News


52-వారాల గరిష్టానికి యూపీఎల్‌

Thursday 4th July 2019
Markets_main1562233748.png-26798

పంట ర‌క్షణ‌ ఉత్పత్తుల త‌యారీ కంపెనీ యూపీఎల్(యునైటెడ్ పాస్పర‌స్ లిమిటెడ్‌) కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 52-వారాల గరిష్టాన్ని తాకాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.654.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వర్షకాల సీజన్‌తో కంపెనీ కార్యకలాపాలు ఊపందుకుంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ షేరు ధర 8.30శాతం పెరిగి రూ.705.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఈ ధర షేరు 52-వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈఏడాది(2019) ప్రారంభం నుంచి షేరు 36శాతం లాభాలు ఇన్వెన్టర్లు పంచింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు ధర(రూ.651.75)తో పోలిస్తే రూ.7శాతం లాభంతో రూ.698.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.358.60 రూ.705.90లుగా నమోదయ్యాయి. 



You may be interested

బంగారంలో పెట్టుబడులు పెట్టండి: మార్క్‌ మోబియస్‌

Thursday 4th July 2019

వడ్డి రేట్లు తగ్గుతుండడం, బంగారం కొనుగోళ్లను సెంట్రల్‌ బ్యాంకులు పొడిగించడానికి సిద్ధపడడం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థీతులలో అనిశ్చితి నెలకొని ఉండడం, క్రిప్టోకరెన్సీకి డిమాండ్‌ పెరగడం వంటి సంకేతాల వలన బంగారం గరిష్ఠ స్థాయిలను తాకనుందని, ఇది ఔన్సు 1,500 డాలర్ల పైకి ఎగబాకనుందని పెట్టుబడి నిపుణుడు మార్క్‌ మోబీస్‌ అన్నారు. మూడు దశాబ్దాలు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌లో ఇన్వెస్టమెంట్‌లో పనిచేసి గత ఏడాది మోబియస్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌పీ పేరుతో ఆయన కొత్తగా

ఎఫ్‌పీఐల పెట్టుబడులు మరింత సరళం: ఆర్థిక సర్వే

Thursday 4th July 2019

ప్రతి ఏడాది ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థిక శాఖ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. రేపు బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే విడుదలయ్యింది. ఇందులోని ముఖ్యమైన అంశాలు.. -స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం 2020 ఆర్థికసంవత్సరపు(ఎఫ్‌వై) జీడీపీ రేటును 7 శాతంగా అంచనా వేసింది. - ఎఫ్‌వై20లో వ్యవసాయ, అటవి, మత్య్స రంగాల వృద్ధి రేటును 2.9 శాతంగా ఊహించింది. -ఎఫ్‌వై 2018లో

Most from this category