STOCKS

News


11,800 స్థాయిని కోల్పోతేనే, మార్కెట్‌ బేర్స్‌ చేతుల్లోకి!

Saturday 30th November 2019
Markets_main1575107533.png-29981

మార్కెట్‌ ధోరణిని చూస్తే, నిఫ్టీ 11,800 స్థాయిని(వారపు ఆధారంగా) కోల్పోతేనే తప్ప ప్రస్తుత అప్‌మూవ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని ట్రేడ్‌బుల్స్‌ సెక్యురిటీస్‌, సీఎండీ దినేష్‌ థక్కర్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
  నిఫ్టీ వరుసగా మూడవ నెలలో కూడా నిలకడగా పెరుగుతూ కదిలింది. ఈ నెలలో నిఫ్టీ సుమారుగా 1.5 శాతం వృద్ధి చెందింది. రంగాల వారిగా చూస్తే, బ్యాంక్‌ నిఫ్టీ, ఫైనాన్సియల్స్‌ ఇప్పటికి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ రోలోవర్‌ మూడు నెలల సగటు కంటే అధికంగా ఉండగా, నిఫ్టీ రోలోవర్‌ మూడు నెలల సగటు కంటే అధికంగా ఉన్నప్పటికి గత నెలలోని రోలోవర్‌ కంటే తక్కువగా నమోదైంది. నిఫ్టీ మూడు నెలల సగటు రోలోవర్‌ 75.31 శాతంగా ఉంటే, డిసెంబర్‌ నెలకు సంబంధించి రోలోవర్‌ 79.64 గా నిలిచింది. అయినప్పటికి గత నెలలో ఏర్పడిన 84.09 శాతం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. అదేవిధంగా బ్యాంక్‌ నిఫ్టీ  రోలోవర్‌ 70.56 శాతంగా ఉంది. ఇది మూడు నెలల సగటు 62.54 శాతం కంటే అధికం. గత నెలలో బ్యాంక్‌ నిఫ్టీ రోలోవర్‌ 63.59 శాతంగా ఉంది. గత సిరీస్‌కు చివరి రోజైన నవంబర్‌ 28 వ తేదీన జరిగిన సెషన్‌లో కూడా బ్యాంక్‌ నిఫ్టీ, నిఫ్టీని అధిగమించింది. పీసీఆర్‌(పుట్‌ కాల్‌ రేసియో) ఓఐ(ఒపెన్‌ ఇంట్రెస్ట్‌) 1.77 కు దగ్గరగా ఉంది. మార్కెట్‌ మూమెంటం కొంత తగ్గినప్పటికి, వారపు ఆధారంగా నిఫ్టీ 11,800 స్థాయి కిందకి దిగితేగాని, ప్రస్తుత మార్కెట్‌ అప్‌మూవ్‌ ఆగదు. కాగా అప్‌సైడ్‌ 12,300 స్థాయిని నిఫ్టీ దాటడం అంత సులభం కాదు. 
   వినియోగ డిమాండ్‌, ప్రైవేట్‌ పెట్టుబడులు బలహీనపడడంతో క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు అంచనావేసినట్టుగానే 5 శాతం దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ట్రెండ్‌ను మార్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై మార్కెట్లు దృష్ఠి సారించనున్నాయి. మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి సమయం కోసం వేచిచూడకండి. నాణ్యమైన స్టాకులపై దృష్ఠి సారించండి. పరిస్థితులు ఎలా ఉన్న నాణ్యమైన స్టాకులు ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్‌లను ఇస్తాయి. నిజాయితీ, నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ ఉన్న కంపెనీలు ఎల్లప్పుడు సంతృప్తికరమైన రిటర్న్‌లను అందిస్తాయి. అందువలన రిస్క్‌తో కూడిన స్టాకులను వెంబడించడం కంటే, బలమైన, నాణ్యమైన స్టాకులను ఎంచుకోండి.You may be interested

వచ్చే ఐదేళ్లలో ఈ 4కంపెనీల ప్రైవేటీకరణ: సీఎల్‌ఎస్‌ఏ

Saturday 30th November 2019

వచ్చే ఐదేళ్లలో భెల్‌, గెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, నాల్కో కంపెనీల ప్రైవేటీకరణ జరగవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ భావిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని సీఎల్‌ఎస్‌ అంచనా వేస్తుంది. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కోల్ ఇండియా వంటి పెద్ద పీఎస్‌యూల ప్రైవేటీకరణకు అవకాశం తక్కువవుండటంతో ఈ  పీఎస్‌యూ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. గడిచిన మూడేళ్లలో ఈటీఎఫ్‌ల ద్వారా

ముడి చమురు 4 శాతం క్రాష్‌!

Saturday 30th November 2019

అమెరికా-చైనా మధ్య రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతోపాటు, అమెరికా చమురు ఉత్పత్తి గరిష్ఠంగా పెరగడంతో గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. యుఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ 4 శాతం మేర పతనమయ్యింది. అయినప్పటికి వచ్చే నెల జరగనున్న ఒపెక్‌ సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను పొడిగించే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో చమురు ధరల నెల సగటు గరిష్టం కంటే పైనే ముగిశాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.44 డాలర్లు పడిపోయి 62.43 డాలర్లకు

Most from this category