News


ఎంతో ర్యాలీ చేసినా.. ఇంకా సత్తా..!

Wednesday 11th December 2019
Markets_main1576006010.png-30159

మన మార్కెట్లో మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌ (ఎన్నో రెట్లు పెరిగినవి) ఎన్నో ఉన్నాయి. 2001 నుంచి 2019 డిసెంబర్‌ మధ్య కాలంలో 173 స్టాక్స్‌ పది రెట్లకు పైగా వృద్ధి చెందాయి. కొన్ని స్టాక్స్‌ 2,00,000 శాతం కూడా పెరిగాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతోపాటు మరెన్నో సంక్షోభాలను ఈ మధ్య కాలంలో మార్కెట్లు అధిగమించాయి. ఇదే కాలంలో ఈ స్టాక్స్‌ తమ సత్తా చూపించాయి. అయితే, వీటిలో కొన్నింటి పట్ల విశ్లేషకులు ఇప్పటికీ సానుకూలంగా ఉన్నారు. భవిష్యత్తులోనూ ఇవి మంచి రాబడులను ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఆ వివరాలే ఇవి...

 

ఎయిర్‌కూలర్ల కంపెనీ సింఫనీ లిమిటెడ్‌ అత్యధిక లాభం ఇచ్చిన కంపెనీ. 2000 డిసెంబర్‌ 29న ఒక్కో షేరు అర్ధ రూపాయి. తాజాగా దీని ధర రూ.1,083. ఈ కాలంలో 2,16,860 శాతం ర్యాలీ చేసింది. అంటే నాడు రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, 19 ఏళ్లలో రూ.2.17 కోట్లుగా మారేది. ఈ స్టాక్‌కు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇస్తూ టార్గెట్‌గా రూ.1,812ను పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌ 1,53,459 శాతం, యూపీఎల్‌ 1,15,318 శాతం చొప్పున గత 19 ఏళ్లలో పెరిగాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఒక్క 2019లోనే ఇప్పటి వరకు 63 శాతం రిటర్నులు ఇచ్చింది. ఈ స్టాక్‌కు 9 బై రేటింగ్‌లు, 6 అవుట్‌ పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌లు, 8 హోల్డ్‌ రేటింగ్‌లు ఉండడం గమనార్హం. 

 

అంతర్జాతీయంగా ఐదు అగ్ర స్థాయి ఆగ్రో కెమికల్‌ కంపెనీల్లో ఒకటిగా అవతరించాలన్నది యూపీఎల్‌ లక్ష్యం. అందుకే ఇటీవలి కాలంలో ఈ కంపెనీ వరుసగా తనకు లాభదాయకం అనిపించిన కంపెనీలను కొనుగోలు చేసుకుంటూ వెళుతోంది. ఈ స్టాక్‌కు రూ.665 టార్గెట్‌తో నిర్మల్‌బంగ్‌ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. ఇక బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 98,777 శాతం ర్యాలీ చేయగా, ఐచర్‌ మోటార్స్‌ 75,996 శాతం గత 19 ఏళ్లలో పెరిగింది. ఏషియన్‌ మార్కెట్‌ సెక్యూరిటీస్‌ బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ స్టాక్‌కు రూ.989 టార్గెట్‌ ఇచ్చింది. ఐచర్‌ మోటార్స్‌కు రూ.25,000 టార్గెట్‌తో మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బై రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. 



You may be interested

రూ. 12 వేల కోట్ల లెక్క తప్పింది!!

Wednesday 11th December 2019

ఆర్‌బీఐ ఆడిట్‌లో పెరిగిన ఎస్‌బీఐ మొండిబాకీలు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సర ఫలితాల్లో దాదాపు రూ.12,000 కోట్ల మేర మొండిబాకీలు బయటపడలేదు. రిజర్వ్‌ బ్యాంకు ఆడిట్‌లో రూ.11,932 కోట్ల మేర వ్యత్యాసం (డైవర్జెన్స్‌) వచ్చినట్లు ఎస్‌బీఐ మంగళవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో.. స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ.1,72,750 కోట్లుగా ఎస్‌బీఐ లెక్కించింది. అయితే, ఇవి మరో రూ.11,932 కోట్లు

నిఫ్టీ.. మరికొంత దిద్దుబాటు!

Wednesday 11th December 2019

నిఫ్టీ మంగళవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ లాభాలను కాపాడుకోలేకపోయింది. సెషన్‌లో ఎక్కువ సమయం పాటు నష్టాల్లోనే కొనసాగింది. ఈ క్రమంలో 11,883 స్థాయిలో ఉన్న స్వల్ప మద్దతును కోల్పోయి దిగువన 11,856 వద్ద ముగిసింది. నికరంగా 80 పాయింట్లు 0.68 శాతం నష్టపోయింది. సోమవారం అనిశ్చయాన్ని సూచించే డోజి ఏర్పాటు తర్వాత ట్రెండ్‌ రివర్సల్‌కు నిఫ్టీ సంకేతం ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో రానున్న

Most from this category