News


ఈ స్థాయిల్లోనూ పెట్టుబడులకు సౌకర్యమే...: విలియం ఓనీల్‌

Thursday 1st August 2019
Markets_main1564598632.png-27452

బ్రోడర్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే ప్రస్తుతానికి నిఫ్టీలో 19 కంపెనీలు 200డీఎంఏకు పైన ట్రేడ్‌ అవుతుంటే... నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 కంపెనీల్లో 35 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 కంపెనీల్లో 27 శాతం వాటి 200 డీఎంఏకు దిగువన ట్రేడ్‌ అవుతున్నాయని విలియం ఓ నీల్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఖరే తెలిపారు. కేవలం కొన్ని స్టాక్స్‌ మాత్రమే మార్కెట్ల మొత్తం వ్యాల్యూషన్‌ను నడిపిస్తున్న దానికి ఇది సంకేతమన్నారు. మార్కెట్‌ బ్రెడ్త్‌ (లాభ, నష్టాల స్టాక్స్‌ రేషియో) మెరుగుపడాల్సి ఉందని, అప్పుడే నిఫ్టీ నూతన గరిష్టాలకు వెళ్లగలదన్నారు. అప్పటి వరకు ఇన్వెస్టర్లు తట్టుకుని నిలబడగలిగే స్టాక్స్‌కు పరిమితం కావాలని తాము సూచిస్టున్నట్టు చెప్పారు. 

 

భారత మార్కెట్లలో ఈ స్థాయిల్లోనూ పెట్టుబడులు పెట్టే విషయంలో తాము సౌకర్యంగానే ఉన్నట్టు విపిన్‌ ఖరే చెప్పారు. బలమైన వృద్ధి అవకాశాలు, మంచి టెక్నికల్‌ నైపుణ్యాలు ఉన్న వాటిని సెలక్టివ్‌గా ఎంచుకోవడం తమ విధానంలో భాగమని వివరించారు. నిఫ్టీ 20 రెట్ల ఫార్వార్డ్‌ పీఈలో ట్రేడవుతోందని, ఆసియా మార్కెట్లలో ఇది గరిష్ట స్థాయి అని చెప్పారు. 2019-20లో నిఫ్టీ కంపెనీల ఈపీఎస్‌ 20 శాతం వృద్ధి చెందగలదన్న అంచనాతో ఉన్నట్టు తెలిపారు. తక్కువ పీఈలో ట్రేడ్‌ అవుతున్నా కానీ, టెక్నికల్‌గా బలహీనంగా ఉన్న స్టాక్స్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. 

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఏ విధంగా ఉండాలన్న దానికి స్పందిస్తూ... ఇన్వెస్టర్ల రిస్క్‌ సామర్థ్యం, మార్కెట్‌ పరిస్థితులు, పెట్టుబడుల లక్ష్యాల ఆధారంగా ఇది ఉండాలని సూచించారు. చారిత్రకంగా ఈక్విటీ ఇతర అన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ వాహకాల కంటే అధిక రాబడులు ఇచ్చిందని, కానీ ఈ రాబడులు రిస్క్‌తో కూడి ఉంటాయన్నారు. మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకుంటూ, పెరుగుతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు ఈక్విట్లీలో పెట్టుబడుల నిర్వహణ చూసుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే... మార్కెట్‌ గమనం ఆధారంగా కొనుగోలు, అమ్మకాల సూత్రానికి కట్టుబడి ఉండాలన్నారు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీల్లో పెట్టుబడులను బ్యాలన్స్‌ చేసుకోవాల్సి ఉంటుందని, స్టాక్స్‌ ఎంపికలో ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. దూకుడుగా పెట్టుబడులకు పోకుండా, లాభాల స్వీకరణ కూడా ముఖ్యమని హెచ్చరించారు. You may be interested

జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌పై జున్‌జున్‌వాలాకు ఆసక్తి

Thursday 1st August 2019

భారత ఈక్విటీ మార్కెట్లలో పాపులర్‌ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేశ్‌ జున్‌జున్‌వాలా ఫార్మా రంగంలో జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ పట్ల ఎంతో ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ కంపెనీలో అదనంగా మరికొంత ఇన్వెస్ట్‌ చేసి వాటా పెంచుకోవడం గమనార్హం. ఈ మంగళవారం (జూలై 30న) జున్‌జున్‌వాలా జుబిలంట్‌ లైఫ్‌లో 1.10 శాతం వాటాను అంటే 17.5 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో 20,13,626

దుమ్ములేపిన మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్‌బుక్ షేర్లు

Wednesday 31st July 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ భయాలు ఈ ఏడాది మే లో పెరగడంతో అప్పుడు యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత యుఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఈ ఇండెక్స్‌ బాగా రాణించింది. ఇప్పుడీ ఇండెక్స్‌ 3,000 స్థాయికి పైన కొత్త రికార్డులను సృష్ఠిస్తోంది. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ ఈ ఏడాదిలో

Most from this category