News


అమెరికా బౌన్స్‌బ్యాక్‌- చమురు సైతం

Wednesday 11th March 2020
Markets_main1583898690.png-32398

మంగళవారం 5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు
చివర్లో చతికిలపడ్డ మూరోపియన్‌ మార్కెట్లు 
ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటూ
రెండో రోజూ చమురు ధరల జోరు

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేరోల్‌ ట్యాక్సులలో కోతలను విధించవచ్చన్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. మరోపక్క ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ను చేపట్టడం కూడా దీనికి జత కలసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇండెక్సులు 5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. డోజోన్స్‌ 1167 పాయింట్లు(4.9 శాతం) ఎగసి 25,018 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 136 పాయింట్లు(5 శాతం) పురోగమించి 2,882 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 394 పాయింట్లు(5 శాతం) పెరిగి 8,344 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ డీలాపడకుండా చూసే బాటలో పేరోల్‌ ట్యాక్స్‌ తగ్గింపుతోపాటు ఇతర సహాయక చర్యలు తీసుకోవలసిందిగా కాంగ్రెస్‌ను ట్రంప్‌ కోరడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెలలో నమోదైన గరిష్టాల నుంచి మార్కెట్లు 20 శాతం నీరసించడంతో ఎంపిక చేసిన కొన్ని కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడం కూడా మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు తెలియజేశారు.

ఎనర్జీ ఇండెక్స్‌ అప్‌ 
సోమవారం కుప్పకూలిన ఎనర్జీ ఇండెక్స్‌ చమురు ధరలు 8 శాతం పుంజుకోవడంతో తాజాగా 5 శాతం ఎగసింది. ఈ బాటలో ఫైనాన్షియల్స్‌ 6 శాతం జంప్‌చేయగా.. చెవ్రాన్‌ కార్ప్‌ 5 శాతం, మారథాన్‌ ఆయిల్‌ 21 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఇతర కౌంటర్లలో యునైటెడ్‌ పార్సెల్‌ సర్వీసెస్‌ 6.5 శాతం లాభపడింది. ఇదే విధంగా ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 5 శాతం పురోగమించింది. కాగా.. మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌ 1.5 శాతం చొప్పున క్షీణించగా.. యూకే నామమాత్ర నష్టంతో నిలిచింది. ఇక ప్రస్తుతం ఆసియాలో కొరియా 1.2 శాతం, జపాన్‌ 0.8 శాతం, సింగపూర్‌ 0.2 శాతం చొప్పున డీలాపడగా.. థాయ్‌లాండ్‌, తైవాన్‌, హాంకాంగ్‌, ఇండొనేసియా 0.5-0.2 శాతం మధ్య బలపడ్డాయి. మిగిలిన మార్కెట్లలో చైనా యథాతథంగా కదులతోంది. 10ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ సోమవారం నాటి రికార్డ్‌ కనిష్టం 0.32 శాతం నుంచి 0.76 శాతానికి ఎగశాయి. 

చమురు ప్లస్‌లో
రెండు రోజుల భారీ నష్టాలకు చెక్‌ పెడుతూ మంగళవారం 8 శాతం బౌన్స్‌బ్యాక్‌ సాధించిన ముడిచమురు ధరలు నేటి ట్రేడింగ్‌లో మరోసారి లాభపడ్డాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ దాదాపు 4 శాతం(1.4 డాలర్లు) ఎగసి 38.60 డాలర్లను తాకింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 2.8 శాతం పుంజుకుని 35.33 డాలర్లకు చేరింది. You may be interested

నష్టాలతో మొదలై క్షణాల్లోకి లాభాల్లో...!

Wednesday 11th March 2020

హోలీ సెలవురోజు అనంతరం బుధవారం ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ మొదట నష్టాల్లో ప్రారంభమైన క్షణాల్లో లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ 151 పాయింట్ల నష్టంతో 35,483 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టంతో 10,393 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  అయితే అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లలో రికవరి, ముడిచమురు ధర బౌన్స్‌బ్యాక్‌ కావడంతో పాటు సోమవారం మార్కెట్‌ భారీ పతనం నేపథ్యంలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ

కో–ఆపరేటివ్‌లకూ యస్‌ బ్యాంక్‌ కష్టాలు

Wednesday 11th March 2020

54 పట్టణ సహకార బ్యాంక్‌ల సీటీఎస్‌ల రద్దు రూ.200 కోట్ల మేర నిలిచిపోయిన చెక్‌ లావాదేవీలు తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కో–ఆప్‌ బ్యాంక్‌లపై ప్రభావం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభం ప్రభావం దేశంలోని పట్టణ సహకార బ్యాంక్‌ల మీద పడింది. యస్‌ బ్యాంక్‌ మారటోరియం నేపథ్యంలో యస్‌తో ఒప్పంద చేసుకున్న అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్స్‌ (యూసీబీ) చెక్‌ ట్రూన్‌కేషన్‌ సిస్టమ్‌ (సీటీసీ)లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రద్దు

Most from this category