News


యూఎస్‌-చైనా ట్రేడ్‌ డీల్‌-ఉపయోగమేంటి?

Thursday 16th January 2020
Markets_main1579150100.png-30959

అమలు కష్టమేనంటున్న నిపుణులు

సుమారు ఏడాదిన్నర కాలంగా అమెరికా, చైనా మధ్య కొన’..సాగుతున్న వాణిజ్య వివాదాలకు ఎట్టకేలకు తాత్కాలికంగా చెక్‌ పడింది. బుధవారం రెండు దేశాల మధ్య వాణిజ్య మైత్రికి తెరలేచింది. వెరసి రెండు దేశాలూ తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో రెండో దశ డీల్‌ను కుదుర్చుకునేందుకు త్వరలోనే చర్చలు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా.. ఈ ఒప్పందాలను మరింత విస్తరించుకునే అంశంలో పలువురు విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య డీల్‌ అమలు, తదితర అంశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్న విషయం విదితమే. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య మైత్రికి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

ఒప్పందం ఇలా..
రెండేళ్ల కాలంలో 200 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రతిగా 120 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై విధిస్తున్న 15 శాతం అదనపు టారిఫ్‌లను 7.5 శాతానికి అమెరికా తగ్గించనుంది. డీల్‌లో భాగంగా చైనా కరెన్సీ విలువను కృత్రిమంగా నిర్ణయించడం(మ్యానిప్యులేషన్‌) మానుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా అమెరికన్‌ టెక్నాలజీ, కార్పొరేట్‌ రహస్యాలను చైనా తస్కరించకూడదు. స్థానిక కంపెనీలతో భాగస్వామ్య సంస్థలను ఏర్పాటు చేయడంలో టక్నాలజీని పంచమంటూ అమెరికా కంపెనీలపై చైనా ఒత్తిడి తీసుకురావడం మానుకోవలసి ఉంటుంది. టెక్నాలజీలను సొంతం చేసుకునేందుకు వీలుగా విదేశీ కంపెనీల కొనుగోలును నిలిపివేయవలసి ఉంటుంది. ఈ అంశాల అమలుకు చైనా నెల రోజుల్లోగా ఆమోదం(కమిట్‌మెంట్‌) తెలియజేయవలసి ఉన్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

ఇతర వివరాలు
అమెరికా నుంచి విమాన కొనుగోళ్లుసహా దాదాపు 78 బిలియన్‌ డాలర్ల విలువైన తయారీ రంగ ప్రొడక్టులు, 32 బిలియన్‌ డాలర్ల వ్యవసాయోత్పత్తులు, 52 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనం, 38 బిలియన్‌ డాలర్ల విలువైన సర్వీసులను 2021 డిసెంబర్‌కల్లా చైనా కొనుగోలు చేయవలసి ఉంటుంది. డీల్‌కు బేస్‌గా పేర్కొన్న 2017లో చైనా 24 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసింది. అంతేకాకుండా రెండేళ్లలో 50 బిలియన్‌ డాలర్ల చమురు, గ్యాస్‌ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయవలసి ఉంటుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇప్పటికే తగినంత డిమాండ్‌ లేక ఇంధన నిల్వలు పోగుపడుతున్న నేపథ్యంలో డీల్‌ అమలు కష్టతరమేనంటూ కొంతమంది విశ్లేషకులు పెదవి విరుస్తుండటం​గమనార్హం!
 You may be interested

దీర్ఘకాలిక లాభాలపై పన్ను ఎత్తివేత?

Thursday 16th January 2020

ఎల్‌టీసీజీ పన్నుకు చెక్‌ కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీర్ఘకాలిక లాభాలపై పన్ను విధింపును తొలగించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గత బడ్జెట్‌(2019)లో కేంద్ర ఆర్థిక శాఖ దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాల(ఎల్‌టీసీజీ) విషయంలో పన్ను విధింపును ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఈ చర్యపై పలువర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పన్ను సలహాదారులు, నిపుణులతో ఎల్‌టీసీజీపై పన్ను తొలగింపు అంశంపై చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా

ప్రారంభంలోనే సూచీలు కొత్త రికార్డు

Thursday 16th January 2020

సూచీలు గురువారం ఫ్లాట్‌గా మొదలైనప్పటికీ.., ప్రారంభంలోనే కొత్త రికార్డులను అధిగమించాయి. ప్రపంచమార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న  సూచీలు ఫ్లాట్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్లు లాభంతో  41,924.74 వద్ద నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 12,347 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలోనే కొనుగోళ్లు విరివిరిగా జరగడంతో సూచీలు కొంత సేపటికే రికార్డు స్థాయిని అందుకున్నాయి. ఉదయం గం.9:30ని.కు సెన్సెక్స్‌ క్రితం ముగింపు(41,872)తో పోలిస్తే 133 పాయింట్ల

Most from this category