News


అమెరికా స్టాక్స్‌ జోరు- యాపిల్‌ దూకుడు

Tuesday 3rd March 2020
Markets_main1583207669.png-32233

5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు
2009 తదుపరి రికార్డ్‌ లాభం
ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సైతం​రికార్డ్స్‌
సహాయక ప్యాకేజీలపై అంచనాలు

కోవిడ్‌-19 భయాలతో పతన బాటలో సాగుతున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ కాలుదువ్వింది. కొమ్ములతో బేర్‌ ట్రెండ్‌ను కుమ్మేసింది. దీంతో డోజోన్స్‌ 2009 తదుపరి అత్యధికంగా లాభపడింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న ఆందోళనలకు చెక్‌ పెడుతూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, జపాన్‌, చైనా తదితర దేశాల కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు తెరతీయనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి డోజోన్స్‌ 5.1 శాతం జంప్‌చేసి 26,703 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 4.6 శాతం పురోగమించి 3,090 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 4.5 శాతం ఎగసి 8,952 వద్ద స్థిరపడింది. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 2018 డిసెంబర్‌ తదుపరి ఒక్క రోజులో అత్యధికంగా లాభపడటం విశేషం!

యాపిల్‌ వారెవ్వా
ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ షేరు 2008 తదుపరి మళ్లీ 9.3 శాతం దూసుకెళ్లగా.. జిలీడ్‌ సైన్సెస్‌ 4.9 బిలియన్‌ డాలర్లతో కంపెనీ కొనుగోలుకి ఆఫర్‌ ప్రకటించడంతో ఫార్టీ సెవెన్‌ ఇంక్‌ షేరు 62 శాతం దూసుకెళ్లింది. ఫార్టీ సెవెన్‌ ఇంక్‌ కంపెనీ కేన్సర్‌ ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. ఈ బాటలో సర్జికల్‌ మాస్కుల తయారీ సంస్థ అల్ఫా ప్రొ టెక్‌ 22 శాతం జంప్‌చేసింది. గత 20 రోజుల సగటు 9.5 బిలియన్ల షేర్లతో పోలిస్తే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ పరిమాణం బాగా పెరిగింది. 14 బిలియన్‌ షేర్లకు ఎగసింది. 

ఆసియాలోనూ
అమెరికా, జపాన్‌, చైనా బాటలో యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు సైతం స్టిములస్‌కు సిద్ధమని సంకేతాలివ్వడంతో ఆసియాలోనూ ప్రోత్సాహకర వాతావరణం నెలకొంది. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, తదితర మార్కెట్లు 2.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఈ నెల 17-18న నిర్వహించనున్న పాలసీ సమావేశంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో కనీసం పావు శాతం కోత విధించనున్నట్లు అంచనాలు పెరిగాయి. ఇదే విధంగా ఈ నెల 12న చేపట్టనున్న సమీక్షలో ఈసీబీ సైతం​0.1 శాతం రేట్ల తగ్గింపును ప్రకటించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు కరోనా సమస్యలకు చెక్‌ పెట్టేందుకు వీలుగా నేడు జీ7 దేశాల ఆర్థిక మంత్రులు కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా సమావేశంకానున్నట్లు తెలుస్తోంది.

ఈల్డ్స్‌ ఓకే
గత వారం 1.03 శాతం వద్ద రికార్డ్‌ కనిష్టానికి చేరిన 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ తాజాగా 1.15 శాతానికి బలపడ్డాయి. డాలరుతో మారకంలో సోమవారం 107ను తాకిన జపనీస్‌ యెన్‌ 108.31కు బలపడింది. యూరో 1.113 వద్ద కదులుతోంది.    You may be interested

300 పాయింట్ల గ్యాప్‌ అప్‌తో సెనెక్స్‌ ప్రారంభం

Tuesday 3rd March 2020

అంతర్జాతీయ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 300.34 పాయింట్ల లాభంతో 38444.36, నిఫ్టీ  147.3 పాయింట్లు పెరిగి 11280.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధితో  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)లు తమ సభ్య దేశాలకు ఆర్థిక సాయంతో సహా అన్ని విధాలుగా చేయూత నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామినివ్వడంతో ప్రపంచ

పౌల్ట్రీకి రూ. 1,750 కోట్ల నష్టాలు

Tuesday 3rd March 2020

వైరస్ వదంతులతో పౌల్ట్రీకి రూ. 1,750 కోట్ల నష్టాలు ఆదుకోవాలంటూ కేంద్రానికి పరిశ్రమ వినతి న్యూఢిల్లీ: చికెన్ వల్ల కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్ష౾ణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్ల

Most from this category