News


యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌

Wednesday 25th December 2019
Markets_main1577246126.png-30424

రికార్డుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌
మిశ్రమంగా ముగిసిన ఇండియన్‌ ఏడీఆర్‌లు

క్రిస్మస్‌ సెలవులు ప్రారంభంకానున్న నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మందగించాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్న మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ముగిశాయి. డోజోన్స్‌ 36 పాయింట్లు(0.13 శాతం) క్షీణించి 28,515 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ నామమాత్ర నష్టంతో 3223 వద్ద స్థిరపడింది. అయితే నాస్‌డాక్‌ 7 పాయింట్లు బలపడి 8953 వద్ద ముగిసింది. క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మంగళవారం సైతం దాదాపు రెండు గంటలే ఎక్స్ఛేంజీలు ట్రేడింగ్‌ను నిర్వహించాయి. దీంతో ట్రేడింగ్‌ పరిమాణం తగ్గిపోయింది. రోజువారీ సగటు పరిమాణం 7 బిలియన్‌ షేర్లుకాగా 2.8 బిలియన్‌ షేర్లు మాత్రమే చేతులు మారాయి.

చరిత్రాత్మక గరిష్టాలకు
ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ అమెరికా, చైనా మధ్య మైత్రి కుదరడంతో ఇటీవల అమెరికా స్టాక్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఫలితంగా సోమవారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. చైనాతో ప్రాథమిక దశ ఒప్పందంపై త్వరలో సంతకాలు చేయనున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. మంగళవారం చిప్‌ తయారీ దిగ్గజం ఏఎండీ షేరు 2.4 శాతం జంప్‌ చేయడంతో నాస్‌డాక్‌ వరుసగా తొమ్మిదో రోజు రికార్డ్‌ గరిష్టం వద్ద ముగిసింది. కాగా ఎస్‌అండ్‌పీ ఏడాది(2019) 28 శాతం ‍ర్యాలీ చేయడం విశేషం! వెరసి 2013 తదుపరి ఒక ఏడాదిలో మార్కెట్లు గరిష్ట స్థాయిలో లాభపడే రికార్డువైపు కదులుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఏడీఆర్‌ల తీరిలా
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) మంగళవారం కదలికలు ఎలా ఉన్నాయంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) దాదాపు యథాతథంగా 63.78 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ 0.65 శాతం ఎగసి 41.05 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 0.3 శాతం బలపడి 15.12 డాలర్ల వద్ద, వేదాంతా 0.25 శాతం పుంజుకుని 8.43 డాలర్ల వద్ద ముగిశాయి. అయితే టాటా మోటార్స్‌(టీటీఎం) 1.35 శాతం క్షీణించి 12.32 డాలర్ల వద్ద, ఇన్ఫోసిస్‌(ఇన్ఫీ) 0.5 శాతం నీరసించి 10.24 డాలర్ల వద్ద, విప్రో(డబ్ల్యూఐటీ) 0.26 శాతం నష్టంతో 3.82 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.You may be interested

ఒప్పందంపై త్వరలో సంతకాలు: ట్రంప్‌

Wednesday 25th December 2019

చైనాతో ప్రాథమిక దశ వాణిజ్య ఒప్పందం ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వివాదాలకు చెక్‌ ఏడాదిన్నర కాలంగా చైనాతో కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు త్వరలోనే చెక్‌ పెట్టనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇందుకు వీలుగా ఇటీవల కుదిరిన ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేయనున్నట్లు తెలియజేశారు. వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా ఈ నెల మొదట్లో రెండు దేశాల మధ్య ప్రాధమిక దశ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మరోపక్క ఈ అంశంపై

మార్చి 12 నుంచి ఏవియేషన్‌ షో

Wednesday 25th December 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్‌ షో ‘వింగ్స్‌ ఇండియా’ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో  నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగనుంది. ఫ్లైయింగ్‌ ఫర్‌ ఆల్‌ అన్న నినాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ దీనిని నిర్వహిస్తున్నాయి. 5,000లకుపైగా చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 పైచిలుకు సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ఇక్కడ ప్రదర్శించనున్నాయి.

Most from this category