News


క్యూ2 ఫలితాలే నడిపిస్తాయ్‌ .....!

Monday 14th October 2019
Markets_main1571020167.png-28852

  • ఈ వారంలో దిగ్గజ కంపెనీల క్యూ2 ఫలితాలు 
  • సానుకూల ప్రభావం చూపనున్న అమెరికా-చైనాల పాక్షిక ఒప్పందం 
  • నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు 
  • ఈ వారంలోనే ఆర్‌బీఐ పాలసీ మినట్స్‌
  • ఈ వారం మార్కెట్‌ ప్రభావిత అంశాలు 


ఈ వారంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్తాన్‌ యూనిలివర్‌, విప్రో, అంబుజా,  తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరోవైపు నేడు (సోమవారం) విడుదలయ్యే రిటైల్‌, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల, గత శుక్రవారం వెల్లడైన పారిశ్రామికోత్పత్తి గణాంకాల  ప్రభావం కూడా మార్కెట్‌పై  ఉంటుందని వారంటున్నారు. 

పాక్షిక ఒప్పందం....
గత 15 నెలలుగా జరుగుతున్న అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి గత శుక్రవారం జరిగిన పాక్షిక ఒప్పందంతో ఒకింత తెరపడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చు. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమంటే ఆ ప్రభావం మన మార్కెట్‌పై ప్రతికూలంగానే ఉంటుంది. 

నేడు రిటైల్‌ గణాంకాలు...
నేడు సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్‌, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. రేపు(ఈ నెల 15న) వాణిజ్య శేషం గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 1-4న జరిన ఆర్‌బీఐ మెనేటరీ పాలసీ సమావేశ వివరాలు ఈ నెల 18న(శుక్రవారం) వెల్లడవుతాయి. 

ఒడిదుడుకులు...
ఫలితాల సీజన్‌ ఆరంభమై ఇది రెండో వారం. ఈ వారంలో దాదాపు 96 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,  హిందుస్తాన్‌ యూనిలివర్‌, ఎస్‌బీఐ లైఫ్‌, విప్రో, ఏసీసీ, జీ ఎంటర్‌టైన్మెంట్‌, హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్‌, అంబుజా సిమెంట్స్‌, ఎల్ అండ్‌ టీ ఫైనాన్స్‌, టీవీఎస్‌ మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, పీవీఆర్‌,  ఈ జాబితాలో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు మార్కెట్‌ మూడ్‌ను నిర్దేశిస్తాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ జిమీత్‌ మోదీ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఫలితాల వెల్లడి కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ ముస్తఫా నదీమ్‌ అంచనా వేస్తున్నారు. 

ఇక అంతర్జాతీయంగా చూస్తే, చైనా క్యూ3 జీడీపీ గణాంకాలు ఈ నెల 18న వస్తాయి. అమెరికా సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్‌ అమ్మకాల వివరాలు ఈ నెల 16న (బుధవారం) వస్తాయి. 


రూ.6,200 కోట్ల విదేశీ నిధులు వెనక్కి
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.6,200 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.4,955 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.1,262 కోట్లు చొప్పున మొత్తం రూ.6,217 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  అంతర్జాతీయ వృద్ధి భయాలు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోవడం దీనికి కారణాలు. కంపెనీల క్యూ2 ఫలితాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక మందగమనాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు తదితర అంశాలపై విదేశీ నిధుల భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులంటున్నారు. 



You may be interested

38,400పైన ముగిస్తేనే ర్యాలీ ...

Monday 14th October 2019

ఒకవైపు దేశీయంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, మరోవైపు అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఆశలతో భారత్‌ స్టాక్‌సూచీలు గతవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అలాగే ఈ సీజన్‌లో తొలుతగా వెలువడిన ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, టీసీఎస్‌ల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చడం కూడా సూచీల్ని ఊగిసలాటకు లోనుచేశాయి. క్యూ2 ఫలితాల పట్ల మార్కెట్‌కు పెద్దగా అంచనాలు లేనప్పటికీ, కార్పొరేట్లు ఇన్వెస్టర్లకు షాక్‌కు గురిచేస్తే మాత్రం...పన్ను కోతతో పెరిగిన

ఆర్థిక మందగమనంలో సురక్షిత మార్గాలు

Monday 14th October 2019

ఆర్థిక మందగమనం... నేడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పదం. ఎందుకంటే దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. జూన్‌ త్రైమాసికంలో కేవలం 5 శాతం ఆర్థిక వృద్ధే నమోదైంది. దేశంలో వినిమయ డిమాండ్‌ తగ్గింది. ఆటోమొబైల్‌ రంగంలో వాహనాలకు డిమాండ్‌ దారుణంగా పడిపోయింది. ఇవన్నీ అంతర్జాతీయ ఆర్థిక మందగమనానికి తోడు, దేశీయంగా చేపట్టిన పలు సంస్కరణల ప్రభావాలే. అయితే, ఆర్థిక మందగమనం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలు నేర్పుతుందనడంలో

Most from this category