ఆర్బీఐ ముందే మేల్కొని ఉండాల్సింది
By Sakshi

ముంబై: దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మొండి బకాయిల (ఎన్పీఏలు) సమస్య వెనుక బ్యాంకులు, ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు వైఫల్యం కూడా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అంగీకరించారు. బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలను ఇచ్చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం సైతం తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయిందని చెప్పారాయన. ‘‘ఆఖరుకు ఆర్బీఐ అయినా ముందుగా స్పందించి ఉండాల్సింది’’ అన్నారాయన. ప్రభుత్వంతో విభేదాల కారణంగా గతేడాది డిసెంబర్ 10న ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత తొలిసారిగా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ఆందోళనకరమైన అంశాలపై ఉర్జిత్ పటేల్ మాట్లాడారు. ‘‘ప్రస్తుత మూలధన నిధులు కూడా ఎక్కువ చేసి చూపించినవే. భారీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఇవి సరిపోవు. అసలు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చామో తెలుసా? 2014కు ముందు అన్ని పక్షాలూ తమ పాత్రలను సమర్థంగా నిర్వహించడంలో విఫలమయ్యాయి. బ్యాంకులు, నియంత్రణ సంస్థ (ఆర్బీఐ), ప్రభుత్వం కూడా’’ అని ఉర్జిత్ పటేల్ స్పష్టంచేశారు. 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారడం, ఆర్బీఐ గవర్నరు హోదాలో రఘురామ్ రాజన్ బ్యాంకుల ఆస్తుల నాణ్యతను మదింపు చేయడంతో భారీ స్థాయిలో ఎన్పీఏల పుట్ట బయటపడిన విషయం తెలిసిందే. రఘురామ్ రాజన్ హయాం నుంచి పటేల్ ఆర్బీఐలో వివిధ హోదాల్లో మొత్తం ఐదేళ్లకు పైగా పనిచేశారు. సమస్యను కార్పెట్ కింద చుట్టేయడం ఫలితాన్నివ్వదని, భవిష్యత్తులో రుణ వితరణ సమర్థవంతంగా ఉండాలని పటేల్ అభిప్రాయపడ్డారు.
ఎన్బీఎఫ్సీ ఆస్తులను సైతం సమీక్షించాలి
ఆర్థిక వ్యవస్థతో అంతర్గతంగా అనుసంధానమై ఉన్న దృష్ట్యా ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను సమీక్షించడం తప్పనిసరి అని ఉర్జిత్ పటేల్ ఉద్ఘాటించారు. సామాజిక రంగ అవసరాలు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకోలేకపోవడం వంటి అంశాల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరిగిందని చెప్పారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధుల సాయం పెరిగినట్టు తెలిపారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు బలవంతం చేయడంపైనా పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బలహీన బ్యాంకులను విలీనం చేసుకునే బ్యాంకుల విలువ హరించుకుపోతుందన్నారు. ఎల్ఐసీతో కొనుగోలు చేయించిన ఐడీబీఐ బ్యాంకును చాలా సమస్యాత్మక బ్యాంకుగా అభివర్ణించారు.
You may be interested
అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో రుయాలకు చుక్కెదురు
Friday 5th July 2019పిటిషన్‌ను తిరస్కరించిన ఎన్సీఎల్ఏటీ ఆర్సెలర్ మిట్టల్ రూ.42వేల కోట్ల బిడ్‌కు ఆమోదం ఎస్సార్ స్టీల్ కేసులో తీర్పు న్యూఢిల్లీ: రుయాల చివరి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆర్సెలర్ మిట్టల్ వేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ అర్హతలను సవాలు చేస్తూ రుయాలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీ కొట్టివేయడంతోపాటు, ఆర్సెలర్ బిడ్‌కు పచ్చజెండా ఊపింది. ఆర్సెలర్ మిట్టల్
గేరు మార్చు... స్పీడు పెంచు
Friday 5th July 2019- భారత్ టేకాఫ్‌కు ఇదే సరైన సమయం - నిలకడగా 8 శాతం వృద్ధి సాధించాలి - ఇందుకు సంస్కరణల ఊతం కావాలి - అప్పుడే 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యం - ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాలే కీలకం - ఈసారి వృద్ధి రేటు మాత్రం 7 శాతంగా ఉండొచ్చు - చమురు ధరలు మరింత తగ్గే అవకాశముంది - పెరగనున్న డిమాండ్, బ్యాంక్ రుణాలు - చిన్న సంస్థలు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి - ఎకానమీపై