News


యూఎస్‌ మార్కెట్లకు కరోనా వణుకు

Saturday 25th January 2020
Markets_main1579925080.png-31191

ఇంట్రాడేలో డోజోన్స్‌ పతనం
ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు డీలా
టాటా మోటార్స్‌ 1.4 శాతం డౌన్‌

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా ఇల్లినాయిస్‌లో ఒక వ్యక్తికి సోకినట్లు వెల్లడికావడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో డోడోన్స్‌ ఇండెక్స్‌ తొలుత 300 పాయింట్లు పతనమైంది. తదుపరి కొంతమేర కోలుకుంది. చివరికి శుక్రవారం డోజోన్స్‌ 170 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 28,990 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(0.9 శాతం) తక్కువగా 3,295 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ 76 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 9,141 వద్ద ముగిసింది. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా మందగమనంలో పడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా వైరస్‌ మరిన్ని సమస్యలు సృష్టించవచ్చన్న భయాలు వ్యాపిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. 2014లో తలెత్తన ఎబోలా, 2003లో కనిపించిన సార్స్‌ తదితరాల మాదిరిగా ప్రస్తుతం కరోనా వైరస్‌ పలు దేశాలను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు వివరించారు.   

ఎయిర్‌లైన్స్‌ నేలచూపు
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధానంగా ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. సిటీ తదితర బ్యాంకింగ్‌ కౌంటర్లతోపాటు.. బీమా రంగ షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే పటిష్ట ఫలితాలు ప్రకటించిన అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కుతోడు, టెక్‌ దిగ్గజాలు బలపడటంతో నష్టాలు తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

ఇండియన్‌ ఏడీఆర్‌లు ఇలా
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌)లో వారాంతాన టాటా మోటార్స్‌(టీటీఎం) 1.4 శాతం పతనమై 12.94 డాలర్ల వద్ద నిలవగా.. వేదాంతా(వీఈడీఎల్‌) 0.6 శాతం బలహీనపడి 8.7 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ బాటలో డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 0.85 శాతం క్షీణించి 42 డాలర్లను తాకాగా.. ఇన్ఫోసిస్‌ 0.3 శాతం క్షీణించి 11.03 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్‌ 0.65 శాతం పుంజుకుని 3.8 డాలర్ల వద్ద నిలవగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 0.85 శాతం ఎగసి 59.23 డాలర్ల వద్ద  స్థిరపడింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 0.15 శాతం బలపడి 14.66 డాలర్ల వద్ద ముగిసింది. 



You may be interested

రూ. 40,300పైకి పుత్తడి

Saturday 25th January 2020

మళ్లీ పెరిగిన బంగారం ధర.. గత రెండు మూడురోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర గత రాత్రి ప్రపంచ మార్కెట్లో1,560 నుంచి 1,575.20 గరిష్టస్థాయికి చేరింది. చివరకు గత రాత్రి న్యూయార్క్‌లో 1571 డాలర్ల వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ శుక్రవారం రాత్రి ఇండియాలోని ఎంసీఎక్స్‌ లో రూ.300పైగా పెరిగి 40352.00 వద్ద స్థిరపడింది. వివిధ దేశాల కరెన్సీలు బలహీనపడడం, ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక

తదుపరి దర్యాప్తు గురించి సమాచారం లేదు

Saturday 25th January 2020

ప్రజావేగు ఫిర్యాదులపై ఇన్ఫోసిస్‌ ప్రకటన న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ కంపెనీ బ్యాలన్స్‌ షీట్లలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కంపెనీఈ సీఈవో, సీఎఫ్‌వోలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజావేగు ఫిర్యాదులపై తదుపరి దర్యాప్తు గురించి సెబీ నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని కంపెనీ ప్రకటించింది. ప్రజావేగు ఫిర్యాదుపై అంతర్గతంగా ఆడిట్‌ విచారణ చేసిన ఇన్ఫోసిస్‌ ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవంటూ సీఈవో సలీల్‌ పరేఖ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది. అయితే, ఈ ఫిర్యాదుపై

Most from this category