News


వారాంతానా వాల్‌స్ట్రీట్‌కు కరోనా కాటు

Saturday 7th March 2020
Markets_main1583553942.png-32341

1-2 శాతం మధ్య క్షీణించిన ఇండెక్సులు 
ప్రపంచమంతటా విస్తరిస్తున​ కరోనా భయాలు
ఆటుపోట్ల మధ్య గత వారం నికరంగా లాభాలే
ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌లు బోర్లా

కరోనా భయాలతో వారాంతాన(6న) అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి నష్టాలతో ముగిశాయి. డోజోన్స్‌ 256 పాయింట్లు(1 శాతం) క్షీణించి 25,865 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 52 పాయింట్లు(1.7 శాతం) నీరసించి 2,972 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 163 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి 8,576 వద్ద ముగిసింది. అయితే గత వారం మార్కెట్లు పలుమార్లు ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి గత వారం డోజోన్స్‌ నికరంగా 1.8 శాతం పుంజుకోగా.. ఎస్‌అండ్‌పీ 0.6 శాతం బలపడింది. ఇక నాస్‌డాక్‌ నామమాత్రంగా 0.1 శాతమే లాభపడింది. 

గత వారం ఇలా
గత సోమ, బుధవారాల్లో డోజోన్స్‌ 1100 పాయింట్ల చొప్పున జంప్‌చేయగా.. మంగళవారం 800 పాయింట్లు పతనమైంది. తిరిగి గురువారం 1000 పాయింట్లు కోల్పోగా.. వారాంతాన మరో 256 పాయింట్లు క్షీణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా మందగమన బాట పట్టకుండా చూసేందుకుగాను కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఎమర్జెన్సీ ప్రాతిపదికన గత వారం వడ్డీ రేటులో 0.5 శాతం కోతను విధించింది.  

10 శాతం డౌన్‌
అమెరికా స్టాక్‌ ఇండెక్సులు ఇటీవల సాధించిన గరిష్టాల నుంచి తాజాగా 10 శాతం వరకూ పతనమయ్యాయి. వెరసి ఇటీవల యూఎస్‌ మార్కెట్లు కరెక్షన్‌ బాటలో సాగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. హెచ్చుతగ్గులను సూచించే వొలాటిలిటీ ఇండెక్స్‌(విక్స్‌) 2009 మార్చి 6 తదుపరి గత వారం గరిష్టానికి చేరడం ద్వారా ఇన్వెస్టర్లలో చెలరేగిన భయాలను ప్రతిబింబిస్తున్నదని నిపుణులు వ్యాఖ్యానించారు. ఫలితంగా ఇటీవల ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే యూఎస్‌ ట్రెజరీ బాండ్లు, జపనీస్‌ యెన్‌, పసిడిలోకి పెట్టుబడులను మళ్లిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ ఏకంగా చరిత్రలోనే తొలిసారి 0.7 శాతానికి పతనమయ్యాయి. మరోవైపు డాలరుతో మారకంలో యెన్‌ 1 శాతం బలపడింది. బంగారం ధరలు సైతం 1 శాతం ఎగశాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 1671 డాలర్ల వద్ద ముగిసింది.

వేదాంతా వీక్‌
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) వారాంతాన అధిక శాతం క్షీణ పథంలో సాగాయి. టాటా మోటార్స్‌(టీటీఎం) 3.2 శాతం పతనమై 7.77 డాలర్ల వద్ద నిలవగా.. వేదాంతా(వీఈడీఎల్‌) 2.5 శాతం క్షీణించి 5.9 డాలర్ల వద్ద ముగిసింది. ఇక ఇన్ఫోసిస్‌ 3.5 శాతం పడిపోయి 9.78 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 1.1 శాతం నష్టంతో 12.91 డాలర్లను తాకింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్‌ 0.3 శాతం బలహీనపడి 3.51 డాలర్ల వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 1.1 శాతం నష్టంతో 12.91 డాలర్ల వద్ద ముగిశాయి. ఇదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 0.2 శాతం నీరసించి 51.40 డాలర్ల వద్ద స్థిరపడగా.. డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) మాత్రం 0.3 శాతం బలపడి 42.53 డాలర్ల వద్ద నిలిచింది.   You may be interested

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 7th March 2020

481.54 బిలియన్ డాలర్లుగా నమోదు ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) ఆల్‌టైం హైకి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది ఫిబ్రవరి 14తో ముగిసిన వారంలో 5.42 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 481.54 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం 29 మిలియన్‌ డాలర్లు పెరిగి 476.12 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో

టీసీఎస్‌, డీఎల్‌ఎఫ్‌ సెజ్‌లకు ప్రభుత్వ అనుమతి

Saturday 7th March 2020

న్యూఢిల్లీ: ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ప్రముఖ రియల్టీ రంగ సంస్థ డీఎల్‌ఎఫ్‌లు.. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం నుంచి అనుమతి పొందాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో 19.9 హెక్టార్ల విస్తీర్ణంలో ఐటీ / ఐటీఇఎస్ సెజ్ ఏర్పాటు చేయాలని టిసిఎస్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత పెట్టుబడి రూ .2,434 కోట్లుగా అంచనావేసింది. సెజ్‌ బోర్డ్ ఆఫ్ అప్రూవల్

Most from this category