News


10 ఏళ్ల కనిష్ఠానికి యుఎస్‌ తయారీ రంగం!

Wednesday 2nd October 2019
Markets_main1569995535.png-28672

దీర్ఘకాలంగా కొనసాగతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన సెప్టెంబర్‌ నెలకు సంబంధించి యుఎస్‌ తయారిరంగ డేటా పదేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని ఐఎస్‌ఎం(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సప్లే మేనేజ్‌మెంట్‌) ఇండెక్స్‌ పేర్కొంది. జులై నెలలో 49.1 శాతంగా ఉన్న తయారిరంగం పనితీరు డేటా, సెప్టెంబర్‌లో 47.8 శాతానికి పడిపోయిందని, 2009 జూన్‌ తర్వాత ఇదే కనిష్ఠ స్థాయని ఈ డేటా పేర్కొంది. కాగా సెప్టెంబర్‌లో ఈ డేటా 50.2 శాతంగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేసినప్పటికీ పదేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో యుఎస్‌ మాంద్య భయాలు తిరిగి పంజుకున్నాయి. ఐఎస్‌ఎం ఇండెక్స్‌లో 50 స్థాయి కంటే దిగువన ఉంటే తయారిరంగం పనితీరు తగ్గుముఖం పడుతుందని అర్థం. 

అమెరికా స్టాక్‌ సూచీలు క్రాష్‌....
   తయారి రంగం పనితీరు పదేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో గత సెషన్‌లో యుఎస్‌ డాలర్‌-జపాన్‌ యెన్‌తో పోల్చుకుంటే రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.  అంతేకాకుండా ఐఎస్‌ఎం డేటా విడుదలయ్యాక యుఎస్‌ మార్కెట్‌లు భారీగా పడిపోయాయి. గత సెషన్‌లో డోజోన్స్‌ ఇండస్ట్రియల్ ఏవరేజ్‌ 344 పాయింట్లు లేదా 1.3 శాతం కోల్పోయి 26,573 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 1.2 శాతం నష్టపోయి 2,940 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 1.1 శాతం పడిపోయి 7,909 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.



You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Wednesday 2nd October 2019

మహాత్మగాంధీ జయంతి సందర్భం‍గా బుధవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా గురువారం (3న) ప్రారంభమవుతుంది. బలహీన ఆర్థిక గణాంకాల నమోదు, సెప్టెంబర్‌ అటోరంగ షేర్ల విక్రయాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం, పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభ భయాలు, సెప్టెంబర్‌ తయారీ

కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్షకు

Wednesday 2nd October 2019

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. ఇందులో 75వేల మందికి పైగా మహిళలు భారత్‌లోనే పనిచేస్తుండడం గమనార్హం. మొత్తం ఉద్యోగులు రూ.2.88 లక్షల మందిలో మహిళలు 34 శాతానికి చేరినట్టు కాగ్నిజంట్‌ తెలిపింది. భారత్‌లోని మొత్తం ఉద్యోగుల పరంగా చూస్తే మహిళా ఉద్యోగులు 35 శాతంగా ఉన్నారు. 100కు పైగా దేశాలకు చెందిన మహిళలు సంస్థలో పనిచేస్తున్నారు. కనీసం

Most from this category