలుత రికార్డ్‌ గరిష్టాలను అందుకున్న మార్కెట్లు తదుపరి ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెనకడుగు వేశాయి. వెరసి శుక్రవారం డోజోన్స్‌ 133 పాయింట్లు(0.45 శాతం) నీరసించి 28,824 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 9 పాయింట్లు(0.3 శాతం) తక్కువగా 3,265 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ 25 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 9,179 వద్ద ముగిసింది. డిసెంబర్‌లో ఉపాధి గణాంకాలు ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవడం కొంతమేర ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 1.64 లక్షల ఉద్యోగాలను అంచనా వేయగా.. 1.4 లక్షలు మాత్రమే నమోదైనట్లు తాజా గణాంకాలు తెలియజేశాయి.  

15న డీల్‌
గత వారం నికరంగా డోజోన్స్‌ 0.7 శాతం, ఎస్‌అండ్‌పీ 0.9 శాతం చొప్పున పుంజుకోగా.. నాస్‌డాక్‌ మరింత అధికంగా 1.8 శాతం ఎగసింది. ఇందుకు ఇరాన్‌, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు చల్లబడటం కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు చైనాతో వాణిజ్య వివాద పరిష్కార ప్రాథమిక ఒప్పందం ఈ నెల 15న కుదుర్చుకోనున్నట్లు అమెరికా ప్రభుత్వ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశారు. 

బోయింగ్‌ డీలా
వారాంతాన అమెరికా బ్లూచిప్స్‌లో బోయింగ్‌, జీఈ 2 శాతం చొప్పున డీలాపడ్డాయి. కాగా.. అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌)లో ఇన్ఫోసిస్‌ 1.6 శాతం ఎగసి 10.65 డాలర్ల వద్ద ముగిసింది. పటిష్ట ఫలితాలు, గైడెన్స్‌ పెంచడం, విజిల్‌బ్లోయర్‌ ఆరోపణల్లో వాస్తవాలు లేవన్న నివేదిక వంటి అంశాలు ఇన్ఫీ కౌంటర్‌కు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌ షేరు దేశీ మార్కెట్లలో కనీసం 2 శాతం పుంజుకునే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో విప్రో ఏడీఆర్‌ 0.5 శాతం పుంజుకుని 3.87 డాలర్లకు చేరగా.. టాటా మోటార్స్‌(టీటీఎం) 2.1 శాతం ఎగసి 13.61 డాలర్ల వద్ద, వేదాంతా(వీఈడీఎల్‌) 0.9 శాతం బలపడి 8.97 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఇతర కౌంటర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 1 శాతం నీరసించి 62 డాలర్ల దిగువన నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 0.7 శాతం నష్టంతో 15.04 డాలర్ల వద్ద ముగిసింది. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 0.45 శాతం బలహీనపడి 41.06 డాలర్ల వద్ద నిలిచింది. 



You may be interested

సెన్సెక్స్‌ను శాసించే షేరు ఇదే!

Saturday 11th January 2020

దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈక్విటీ సూచీలకే సూచికగా మారింది. భవిష్యత్‌లో సెన్సెక్స్‌ కదలికలు పసిగట్టాలంటే ఈ షేరును పరిశీలిస్తే చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు దశాబ్దాల బ్యాంకు షేరు, సెన్సెక్స్‌ల కదలికలను సామ్‌కో సెక్యూరిటీస్‌ మదింపు చేసింది. ఎప్పుడైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు ఒక కొత్త గరిష్ఠాన్ని చేరిందో, అప్పుడల్లా సెన్సెక్స్‌ కూడా స్వల్ప వ్యవధిలోనే కొత్త గరిష్ఠాలను చేరిందని ఈ మదింపులో బ్రోకరేజ్‌

రూపాయికి నాల్గవ రోజూ లాభం

Saturday 11th January 2020

27 పైసలు పెరుగుదలతో 70.94 వద్ద ముగింపు నాలుగు రోజుల్లో 99పైసలు అప్‌ (అప్‌డేటెడ్‌...) ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం వరుసగా 4వ రోజూ లాభపడింది. 27పైసలు లాభంతో 70.94 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతుండడం ఇందుకు దోహదపడిన అంశం. ఈ నాలుగు రోజుల్లో రూపాయి విలువ 99 పైసలు బలపడింది. వారంలో 86 పైసలు (1.19 శాతం) లాభపడింది. గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి

Most from this category