STOCKS

News


రికార్డులకు బ్రేక్‌- యూఎస్‌ మార్కెట్‌ డీలా

Saturday 8th February 2020
Markets_main1581133593.png-31615

0.5-1 శాతం మధ్య నీరసించిన ఇండెక్సులు
మార్కెట్లను వీడని కరోనా భయాలు
8 నెలల్లో లేని విధంగా గత వారం రికార్డుల ర్యాలీ
ఇండియన్‌ ఏడీఆర్‌ల నేలచూపు
టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డౌన్‌

ఆర్థిక పురోగతిని పట్టిచూపుతూ జనవరిలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించి వెలువడినప్పటికీ శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. డోజోన్స్‌ 277 పాయింట్ల(0.9 శాతం) వెనకడుగుతో 29,102 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 18 పాయింట్లు(0.5 శాతం) తక్కువగా 3,328 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ 52 పాయింట్లు(0.5 శాతం) క్షీణించి 9,520 వద్ద ముగిసింది. వెరసి నాలుగు రోజుల రికార్డు ర్యాలీకి చెక్‌ పడింది. అయినప్పటికీ గత వారం ఎస్‌అండ్‌పీ నికరంగా 3.2 శాతం ఎగసింది. 2019 జూన్‌ తదుపరి ఇది అత్యధికంకావడం గమనార్హం!

ఉద్యోగాలు ప్లస్‌
గత నెలలో 2.25 లక్షల ఉద్యోగ కల్పన జరిగినట్లు యూఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. అయితే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మరింత విస్తరిస్తుండటంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గత వారం మార్కెట్లు భారీ లాభాలతో ర్యాలీ చేయడంతో వారాంతాన ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టడం కూడా మార్కెట్లను దెబ్బతీసినట్లు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య 31,000కు చేరగా.. 636 మంది మరణించినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. దీంతో ప్రపంచ వృద్ధికి విఘాతం కలగవచ్చన్న భయాలు తలెత్తినట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.

ఉబర్‌ జూమ్‌
లిస్టింగ్‌ రోజు గురువారం హైజంప్‌ చేసిన బెడ్డింగ్‌ కంపెనీ కేస్పర్‌ స్లీప్‌ షేరు 16 శాతం పతనంకాగా..  పటిష్ట ఫలితాల నేపథ్యంలో ఉబర్‌ టెక్నాలజీస్‌, పింట్‌రెస్ట్‌ 10 శాతం చొప్పున దూసుకెళ్లాయి. అయితే చైనాలో ఉత్పత్తి మందగించడంతో చిప్‌ తయారీ కంపెనీలు డీలాపడ్డాయి.

డాక్టర్‌ రెడ్డీస్‌ వీక్‌
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) వారాంతాన అమ్మకాలతో డీలా పడ్డాయి. టాటా మోటార్స్‌(టీటీఎం) 3.65 శాతం పతనమై 11.91 డాలర్ల వద్ద నిలవగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 1.4 శాతం తిరోగమించి 58.76 డాలర్ల వద్ద  స్థిరపడింది. ఈ బాటలో డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 1.45 శాతం క్షీణించి 44.16 డాలర్లను తాకాగా.. ఇన్ఫోసిస్‌ 1 శాతం నష్టంతో 10.85 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో వేదాంతా(వీఈడీఎల్‌) 0.9 శాతం బలహీనపడి 8.07 డాలర్ల వద్ద, విప్రో లిమిటెడ్‌ 0.3 శాతం నీరసించి 3.74 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 0.66 శాతం వెనకడుగుతో 14.94 డాలర్ల వద్ద ముగిసింది. You may be interested

రూ.700 కోట్లు కట్టండి

Saturday 8th February 2020

అనిల్‌ అంబానీకి వ్యతిరేకంగా యూకే కోర్టు ఆదేశాలు లండన్‌: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్‌ అనిల్‌ అంబానీకి బ్రిటన్‌ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆరు వారాల్లో 100 మిలియన్‌ డాలర్లు (రూ.700 కోట్లు) కోర్టులో డిపాజిట్‌ చేయాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంకు ఆఫ్‌ చైనా ముంబై శాఖ, చైనా

భారత్‌లో అమెజాన్‌ రూ. 2,500 కోట్ల పెట్టుబడి

Saturday 8th February 2020

న్యూఢిల్లీ: భారత్‌లో శరవేగంగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌.. తాజాగా మరో రూ. 2,500 కోట్లను ఇక్కడ పెట్టుబడిగా పెట్టింది. డేటా సర్వీసెస్ ఇండియా విభాగంలో రూ. 2,208 కోట్లు, సెల్లర్ సర్వీసెస్‌లో రూ.355 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. భారత పర్యటనలో భాగంగా ఇక్కడ రూ. 7,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ ఇటీవలే ప్రకటించారు.

Most from this category