నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు!
By Sakshi

హాంగ్‌కాంగ్ ప్రజాసామ్యవాదుల నిరసనకు అమెరికా మద్దితిస్తుండడంతో అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో తగ్గాయి. దీంతోపాటు బ్లాక్ ఫ్రైడే రోజు వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండడంతో కూడా శుక్రవారం సెషన్లో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యుఎస్ సాంకేతికత కలిగిన ఉత్పత్తులు చైనా నుంచి హువాయ్‌కి చేరకుండా ఉండేందుకు అమెరికా మరిన్ని చర్యలు తీసుకోనుందని రాయిటర్స్ వార్తా సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత అమెరికా మార్కెట్ చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ సెషన్ కనిష్టానికి పడిపోయి ముగిసింది. యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగినప్పుడు అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసింది. కానీ ఈ సెంటిమెంట్ బలహీనపడుతుండడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. గత సెషన్లో ఫిలడెల్ఫియా సెమికండక్టర్ ఇండెక్స్ 1.1 శాతం నష్టపోయింది. డోజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ ఇండెక్స్ 112.59 పాయింట్లు లేదా 0.4 శాతం పడిపోయి 28,051 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 0.40 శాతం నష్టపోయి 3,140.98 వద్ద, నాస్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 0.46 శాతం నష్టపోయి 8,665.47 పాయింట్ల వద్ద ముగిశాయి. గురువారం థ్యాంక్స్ గివింగ్ సెలవు తర్వాత చాలా వరకు ఇన్వెస్టర్లు శుక్రవారం విరామం తీసుకున్నారని, మరి కొంత మంది వచ్చే వారం వెలువడనున్న యుఎస్ ఆర్థిక డేటా కోసం వేచి ఉన్నారని విశ్లేషకులు తెలిపారు. బ్లాక్ ఫ్రైడే రోజున గతేడాది కంటే తక్కువ మంది వినియోగదారులు స్టోర్స్ ముందు క్యూ కడుతున్నారని, అమెరికా అతి పెద్ద షాపింగ్ రోజును ఆన్లైన్ కొనుగోళ్లు మాత్రం ముంచెత్తాయని పరిశీలకులు తెలిపారు. కాగా గత సెషన్లో ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లోని రిటైల్ సెక్టార్ 0.8 శాతం పడిపోయింది.
You may be interested
38,000పైన ముగిసిన పసిడి
Saturday 30th November 2019ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడి ధర 10డాలర్ల మేర లాభపడంతో శుక్రవారం ఎంసీఎక్స్ డిసెంబర్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38000 పైన ముగిసింది. రాత్రి ఎంసీఎక్స్ ట్రేడింగ్ ముగిసే సరికి పసిడి రూ.308లు లాభపడి రూ.38031.00 వద్ద స్థిరపడింది. హాంగ్‌కాంగ్‌లో చెలరేగిన రాజకీయ ఉద్రికత్తలతో అంతర్జాతీయంగా ఇతర కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ క్రమంలో దేశీయంగా ఎంసీఎక్స్‌లో డాలర్
క్యాషే కింగ్!
Saturday 30th November 2019రియల్టీ లావాదేవీల్లో బ్లాక్ మనీదే హవా 30 శాతం చెల్లింపులు నగదు రూపంలోనే సాక్షి, హైదరాబాద్:- నగదు లావాదేవీల్లో బ్లాక్ మనీని నియంత్రించేందుకు కేంద్రం చేపట్టిన రూ.1,000, రూ.500 నోట్ల రద్దు (డీమానిటైజేషన్) పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. డీమానిటైజేషన్ చేపట్టి మూడేళ్లు గడిచినా.. నేటికీ ప్రాపర్టీ డీల్స్‌లో 30 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో కంటే ద్వితీయ శ్రేణి నగరాల్లోని గృహ విభాగంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని అనరాక్