News


క్రూడ్ దెబ్బ..దేశీయ ఈక్విటీల పరిస్థితేంటీ?

Monday 16th September 2019
Markets_main1568614309.png-28400

  గత వారాంతం‍లో సౌదీ అరేబియా ఆయిల్‌ రిఫైనరీలపై డ్రోణ్‌ దాడి జరగడంతో, రాత్రికిరాత్రే సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇది దేశియ ఈక్విటీ మార్కెట్‌లతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లపై స్వల్ప కాలం వరకు ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు తెలిపారు. కాగా ఇండియాకు, చమురు దిగుమతులకు మధ్య ప్రతికూల సంబంధం ఉండడంతో చమురు ధరలు పెరిగితే ఇండియా దిగుమతి బిల్లులు పెరుగుతాయి. ఫలితంగా దేశ జీడీపీ ప్రభావితమవుతుంది. వీటితో పాటు ప్రస్తుత పరిస్థితులలో ఎఫ్‌పీఐలు(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్ట్‌ర్లు) వినియోగా దేశాల కంటే కమోడిటీ ఉత్పాదక దేశాల్లో తమ ఎక్సొపోజర్‌ను పెంచుకునే అవకాశం అధికంగా ఉంటుంది. ఇది దేశంలోకి వచ్చే ఇన్‌ఫ్లోలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అన్నారు. 
అనిశ్చితి..చమురు ర్యాలీ ఖాయం   
అబ్కాయిక్ ప్రాసెసింగ్ ప్లాంట్‌, ఖురైస్ చమురు కేంద్రంపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి రాత్రికి రాత్రే సగానికి పడిపోయింది. అంతేకాకుండా దాడి జరిగిన అబ్కాయిక్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రమయిన గవార్ నుంచి క్రూడ్‌ను వెలికితీస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల వలన చమురు ధరలు స్వల్ప కాలంలో పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పెరిగిన చమురు ధరలు ఇంధన మార్కెట్లను దెబ్బతీస్తాయని విశ్లేషకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు సరఫరాలో 5 శాతం సరఫరా ప్రస్తుత అనిశ్చితి వలన ఆగిపోయింది. ఇది క్రూడ్‌ ఆయిల్‌ సోమవారం 10 శాతం మేర ర్యాలీ చేయడానికి సహాయపడిందని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా అబ్కాయిక్‌ ప్లాంట్‌ నష్టంపై అనిశ్చితి, క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు ఆజ్యం పోస్తుందని అన్నారు. 
దేశ జీడీపీ పరిస్థితేంటీ   
ఇండియా దిగుమతులలో క్రూడ్‌ ఆయిల్‌ 80 శాతం వాటాను కలిగి వుంది. చమురు ధర ఒక డాలర్‌ పెరిగితే ఇండియా దిగుమతి బిల్లు అదనంగా 1.5 బిలియన్‌ డాలర్లు పెరుగుతుంది. ఫలితంగా దేశ దవ్రలోటు పెరిగి జీడీపీ వృద్ధిపై ప్రభావం పడుతుంది. ఆర్థిక సంవత్సరం 2019లో ఇండియా 111 బిలియన్‌ డాలర్ల విలువైన క్రూడ్‌ఆయిల్‌ను దిగుమతి చేసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో 36 బిలియన్‌ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకుంది.  చమురు ధర పెరిగే ప్రతి 10 డాలర్ల వలన, దేశ జీడీపీ, 40 బేసిస్‌పాయింట్ల వరకు ప్రభావితమవుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. 
ఆయిల్‌ కంపెనీలు నష్టాల్లోనే..
ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇండెక్స్‌) ఎమర్జింగ్‌ మార్కెట్‌(ఈఎం) ఇండెక్స్‌ పనితీరును ఈ ఏడాది ప్రారంభం నుంచే ఇండియా మార్కెట్లు 10 శాతం మేర బలహీనపరిచాయి. జులై 2019 నుంచి దేశియ ఈక్విటీ మార్కెట్‌ నుంచి ఎఫ్‌పీఐలు 450 కోట్ల డాలర్ల సంపదను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో ఎఫ్‌పీఐలు 670 కోట్ల డాలర్ల విలువైన షేర్ల నికర అమ్మకం దారులయ్యారని ఎన్‌ఎస్‌డీఎల్‌(నేషనల్‌ సెక్యురిటీ డిపాజిటరీ) డేటా పేర్కొంది. చమురు ధరల పెరుగుదల వలన మార్కెటింగ్‌ మార్జిన్స్‌, ప్రతి లీటర్‌ రిటైల్‌ ఇందన అమ్మకంలో వచ్చే ఆదాయం తగ్గడంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ), బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌), హెచ్‌పీసీఎల్‌(హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌) వంటి కంపెనీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. చమురు ధరల పెరుగుదల కారణంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ సైకిల్‌ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు.​ ఇప్పటికే డిమాండ్‌ తగ్గిపోవడంతో తీవ్ర నష్టాల్లో ఉన్న ఆటో రంగ షేర్లు మరింత నష్టపోయే అవకాశం ఉందన్నారు. You may be interested

పెట్రో మార్కెటింగ్‌ షేర్లకు చమురు సెగ!

Monday 16th September 2019

7శాతం క్షీణించిన షేర్లు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. సౌదీ సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల భారీగా పెరగడంతో పాటు డాలరు మారకంలో రూపాయి విలువ పతనం ఇందుకు కారణమవుతున్నాయి. చమురు ధరలు పెరిగితే.. మార్జిన్లు క్షీణించే అవకాశముండటంతో ఇన్వెస్టర్లు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపతున్నారు. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ),

సౌదీ సంక్షోభం....పసిడి పరుగు

Monday 16th September 2019

ఒకరోజులో 20డాలర్ల ర్యాలీ సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్‌ దాడి ఉద్రిక్తతలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 20డాలర్ల వరకు లాభపడింది. సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమెన్‌ ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేశారు. ఈ దాడితో సౌదీ ముడి చమురు సరఫరా రోజుకు 5.7శాతం మిలియన్‌ బారెళ్ల మేర తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా

Most from this category