News


నాస్‌డాక్‌ 11 రోజుల ర్యాలీకి బ్రేక్‌

Saturday 28th December 2019
Markets_main1577505520.png-30489

యూఎస్‌ మార్కెట్లు అటూఇటూ
డోజోన్స్‌ ప్లస్‌లో- నాస్‌డాక్‌ మైనస్‌
ఎస్‌అండ్‌పీ-500 యథాతథం

వారాంతాన యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ 24 పాయింట్ల(0.08 శాతం) స్వల్ప లాభంతో 28,645 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ దాదాపు యథాతథంగా 3240 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్‌  16 పాయింట్లు(0.17 శాతం) తక్కువగా 9007 వద్ద ముగిసింది. వెరసి నాస్‌డాక్‌ 11 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ చివర్లో పెరిగిన అమ్మకాలు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే స్వల్ప లాభంతో డోజోన్స్‌, నామమాత్ర లాభంతో ఎస్‌అండ్‌పీ మరోసారి సరికొత్త గరిష్టాల వద్ద నిలవడం విశేషం!

29 శాతం ర్యాలీ
ఈ ఏడాది(2019)లో ఇప్పటివరకూ ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 29 శాతం ర్యాలీ చేసింది. వెరసి 2013 తదుపరి రికార్డ్‌ స్థాయిలో లాభపడింది. కొత్త ఏడాది సందర్భంగా బుధవారం(1న) మార్కెట్లకు సెలవు. దీంతో ఈ ఏడాది మరో రెండు రోజుల ట్రేడింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. గత 20 రోజుల ట్రేడింగ్‌ సగటు 6.8 బిలియన్‌ షేర్లుకాగా.. శుక్రవారం 5.2 బిలియన్‌ షేర్లు చేతులు మారాయి. మార్కెట్లు ఏడాది ముగింపు సెలవుల మూడ్‌లో ఉన్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.

ఏడీఆర్‌ల తీరిలా
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) శుక్రవారం కదలికలు ఎలా ఉన్నాయంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 0.3 శాతం క్షీణించి 63.11 డాలర్ల వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 0.2 శాతం బలపడి 40.59 డాలర్ల వద్ద ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 1.2 శాతం ఎగసి 15.28 డాలర్లను తాకగా, వేదాంతా(వీఈడీఎల్‌) 0.5 శాతం నష్టంతో 8.52 డాలర్ల వద్ద నిలిచింది. ఇతర కౌంటర్లలో టాటా మోటార్స్‌(టీటీఎం) 0.3 శాతం క్షీణించి 12.32 డాలర్ల వద్ద, ఇన్ఫోసిస్‌(ఇన్ఫీ) 0.9 శాతం పుంజుకుని 10.26 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఇక విప్రో(డబ్ల్యూఐటీ) 1 శాతం నష్టంతో 3.76 డాలర్ల వద్ద నిలిచింది. 



You may be interested

మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం

Saturday 28th December 2019

ఐవోబీ, యూకో, అలహాబాద్‌ బ్యాంకులకు రూ.8,655 కోట్లు న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్‌ ఓవర్సీస్‌, అలహాబాద్‌ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత

125 కోట్ల మందికి ఆధార్‌

Saturday 28th December 2019

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్ధనలు నమోదవుతున్నాయని యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఆధార్ వివరాల అప్‌డేట్ అభ్యర్ధనలు కూడా రోజుకు 3-4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది.  సీఎస్‌సీల్లో మళ్లీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సేవలు

Most from this category