News


ట్రంప్‌ కార్డ్‌- యూఎస్‌ జోష్‌

Wednesday 18th March 2020
Markets_main1584504938.png-32550

5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు
ఫెడరల్‌ రిజర్వ్‌ లిక్విడిటీ బూస్ట్‌
ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సహాయక చర్యల దన్ను
ఫైజర్‌, రీజెనరాన్‌ ఫార్మా హైజంప్‌

కరోనా ప్రభావానికి చెక్‌ పెట్టే బాటలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించిన సహాయక చర్యలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. దీంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 5 శాతం జంప్‌చేశాయి. ఇప్పటికే కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఏకంగా జీరో(0-0.25 శాతం) స్థాయికి దించడంతోపాటు.. 700 బిలియన్‌ డాలర్ల బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా నిధులను పంప్‌చేసేందుకు నిర్ణయించింది. తాజాగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రతీ పౌరుడికీ 1000 డాలర్ల చెక్‌ను అందించేందుకు నిర్ణయించారు. వెరసి సహాయక ప్యాకేజీలో భాగంగా 850 బిలియన్‌ డాలర్లను ట్రంప్‌ వినియోగించనున్నారు. దీంతో ఒక్కసారిగా సెంటిమెంటుకు జోష్‌వచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.

బౌన్స్‌బ్యాక్‌
సోమవారంనాటి 12 శాతం పతనాల నుంచి మంగళవారం ఇండెక్సులు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. డోజోన్స్‌ 1409 పాయింట్లు(5.2 శాతం) జంప్‌చేసి 21,237ను తాకగా.. ఎస్‌అండ్‌పీ 143 పాయింట్లు(6 శాతం) ఎగసింది. 2,529 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 430 పాయింట్లు(6.25 శాతం) పెరిగి 7,335 వద్ద స్థిరపడింది. ప్రధానంగా భారీ లిక్విడిటీని వ్యవస్థలోకి పంప్‌చేయడం ద్వారా వినియోగాన్ని పెంచే ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఈక్విటీ హెడ్‌ స్టీఫెన్‌ డోవర్‌ పేర్కొన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. 1987లో నమోదైన బ్లాక్‌మండే తదుపరి తిరిగి ఈ సోమవారం అమెరికా మార్కెట్లు 12 శాతంపైగా పతనమైన విషయం విదితమే. ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తే వీలున్నట్లు స్వయంగా ప్రెసిడంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు నిపుణులు చెబుతున్నారు.

డివిడెండ్లపై దృష్టి
మంగళవారం ట్రేడింగ్‌లో డివిడెండ్లు అత్యధికంగా చెల్లించగల రక్షణాత్మక రంగాలైన కన్జూమర్‌ స్టేపుల్స్‌ 8.5 శాతం జంప్‌చేయగా.. యుటిలిటీస్‌ అత్యధికంగా 13 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో టెక్నాలజీ ఇండెక్స్‌ సైతం 7 శాతం ఎగసింది. బ్లూచిప్స్‌లో హెల్త్‌కేర్‌ దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ 7 శాతం జంప్‌చేసింది. జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌తో డీల్‌ ఇందుకు కారణంకాగా.. కోవిడ్‌-19ను నిలువరించగల యాంటీబాడీస్‌ను గుర్తించిన వార్తలతో రీజెనరాన్‌ ఫార్మాస్యూటికల్స్‌ షేరు 11.5 శాతం పెరిగింది.You may be interested

1484 శాతం ఎగసిన యస్‌ బ్యాంక్‌

Wednesday 18th March 2020

తాజాగా 23 శాతం హైజంప్‌ రూ. 72ను అధిగమించిన షేరు ఇంట్రాడేలో రూ. 87ను దాటేసింది నేటి సాయంత్రం నుంచి పూర్తి కార్యకలాపాలు ఖాతాదారులు మొత్తం రూ. 50,000కు మించి ఉపసంహరించుకునే వీలులేకుండా యస్‌ బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన నిషేధం నేటి(బుధవారం) సాయంత్రం 6 తదుపరి తొలగిపోనుంది. దీంతో ఖాతాదారులకు యస్‌ బ్యాంక్‌ పూర్తిస్థాయి కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ అంశంపై యస్‌ బ్యాంక్‌ సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్‌బీఐ మాజీ అధికారి

ఫోర్డ్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం

Wednesday 18th March 2020

10,000 మందికి కంపెనీ సూచన న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఆటో మొబైల్‌ రంగ దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ(ఎఫ్‌ఎంసీ) తన భారత ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఫెసిలిటీని కల్పిస్తోంది. కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ కంపెనీలో వ్యాపించకుండా ఉండేందుకు ఇక్కడి 10,000 మంది ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఫెసిలిటీలోనే పనిచేయాల్సిన ఉద్యోగులను మినహాయించి మిగిలిన వారికి ఈ అవకాశం ఇచ్చినట్లు వివరించింది. ఫోర్డ్ ఇండియా, గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్

Most from this category