News


ర్యాలీ..పతనం.. రెండూ ఇష్టం లేవా?

Saturday 15th June 2019
Markets_main1560594256.png-26325

ఈ వారం కూడా మార్కెట్‌ స్వల్పరేంజ్‌లోనే కదలాడాయి. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో తీవ్ర కదలికలు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రంగంలో ఇబ్బందులు చివరకు వచ్చినట్లుగా కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. రంగాల వారీగా చూస్తే వారమంతా మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. అయితే మార్కెట్‌ అంతరదృష్టి నెగిటివ్‌గా కనిపిస్తోంది. రంగాల్లో ఎఫ్‌ఎంసీజీ కన్సాలిడేషన్‌ దశలో, ఫార్మా డౌన్‌ట్రెండ్‌లో, ఐటీ టాపింగ్‌ దశలో, మెటల్స్‌ బాటమ్‌ అవుట్‌లో, చమురు మరియు గ్యాస్‌, రియల్టీ రంగాలు అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. ఇలాంటి వైవిధ్యభరిత ధోరణులు మార్కెట్‌ ఎటూ కదలడానికి ఇష్టపడడం లేదన్న సంకేతాలిస్తాయి. పరిస్థితులు బాగా నెగిటివ్‌గా మారితే నిఫ్టీ ఎన్నికల ఫలితాల రోజు సృష్టించిన గ్యాప్‌ను మరోమారు పరీక్షించవచ్చు. ఇదే జరిగితే బుల్స్‌కు అద్భుతమైన ఆరంభం దొరికినట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు మనలాగే ప్రవర్తిస్తున్నాయి. స్వల్పరేంజ్‌లో కదలాడుతూ భారీ ప్రభావం చూపే అంశాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎనర్జీ ఆధారిత కమోడిటీలు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. క్రూడ్‌, సహజవాయువులు బహుళసంవత్సరాల డౌన్‌ట్రెండ్‌లోకి ఎంటరైనట్లు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రపంచవ్యాప్తంగా మరో బుల్‌ర్యాలీ రావచ్చు. ప్రస్తుతం నిఫ్టీ చాలా నెమ్మదిగా కదులుతోంది. గతవారమంతా నిరోధాన్ని దాటే యత్నాలు చేసి ఫెయిలైంది. అయితే ఈ వారం పతనాన్ని కేవలం కరెక‌్షన్‌గా చెప్పాలి తప్ప బేర్‌మార్కెట్‌ ఆరంభంగా భావించాల్సిన అవసరంలేదని నిపుణుల అంచనా. గత నెల సూచీ చార్టులో ఏర్పడిన 1145- 11650 పాయింట్ల గ్యాప్‌ ఏరియా ఇకపై భారీ మద్దతు స్థాయిగా నిలుస్తుందతి. ప్రస్తుత పతనం ఈ స్థాయి దిగువకు రాకపోవచ్చు. దిగువ స్థాయిల్లో కొనుగోళ్లను పరిశీలించాలి. వచ్చే వారం ఫెడ్‌ రేట్‌పాలసీ ప్రకటించవచ్చు. ఫెడ్‌ కామెంట్లను ప్రపంచ మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయి. వచ్చే వారానికి ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ బ్యాంకులను పరిశీలించవచ్చు. 



You may be interested

నాలుగు అంశాలే నడిపిస్తాయి!

Saturday 15th June 2019

దేశీయ మార్కెట్‌కు ఇవే కీలకం కేంద్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పడడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారింది. ఏడాది సగానికి గడిచిపోతున్న తరుణంలో ఇకపై సూచీల గమనాన్ని కీలకమైన నాలుగు అంశాలు నిర్ధారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  1. ఆర్‌బీఐ రెపోరేటు: ఇప్పటికే ఆర్‌బీఐ రెపోరేటును 5.75 శాతానికి తగ్గించింది. వృద్ధి మందగమనం, వినిమయం తగ్గడమే రేట్లను తగ్గించేందుకు కారణాలు. రేట్‌కట్‌తో పలు రుణాలు సులభంగా దొరికి ఇన్వెస్టర్ల వినిమయం జోరందుకుంటుందని అంచనా 2. క్రూడ్‌ ఆయిల్‌

రూ.60-70 వేల కోట్ల ఎఫ్‌ఐఐలు వస్తాయి!

Saturday 15th June 2019

ఎన్నికల ఫలితాల తర్వాత ఆరు నెలల్లో  వెల్లువెత్తే అవకాశం కొత్త ప్రభుత్వం తీసుకునే ఆర్థిక సంస్కరణలు ముఖ్యం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విదేశి పెట్టుబడిదారులలో సానుకూల దృక్పథం పెరిగింది. బీజేపీ 2014లో కంటే అధిక మెజార్టీతో గెలవడంతో ఆర్థిక సంస్కరణలు ఊపందుకుంటాయనే ఊహాగానాల నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు(ఎఫ్‌ఐఐ) వెల్లువెత్తనున్నాయి. 2019 మే 24 నుంచి 2019 జూన్‌ 13 వరకు నిఫ్టీ 1.4 శాతం లాభాలను చూసింది. ఇందులో ముఖ్యంగా

Most from this category