News


యూఎస్‌ మార్కెట్ల ఘోర పతనం

Tuesday 17th March 2020
Markets_main1584418070.png-32522

చరిత్రలో మరో బ్లాక్‌‘మండే’
13 శాతం కుప్పకూలిన డోజోన్స్‌
ఎస్‌అండ్‌పీ 12 శాతం పతనం
అదే బాటలో నాస్‌డాక్‌ డౌన్‌
మూడు దశాబ్దాలలో అత్యధిక నష్టం

కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఏకంగా సున్నా(0-0.25 శాతం) స్థాయికి కోత పెట్టినప్పటికీ సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. డోజోన్స్‌ 2997 పాయింట్లు(13 శాతం) పడిపోయి 20,189 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 325 పాయింట్లు(12 శాతం) తిరోగమించి 2,386 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 970 పాయింట్లు(12.3 శాతం) కోల్పోయి 6,905 వద్ద స్థిరపడింది. వెరసి 1987 తదుపరి అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో 2018 డిసెంబర్‌ తదుపరి ఎస్‌అండ్‌పీ కనిష్టం వద్ద నిలిచింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే ఇండెక్సులు 8 శాతం పతనంకావడంతో ట్రేడింగ్‌ కొంతసమయం నిలిచిపోవడం గమనార్హం! ఎస్‌అండ్‌పీ మార్కెట్‌ విలువ 2.69 ట్రిలియన్‌ డాలర్లమేర ఆవిరికాగా.. గత మూడు రోజుల్లో 8.28 ట్రిలియన్‌ డాలర్లమేర కోతపడినట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి.

ఏం జరిగిందంటే
విలయం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించవచ్చన్న అంచనాలు ఇటీవల బలపడుతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఇటీవలే వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఆదివారం మరింత అధికంగా 1 శాతం కట్‌ చేసింది. వెరసి ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు నామమాత్రంగా 0-0.25 శాతానికి చేరాయి. 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి వడ్డీ రేట్లు దాదాపు జీరో స్థాయికి చేరగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీనికితోడు కరోనా విస్తరించకుండా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా 10 మందికి మించి ప్రజలు గ్రూపులు కట్టవద్దని హెచ్చరించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తవచ్చని ట్రంప్‌ పేర్కొనడం కూడా అమ్మకాల ఉధృతికి దారితీసినట్లు తెలియజేశారు.

ఇదీ పతన తీరు
2009 తదుపరి రియల్టీ రంగం 16.5 శాతం కుప్పకూలగా.. ఇటీవల మార్కెట్లను బుల్‌ బాటలో నడిపిన టెక్నాలజీ ఇండెక్స్‌ సైతం 14 శాతం పడిపోయింది. అన్ని రంగాలూ భారీ నష్టపోగా.. 7 శాతం క్షీణతతో అత్యంత కనిష్టంగా నీరసించిన ఇండెక్స్‌గా కన్జూమర్‌ స్టేపుల్స్‌ నిలవడం విశేషం. కాగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. జపాన్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ తదితర మార్కెట్లు 3 శాతం స్థాయిలో పతనమయ్యాయి. కాగా.. యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 1.2 శాతం పుంజుకుని ట్రేడవుతున్నాయి.You may be interested

ఒడిదుడుకుల మధ్య లాభాలతో....

Tuesday 17th March 2020

మార్కెట్లో కొనసాగుతున్న కరోనా భయాలు నష్టాల్లో ఫైనాన్స్‌, లాభాల్లో మెటల్‌ షేర్లు సెన్సెక్స్‌ 100 పాయింట్ల: నిఫ్టీ 45.7 పాయింట్లు స్టాక్‌ మార్కెట్లో అస్థిరత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఇంకా మార్కెట్‌ను వీడటం లేదు. ఫలితంగా మంగళవారం స్టాక్‌ సూచీలు భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నాయి. ఆర్థికవ్యవస్థ రికవరీ ఆర్‌బీఐ అభయహస్తం, రూపాయి విలువ బలపడటం, షార్ట్‌ కవరింగ్‌ల పాటు డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో

నష్టాలకు చెక్‌- లాభాల ఓపెనింగ్‌?

Tuesday 17th March 2020

లాభాలతో కదులుతున్న యూఎస్‌ ఫ్యూచర్స్‌ 140 పాయింట్లు బలపడిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  సోమవారం ప్రపంచ మార్కెట్లలో కరోనా విలయం ప్రస్తుతం అటూఇటుగా ఆసియా స్టాక్‌ మార్కెట్లు దేశీ స్టాక్‌ మార్కెట్ల పతనాలకు నేడు(మంగళవారం) ఇన్వెస్టర్లు చెక్‌ పెట్టే అవకాశముంది. వెరసి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే చాన్స్‌​కనిపిస్తోంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం  8.30 ప్రాంతం‍లో 140 పాయింట్లు పుంజుకుని 9,236 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 9,096 పాయింట్ల వద్ద

Most from this category