News


ఇరాన్‌ షాక్‌- డోజోన్స్‌ పతనం

Saturday 4th January 2020
Markets_main1578109553.png-30659

అమెరికా స్టాక్‌ మార్కెట్లకు అమ్మకాల దెబ్బ
రికార్డ్‌ గరిష్టం నుంచి ఎస్‌అండ్‌పీ వెనక్కి
మైనస్‌లో ముగిసిన నాస్‌డాక్‌ ఇండెక్స్‌

ఇండియన్‌ ఏడీఆర్‌లు డీలా

వారాంతాన మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు అమెరికా స్టాక్‌ మార్కెట్లను దెబ్బకొట్టాయి. దీనికితోడు డిసెంబర్‌లో తయారీ రంగం దశాబ్ద కాలంలో లేనివిధంగా నీరసించినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. వెరసి ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో శుక్రవారం డోజోన్స్‌ 234 పాయింట్లు(0.8 శాతం) పతనమై 28,635 వద్ద ముగిసింది. ఇటీవల రికార్డు గరిష్టాలను చేరుతున్న ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ సైతం 23 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 3,235 వద్ద నిలిచింది. ఇక నాస్‌డాక్‌ 71 పాయింట్ల(0.8 శాతం) నష్టంతో 9,021 వద్ద స్థిరపడింది. 

5 వారాల లాభాలకు బ్రేక్‌
నికరంగా చూస్తే.. గత వారం డోజోన్స్‌ నామమాత్ర నష్టంతో నిలవగా.. ఎస్‌అండ్‌పీ 0.17 శాతం వెనకడుగు వేసింది. ఫలితంగా.. వరుసగా ఐదు వారాలపాటు లాభాలతో నిలిచిన ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ రికార్డుకు బ్రేక్‌ పడింది. అయితే గత వారం నాస్‌డాక్‌  0.16 శాతం పుంజుకోవడం గమనార్హం! బాగ్దాద్‌ విమానాశ్రయంపై డ్రోన్‌ దాడుల ద్వారా గురువారం రాత్రి ఇరాన్‌, ఇరాక్‌ అత్యున్నత మిలటరీ అధికారులను అమెరికా మట్టుబెట్టడంతో ఉన్నట్టుండి మధ్యప్రాచ్యం‍లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి జోరందుకోగా.. ముడిచమురు ధరలకు సైతం రెక్కలొచ్చాయి. ప్రపంచ చమురు సరఫరాలలో మూడోవంతు వాటా కలిగిన ఇరాన్‌, ఇరాక్‌లలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలకు ఆజ్యం పోసినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఎయిర్‌లైన్స్‌ డీలా
ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ 5 శాతం, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ 2 శాతం చొప్పున పతనమయ్యాయి. అయితే ఇరాన్‌ టెన్షన్ల కారణంగా డిఫెన్స్‌ కంపెనీలు నార్త్‌రోప్‌ గ్రుమ్మన్‌ 5.4 శాతం, లాక్‌హీడ్‌ మార్టిన్‌ 3.6 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇక మరోవైపు నాలుగో క్వార్టర్‌లో వాహన అమ్మకాలు పుంజుకున్న వార్తలతో ఆటో దిగ్గజం టెస్లా 3 శాతం ఎగసింది. తద్వారా రికార్డ్‌ గరిష్టానికి చేరింది.

ఏడీఆర్‌ల తీరిలా
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) శుక్రవారం కదలికలు ఎలా ఉన్నాయంటే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 2.7 శాతం పతనమై 62.01 డాలర్లకు చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 2 శాతం క్షీణించి 14.92 డాలర్లను తాకింది. ఈ బాటలో టాటా మోటార్స్‌(టీటీఎం) 2.5 శాతం వెనకడుగుతో 13.18 డాలర్ల వద్ద, వేదాంతా(వీఈడీఎల్‌) 1.8 శాతం నష్టంతో 8.79 డాలర్ల వద్ద నిలవగా.. డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 0.5 శాతం బలహీనపడి 40.26 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇతర కౌంటర్లలో విప్రో(డబ్ల్యూఐటీ) 0.8 శాతం లాభపడి 3.79 డాలర్ల వద్ద, ఇన్ఫోసిస్‌(ఇన్ఫీ) 0.2 శాతం పుంజుకుని 10.31 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. You may be interested

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు తప్పు..

Saturday 4th January 2020

కేసు రికార్డుకు పూర్తి విరుద్ధం మిస్త్రీ పునర్నియామకం ఆదేశాలపై సుప్రీంకు రతన్‌ టాటా టాటా ట్రస్టులు, గ్రూప్‌ సంస్థలు కూడా న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలతో  మిస్త్రీ, టాటాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. తాజాగా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను సవాలు చేస్తూ టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాతో పాటు టాటా ట్రస్ట్‌లు,

కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా

Saturday 4th January 2020

75 శాతం వాటా కొనుగోలు డీల్‌ విలువ రూ.5,520 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌.. కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో (కేపీసీఎల్‌) 75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. డీల్‌ విలువ రూ.5,520 కోట్లు. కేపీసీఎల్‌ను ప్రమోట్‌ చేస్తున్న సీవీఆర్‌ గ్రూప్‌ నుంచి ఈ వాటాను దక్కించుకుంటోంది. కేపీసీఎల్‌ను రూ.13,572 కోట్లుగా

Most from this category