News


యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌ ర్యాలీ

Saturday 18th January 2020
Markets_main1579319368.png-31008

డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ రికార్డు
మార్కెట్లు గత వారం నికరంగా 2% ప్లస్‌
ఇండియన్‌ ఏడీఆర్‌లలో డాక్టర్‌ రెడ్డీస్‌ జోరు

పటిష్ట హౌసింగ్‌ గణాంకాల నేపథ్యంలో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. డిసెంబర్‌లో గృహ నిర్మాణాలు 13ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. దీంతో మార్కె‍ట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. శుక్రవారం(17న) డోజోన్స్‌ 0.17 శాతం బలపడి 29,348 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 0.4 శాతం ఎగసి 3,330 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్‌ 0.35 శాతం పుంజుకుని 9,389 వద్ద ముగిసింది. వెరసి ఇండెక్సులన్నీ చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. గత వారం డోజోన్స్‌ 1.8 శాతం, ఎస్‌అండ్‌పీ 2 శాతం లాభపడగా.. నాస్‌డాక్‌ మరింత అధికంగా 2.3 శాతం ఎగసింది. ఆగస్ట్‌ తదుపరి ఒకే వారంలో మార్కెట్లు తిరిగి అత్యధిక లాభాలు ఆర్జించాయి.

అల్ఫాబెట్‌ రికార్డ్‌
గురువారం​ ట్రేడింగ్‌లో 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌)ను సాధించిన గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ షేరు మరోసారి 2 శాతం పుంజుకుంది. ఇతర టెక్నాలజీ దిగ్గజాలు వీసా, యాపిల్‌, క్వాల్‌కామ్‌ సైతం లాభపడ్డాయి. అయితే ఆయిల్‌ఫీల్డ్‌ సర్వీసుల కంపెనీ ష్లమ్‌బెర్గర్‌ అంచనాలు మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ 1 శాతం నష్టపోయింది. 

ఇండియన్‌ ఏడీఆర్‌లు ఇలా
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌)లో డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 2.9 శాతం జంప్‌చేసి 42.45 డాలర్ల వద్ద నిలిచింది. ఈ బాటలో ఇన్ఫోసిస్‌ 0.3 శాతం బలపడి 10.88 డాలర్లను తాకగా..విప్రో ఏడీఆర్‌ 0.8 శాతం పుంజుకుని 3.83 డాలర్లకు చేరింది. ఇక టాటా మోటార్స్‌(టీటీఎం) 0.22 శాతం లాభంతో 13.85 డాలర్ల వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 0.16 శాతం బలపడి 61.74 డాలర్ల వద్ద  ముగిశాయి. అయితే వేదాంతా(వీఈడీఎల్‌) ఏడీఆర్‌ 0.7 శాతం బలహీనపడి 9.02 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 0.73 శాతం నష్టంతో 14.86 డాలర్ల వద్ద స్థిరపడింది.



You may be interested

హ్యుందాయ్‌ ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభం

Saturday 18th January 2020

‘క్లిక్‌ టు బయ్’ పేరిట సేవలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా.. ‘క్లిక్‌ టు బయ్’ పేరిట ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలను ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రిటైల్‌ సేల్స్‌ నెట్‌వర్క్‌తో పాటు నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్లు కార్లను ఎంపిక చేసుకుని, కొనుగోలు చేయడానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్‌.ఎస్‌ కిమ్‌ వివరించారు. ఈ ప్లాట్‌ఫాంలో

రెండు విమానాశ్రయ ప్రాజెక్టుల రేసులో జీఎంఆర్‌

Saturday 18th January 2020

హైదరాబాద్‌: మౌలిక రంగంలో ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుల వేటలో ఉంది. దక్షిణ యూరప్‌లోని మాంటినీగ్రోలో ఉన్న పోడ్గోరికా, టివట్‌ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికై ప్రాథమిక అర్హత (ప్రీ క్వాలిఫైడ్‌) సాధించిన నాలుగు కంపెనీల్లో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఒకటి. కన్సెషన్‌ పీరియడ్‌ 30 ఏళ్లు. జీఎంఆర్‌తోపాటు ఇన్షియాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్పొరేషన్‌, గ్రూప్‌ ఏడీపీ కాన్సార్షియం, కార్పొరేషన్‌ అమెరికా ఎయిర్‌పోర్ట్‌ ఈ

Most from this category