News


యూనియన్‌ బ్యాంక్‌ క్రాష్‌

Wednesday 15th May 2019
Markets_main1557916676.png-25759

ప్రభుత్వరంగ బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా(యూబీఐ) షేర్లు బుధవారం ట్రేడింగ్లో పదిశాతం పతనయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను ప్రకటించడంతో పాటు ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు షేరు కొనుగోలు ధరను తగ్గించడం ఇందుకు కారణం. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.75.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మొండిబకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా కంపెనీ గతేడాది చివరి త్రైమాసికంలో రూ.3,370 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మొండి బకాయిలకు మార్చి క్వార్టర్‌లో రూ.5,783 కోట్ల కేటాయింపు జరిగిందని బ్యాంక్‌ వివరించింది. అలాగే తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక నికర ఆదాయం స్వల్పంగా వృద్ధి చెంది రూ.9,621 కోట్లకు చేరింది. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు 10.70శాతం నష్టపోయి రూ.70.75ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.79.25)తో పోలిస్తే 8శాతం నష్టంతో రూ.71.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.61.40లు, రూ.100.30లుగా నమోదయ్యాయి. 



You may be interested

లాభాలు ఒక్కరోజుకే పరిమితం

Wednesday 15th May 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరి గంటలో అమ్మకాలదే పైచేయి కావడంతో బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫలితంగా మార్కెట్‌ లాభాలు ఒకరోజుకే పరమితమయ్యాయి. సెన్సెక్స్‌ 203 పాయింట్లను నష్టపోయి 37,114.88 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 65 పాయింట్లను కోల్పోయి 11,157 వద్ద ముగిసింది. తొమ్మిదిరోజుల వరుస నష్టాల అనంతరం క్రితం రోజు మార్కెట్‌ లాభాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఈ రోజు తీవ్ర నష్టాల్నిచవిచూసింది.

లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 15th May 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ర్యాలీలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. ప్రైవేట్‌రంగ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ లాభపడేందుకు దోహదపడుతుంది. ఆర్‌బీఎల్‌ అ‍త్యధికంగా 2శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.80శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ బ్యాంక్, పీఎన్‌బీ ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. అలాగే ఇదే ఇండెక్స్‌లోని యస్‌బ్యాంక్‌ షేర్లు 6శాతం నష్టపోయాయి. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా,

Most from this category