STOCKS

News


భారత్‌లోకి మరిన్ని విదేశీ ఫండ్స్‌ వచ్చేందుకు సిద్ధం!

Thursday 14th November 2019
Markets_main1573712195.png-29583

యుఎస్‌, యురోప్‌ ఫండ్స్‌, ఇండియా మార్కెట్‌లో తమ వెయిటేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, అధిక మొత్తంలో ఎఫ్‌ఐఐలు(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) ఇండియా ఈక్విటీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, గ్లోబల్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఇండియా హెడ్‌, సునిల్‌ ఖైతాన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. మిగిలిన అంశాలు ఆయన మాటల్లో..
చెల్లింపుల రంగం ఆకర్షిస్తోంది..
విస్తృతమైన వినియోగదారుల వృద్థి, ఆ వృద్ధికి ఫైనాన్సింగ్‌ సమకూర్చగలిగే కంపెనీలకు మార్కెట్‌లో చాలా ఆకర్షణ ఉంది. ఈ రంగంలో  చెల్లింపులు, సాంకేతికత, కన్జ్యుమర్‌ ఫైనాన్స్‌ వంటి అంశాలలో చాలా అవకాశాలున్నాయి. చెల్లింపుల రంగంలో  పెద్ద కంపెనీలున్నప్పటికి చాలా వరకు స్టార్టప్‌లున్నాయి. అందువలన  చెల్లింపుల రంగం నుంచి నమోదైన ఏ కంపెనీ అయినా అధిక మొత్తంలో ఎఫ్‌ఐఐలు, డీఐఐలను ఆకర్షిస్తుంది.
ఈక్విటీల్లోకి ఎఫ్‌ఐఐలు.. 
    లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఈ ఏడాది మందకొడిగా ఉంటుందని ప్రారంభంలోనే ఊహించాం . అయినప్పటికి ఫిబ్రవరి, మే మధ్య కాలంలో చాలా మంచి ఒప్పందాలు జరిగాయి. స్థిరమైన రాజకీయ వాతావరణం ఉండడంతో ముందకెళ్లే కొద్ది మంచి వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. మంచి కంపెనీలు డీఐఐ(దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు)లను, ఎఫ్‌ఐఐలను ఆకర్షిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలను పరిశీలిస్తే..లిక్విడిటీ లభ్యత మెరుగుపడింది. నిధులను సమీకరించడానికి ఎన్‌బీఎఫ్‌సీలు సమీపకాలంలో మార్కెట్ల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కానీ అంతకంటే ముందు ఈ కంపెనీలు వాటి బ్యాలెన్స్‌ షీట్లను క్లీన్‌ చేసుకోవాలి. తరువాత నిధుల సమీకరణకు రావాలి.
ప్రభుత్వ నిర్ణయాలు ఎఫ్‌ఐఐలను ఆకర్షిస్తున్నాయి..
సంస్థాగత ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తిగానే ఉన్నారు. కానీ ఈ ఆసక్తి డిజిన్వెస్ట్‌మెంట్‌ చేసే కంపెనీపై అధికంగా ఆధారపడివుంది. దేశీయంగా మంచి వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసేందుకు కొన్ని పెద్ద యుఎస్‌, యూరప్‌ ఫండ్స్‌ సిద్ధమవుతున్నాయి. ఇవి ఇండియా ఈక్విటీ మార్కెట్‌లలో తమ వెయిటేజ్‌ను పెంచుకునేందుకు సిద్ధపడుతున్నాయి. 
    ‍స్వల్పకాలంలో ప్రభావం చూపనప్పటికి, దీర్ఘకాలంలో ప్రయోజనాలను చేకూర్చే నిర్ణయాలను తీసుకునే ప్రభుత్వాలను విదేశీ ఇన్వెస్టర్లు  ఇష్టపడుతున్నారు.  అందుకే ఎఫ్‌పీఐలు  ప్రస్తుత ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. అంతేకాకుండా దేశీయంగా న్యాయ నిబంధనలు మెరుగువుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, జీఎస్‌టీ వంటి కష్ట తరమైన సంస్కరణలు జరిగాయని చాలా వరకూ ఫండ్‌ మేనేజర్లు నాతో చెప్పారు. ఈ సంస్కరణలు తీసుకురావడం వలన ఏర్పడిన స్వల్ప కాల సమస్యలను ఇండియా అధిగమించినట్టనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ ఫండ్స్‌ ఇండియాపై తమ వెయిటేజ్‌ను పెంచుకుంటున్నాయి.
ఫ్లోటింగ్‌ పరిమితి..
 అంతర్జాతీయంగా చాలా వరకు అభివృద్ధి చెందిన మార్కెట్‌లో కంపెనీల ఫ్రీ ప్లోట్‌ ఈక్విటీ పరిమితి 35 శాతంగా ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పరిమితి లేదు. ఒక వేళ  ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పినట్టు ఫ్రీ ప్లోట్‌ ఈక్విటీ పరిమితిని 35 శాతానికి పెంచితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా ఎఫ్‌ఐఐల నుంచి మార్కెట్‌కు 40 నుంచి 45 బిలియన్‌ డాలర్ల నిధులు అవసరమవుతాయి. You may be interested

డివిడెండ్‌ టాక్స్‌ ఇన్వెస్టర్లకి మళ్లింపు?

Thursday 14th November 2019

ఇప్పటివరకు కంపెనీలు చెల్లిస్తూ వస్తున్న డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌(డీడీటీ)లో మార్పులు తీసుకురావాలని  ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను సరళీకరణలతో విదేశీ నిధులను ఆకర్షించాలని ఇటీవలి కాలంలో ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తూ వస్తోంది. వీటిలో భాగంగా రాబోయే బడ్జెట్లో డీడీటీని డివిడెండ్‌ పొందిన వాటాదారులకు చెల్లించిన తర్వాత వసూల చేసేలా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. ఇప్పటివరకు డీడీటీని కంపెనీలే చెల్లిస్తూ వస్తున్నాయి. తాజా మార్పు విషయాన్ని

రెడ్‌మి నోట్ 8 ఫ్లాష్ సేల్ ప్రారంభం

Thursday 14th November 2019

ప్రముఖ చైనా కంపెనీ షియోమి యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 8 క్రితం నెలలో  ఇండియాలో విడుదల అయింది. గత నెలలో లాంచ్ అయినప్పటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్స్ ద్వారా మాత్రమే లభిస్తున్నాయి. అందులో భాగంలో మరొక ఫ్లాష్ సేల్స్‌ ఆఫర్‌ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానునుంది. బడ్జెట్‌ ఫోన్‌గా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌లైన అమెజాన్‌, ఫ్లిఫ్‌ కార్ట్‌,

Most from this category