News


యస్‌బ్యాంక్‌ వాటా విక్రయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం ..!

Friday 13th March 2020
Markets_main1584093178.png-32465

సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐ వాటా కొనుగోలును కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి.  ఆర్‌బీఐ రూపొందించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక ముసాయిదా ప్రకారం వ్యూహాత్మక ఇన్వెస్టర్లు బ్యాంకులో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడేళ్ల లోపు దీన్ని 26 శాతానికి లోపు తగ్గించుకోవడానికి ఉండదు. ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆర్‌బీఐ యస్ బ్యాంకుపై ఏప్రిల్‌ 3 దాకా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి యస్ బ్యాంక్‌లో రూ. 7,250 కోట్లతో 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు (ఈసీసీబీ) ఆమోదముద్ర వేసినట్లు ఎస్‌బీఐ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.

యస్‌బ్యాంకులో వాటా కొనుగోలుకు సిద్ధమైన ఎల్‌ఐసీ..!?
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యస్‌బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు ఎల్‌ఐసీఐ సిద్ధమైనట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రతి షేరును రూ.10 చొప్పున సుమారు 1.35 బిలియన్‌ ఈక్విటీ షేర్లను ఎల్‌ఐసీఐ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


 ఈ సానుకూలాంశాలతో మార్కెట్‌ భారీ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ... యస్‌ బ్యాంక్‌ షేరు ఇంట్రాడే 10శాతం లాభపడింది. మధ్యాహ్నం 3గంటలకు షేరు క్రితం ముగింపు(రూ.25.05)తో పోలిస్తే 2.50శాతం లాభంతో రూ.25.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

వొడాఫోన్‌ గెలాప్‌- ఎయిర్‌లైన్స్‌ బోర్లా

Friday 13th March 2020

కనిష్టం నుంచి 53 శాతం పెరిగిన వొడా ఐడియా రెండో రోజూ 10 శాతం కుప్పకూలిన స్పైస్‌జెట్‌ ఇంట్రాడేలో 14 శాతం పతనమైన ఇంటర్‌గ్లోబ్‌ ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలకు ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ సహాయక ప్యాకేజీ(బెయిలవుట్‌)ను ప్రకటించే వీలున్నట్లు పెరిగిన అంచనాలు వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఈ కౌంటర్‌ మార్కెట్ల బాటలో వేగంగా టర్న్‌అరౌండ్‌ సాధించింది. అయితే మరోపక్క విమానయానం, టూరిస్ట్‌ వీసాలపై నిషేధం వార్తలతో ఎయిర్‌లైన్స్‌

సరికొత్త కనిష్టానికి రుపీ- ఆపై ప్లస్‌

Friday 13th March 2020

తొలి సెషన్‌లో 74.50కు 2018 అక్టోబర్‌ రికార్డ్‌కు చెక్‌ తదుపరి 74 దిగువకు రికవరీ దేశీ స్టాక్‌ మార్కెట్లతోపాటు తొలి సెషన్‌లో కరెన్సీకి సైతం షాక్‌ తగిలింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 18 పైసలు క్షీణించి 74.39 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఫారెక్స్‌ మార్కెట్లో తొలిసారి దేశీ కరెన్సీ విలువ 74.50కు జారింది. వెరసి ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో నమోదైన చరిత్రాత్మక కనిష్టం 74.48 రికార్డును సవరించింది. ఆపై ఈక్విటీ

Most from this category