News


అమ్మో.. ఆప్షన్స్‌!

Thursday 16th May 2019
Markets_main1558002599.png-25782

భారీగా ఉన్న కాల్‌, పుట్‌ ధరలు
అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నఇండెక్స్‌ ఆప్షన్లు
బాగా తగ్గిన ఆప్షన్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌
సాధారణంగా ఒక ఈవెంట్‌ జరిగే సమయంలో మార్కెట్లో వచ్చే తీవ్ర కదలికలు ఆప్షన్‌ ట్రేడర్లకు లాభాలనిస్తుంటాయి. అందుకే ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌ చేసేవారు పెద్ద ఈవెంట్‌ సమయంలో భారీ లాభాల కోసం ఆప్షన్స్‌ను ఎంచుకుంటారు. కానీ ఈ దఫా ఇలాంటి ట్రేడర్లకు పెద్దగా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. సాధారణంగా నెల మధ్యకు వచ్చే సరికి ఆప్షన్స్‌ ప్రీమియంలన్నీ దాదాపు బాగా క్షీణించి ఉంటాయి. దూరపు స్ట్రైక్‌ ప్రైస్‌ ఆప్షన్లైతే బాగా చౌకగా ఉంటాయి. కానీ ప్రస్తుత సీరిస్‌లో దాదాపు వెయ్యి పాయింట్ల అవతల ఉన్న ఆప్షన్స్‌ సైతం భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. లిక్విడిటీ బాగా తగ్గిపోవడం, భారీ ప్రీమియంలతో ఆప్షన్‌ రైటింగ్‌ చేసేందుకు రైటర్లు పెద్దగా ముందుకు రాకపోవడంతో ఆప్షన్‌ బయ్యర్లకు ఆప్షన్స్‌లో ‘ఆప్షన్‌’ లేకుండా పోతోంది. ఈ కారణంగా నిఫ్టీ ఆప్షన్స్‌ ఇంట్రెస్ట్‌(మేసీరిస్‌) గతంలో కన్నా బాగా తక్కువగా ఉంది. నిఫ్టీ  11000, 11300 పాయింట్లకు మధ్యలోని స్ట్రైక్‌ప్రైస్‌లన్నింటి(మే 23 ఎక్స్‌పైరీ) ఓపెన్‌ఇంట్రెస్ట్‌ కేవలం నాలుగు లక్షలే ఉంది. ఇదే సమయంలో దేశీయ వీఐఎక్స్‌ సూచీ నాలుగేళ్ల గరిష్ఠాలకు చేరింది. ప్రస్తుత వీఐఎక్స్‌ 28 వద్ద కదాలడుతోంది. అంటే స్వల్పకాలంలో 11000- 11300 పాయింట్ల మధ్య కదలికలు 2- 3 శాతం వరకు ఉండే ఛాన్సులున్నాయి. అయితే ఆప్షన్‌ రైటర్లు ఈ కదలికలను ఇప్పటికే ప్రైస్‌ఇన్‌ చేయడంతో నిఫ్టీ 3-4 శాతం రేంజ్‌లోని ఆప్షన్లన్నీ భారీ ప్రీమియంల వద్ద ఉన్నాయి. 


ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత మార్పు
ఆప్షన్‌ రైటర్లు సాధారణంగా ప్రతిసారీ లాభాలే పొందుతారు. వారికి కొన్ని కచ్ఛితమైన తార్కిక లెక్కలుంటాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి కదలికలుంటాయో ఎవరూ ఊహించలేరు. అందుకే అటు పుట్‌, ఇటు కాల్‌రైటర్లంతా ముందు జాగ్రత్తగా భారీ ప్రీమియంలను మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే సూచీలు పాజిటివ్‌గా, రాకుంటే నెగిటివ్‌గా స్పందిస్తాయని దాదాపు అందరూ భావిస్తున్నారు. అయితే బీజేపీ ఆధ్వర్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం(అంటే బీజేపీకి గతంలో మెజార్టీ రాకుండా, దాని మిత్రపక్షాల సాయంపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం) ఏర్పడితే మార్కెట్‌ స్తబ్దుగా ఉండొచ్చు. ఇదే జరిగితే అటు పుట్స్‌, ఇటు కాల్స్‌ అన్నింటిలో ప్రీమియం ఆవిరైపోతుంది. ఆ విధంగా ఆప్షన్‌ రైటర్లకు లాభం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొజిషన్లున్న పోర్టుఫోలియో మేనేజర్లు హెడ్జింగ్‌ కోసం ఎక్కువగా పుట్స్‌ కొంటున్నారు. షార్ట్‌ పొజిషన్లున్న వాళ్లు కాల్స్‌ కొంటున్నారు. కానీ అధిక ధర కారణంగా సాధారణ రిటైలర్లు ఈ సారి ఆప్షన్స్‌కు దూరంగా ఉంటున్నారు. మే 19 ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాక పరిస్థితిలో స్పష్టత వస్తుందని, అప్పుడు ప్రీమియంలు దిగిరావచ్చని కొందరు నిపుణుల అంచనా. ఆ సమయంలో ఇబ్బడిముబ్బడిగా ఆప్షన్‌ బయింగ్‌ జరగవచ్చని భావిస్తున్నారు. మే23లోపు ఫలితాలపై పూర్తి స్పష్టత రాకపోతే(కౌంటింగ్‌ ఆలస్యమై) సూచీల్లో తీవ్ర ఒడిదుడుకులు ఖాయంగా కనిపించవచ్చు. సాధారణ రిటైలర్స్‌ ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. You may be interested

ఈ స్మాల్‌క్యాప్స్‌ మార్కెట్‌ ఊగిసలాటకు అతీతమా!

Friday 17th May 2019

ఏడాదికిపైగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి చూస్తూనే ఉన్నాం. ఈ విభాగంలో గత ఏడాది కాలంలో స్టాక్స్‌లో పెట్టుబడులపై లాభాల్లేని పరిస్థితి. ఏవో కొన్ని స్టాక్స్‌ మినహా అన్నీ నష్టాలే మిగిల్చాయి. అయితే, ఓ 12 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం మార్కెట్‌ అస్థిరతలతో తమకేం సంబంధం లేనట్టుగా, ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతీ నెలా ఎంతో కొంత లాభాలనే ఇస్తూ వస్తున్నాయి. మరి ఈ కంపెనీల్లో నిజంగానే

11250పాయింట్లపై ముగిసిన నిఫ్టీ

Thursday 16th May 2019

278 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌  కలిసొచ్చిన చివరిగంట కొనుగోళ్లు  ఒకరోజు నష్టాల ముగింపు తరువాత చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 278 పాయింట్లు లాభపడి 37,393 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 11250పై 11,257ల వద్ద ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 289 పాయింట్లు లాభపడి 28,855.30 వద్ద స్థిరపడింది. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాలతో ముగిశాయి.

Most from this category