News


రికార్డుల మోతమోగించిన అమెరికా మార్కెట్లు!

Saturday 16th November 2019
Markets_main1573880006.png-29638

 అమెరికా ఆర్థిక డేటా మిశ్రమంగా ఉన్నప్పటికి అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు పెరగడంతో శుక్రవారం సెషన్‌లో యుఎస్‌ ఈక్విటీ మార్కెట్లు కొత్త రికార్డులను తాకాయి. యుఎస్‌​ డోజోన్స్‌ శుక్రవారం సెషన్‌లో మొదటిసారిగా 28,000 స్థాయిని తాకింది. దీంతో వరుసగా నాలుగు వారాలలో డోజోన్స్‌ లాభాల్లో ముగిసినట్టయ్యింది. అంతేకాకుండా ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ వరుసగా ఆరో వారంలో కూడా  లాభాల్లో ముగిసింది. దీంతో ఈ ఇండెక్స్‌ నవంబర్‌ 2017 తర్వాత దీర్ఘకాలంపాటు లాభాల్లో కొనసాగినట్టయ్యింది.  యుఎస్‌ డోజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఇండెక్స్‌ శుక్రవారం సెషన్‌లో 222.93 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 28,004.89 స్థాయికి చేరుకుంది. అదేవిధంగా ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌  23.83 పాయింట్లు లేదా 0.77 శాతం లాభపడి 3,120.46 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 61.81 పాయింట్లు లేదా 0.73 శాతం పెరిగి 8,540.83 వద్ద ముగిశాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డోజోన్స్‌ ఇండెక్స్‌ 20.05 శాతం లాభపడింది. అదేవిధంగా ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 24.48 శాతం, నాస్‌డాక్‌ 28.72 శాతం లాభపడ్డాయి. 
మార్కెట్లు ఎందుకు పెరిగాయి?
యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల మధ్య చర్చలు పాజిటివ్‌గా సాగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. ‘యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని ఇన్వెస్టర్లు సీరియస్‌గా తీసుకుంటున్నారు’ అని ఏజే బెల్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ డైరక్టర్‌, రస్‌ మౌల్డ్‌ అన్నారు. ‘ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు బాగా జరగుతున్నాయని వైట్‌ హౌస్‌ ఆర్థిక సలహాదారు లారీ కడ్లో గురువారం తెలిపారు. ఫలితంగా యుకే, యురొప్‌, చాలా వరకు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఒప్పందం దశకు చేరుకున్నాయని, కానీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇంకా సిద్ధం కాలేదని కడ్లో గురువారం అన్నారు.



You may be interested

వొడాఫోన్‌ ఐడియాపై రేటింగ్‌ సంస్థల డేగకన్ను!

Saturday 16th November 2019

వారంలో మరో డౌన్‌గ్రేడింగ్‌ ఛాన్సులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వొడాఫోన్‌ ఐడియా కంపెనీ(వీఐఎల్‌)పై రేటింగ్‌ కంపెనీలు నిశితంగా దృష్టి సారించాయి. రూ. 51వేల కోట్ల నష్టం ప్రకటించిన వీఐఎల్‌ తన అప్పుల నుంచి ఎలా బయటపడుతుందోనని ఏజన్సీలు పరిశీలిస్తున్నాయి. గత నెల సుప్రీం తీర్పుఅనంతరం క్రిసిల్‌, కేర్‌ రేటింగ్స్‌లు వీఐఎల్‌పై నెగిటివ్‌ క్రెడిట్‌వాచ్‌ను ఉంచాయి. దీంతో పాటు  వీఐఎల్‌ బ్యాంకు లోన్‌ సదుపాయాన్ని, ఎన్‌సీడీలను కేర్‌ రేటింగ్స్‌ ఏ నుంచి ఏ

రెండవరోజూ రూపాయికి లాభాలు

Saturday 16th November 2019

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో శుక్రవారం వరుసగా రెండవరోజూ రూపాయి లాభాలను చూసింది. డాలర్‌ మారకంలో 18పైసలు లాభపడి 71.78 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్ల సానుకూల వైఖరి,  క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత తగ్గుతుందన్న అంచనాలు దీనికి కారణం. అయితే వారం మొత్తంగా చూస్తే, రూపాయి 50 పైసలు నష్టపోయింది. 

Most from this category