News


అల్ట్రాటెక్‌, ఎల్‌అండ్‌టీ కొనొచ్చు!

Saturday 4th January 2020
Markets_main1578132416.png-30679

ఈ కేలండర్‌ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత వృద్ధి చూపనున్నట్లు పలు బ్రోకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఆందోళనలున్నప్పటికీ ఈ ఏడాది మార్కెట్లు మంచి రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ర్యాలీ ఇతర కౌంటర్లకూ విసర్తిస్తున్న సంకేతాలు మార్కెట్లలో కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులలో దేశీ బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌.. సిమెంట్‌ రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది. అంతేకాకుండా డైవర్సిఫైడ్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) షేరు కొనుగోలుకు సైతం సిఫారసు చేసింది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మౌలిక సదుపాయాల రంగానికి దన్నుగా రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, అటు ఎల్‌అండ్‌టీ కౌంటర్లు ర్యాలీ బాట పట్టాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ మీడియం టర్మ్‌కు సిఫారసు చేస్తున్న ఈ రెండు బ్లూచిప్‌ కంపెనీల వివరాలు చూద్దాం..

అల్ట్రాటెక్‌ సిమెంట్‌     ధర రూ. 4218(3-1-20 closing)
వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశీయంగా సిమెంట్‌కు గిరాకీ పెరగనుంది. ప్రధానంగా దేశ తూర్పు ప్రాంతాల నుంచి సిమెంట్‌ అమ్మకాలు ఊపందుకునే అవకాశముంది. ఇప్పటికే ఉత్తర, మధ్య భారతంలో పట్టుసాధించిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఇటీవల ఇమామీ సిమెంట్‌ కొనుగోలు ప్రణాళికలు ప్రకటించింది. అల్ట్రాటెక్‌ మొత్తం అమ్మకాలలో ఉత్తర, మధ్య భారతం నుంచి 45 శాతం వాటా సమకూరుతోంది. దేశ తూర్పు ప్రాంతంలో పట్టున్న ఇమామీ సిమెంట్‌ కొనుగోలు ద్వారా సిమెంట్‌ డిమాండ్‌కు అనుగుణంగా అల్ట్రాటెక్‌ లబ్ది పొందే అవకాశముంది. వెరసి మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆరు నెలల కాలానికి రూ. 5050 టార్గెట్‌ ధరతో అల్ట్రాటెక్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తోంది.

ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌        ధర రూ. 1335 (3-1-20 closing)
సార్వత్రిక ఎన్నికలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ గత ఆరు నెలల్లో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. ఈ మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరం(20198-20) తొలి అర్ధభాగంలో కంపెనీకి కీలకమైన ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ విభాగాలలో వార్షికంగా 16 శాతం వృద్ధిని చూపింది. వివిధ ప్రాంతాలు, బిజినెస్‌లలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఆర్థిక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ వస్తోంది. తద్వారా ఒకే విభాగం లేదా ప్రాంతంపై ఆధారపడే మధ్యతరహా ఈపీసీ కంపెనీలకు ఎదురయ్యే సమస్యలనుంచి తప్పించుకోగలుగుతోంది. ఈ నేపథ్యంలో రీసెర్చ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆరు నెలల కాలానికి రూ. 1680 టార్గెట్‌ ధరతో ఎల్‌అండ్‌టీ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తోంది.You may be interested

వచ్చే వారంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.5వేల కోట్ల సమీకరణ

Saturday 4th January 2020

దేశీయ అతిపెద్ద తనఖా రుణదాత సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ భారీ రుణ సేకరణకు సిద్ధమైంది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో ముఖ విలువ రూ.10లక్షలు కలిగిన సెక్యూర్డ్‌ రీడమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూను జారీ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఎక్చ్సేంజీలకు శుక్రవారం సమాచారం ఇచ్చింది. ఇష్యూ మంగళవారం(జనవరి 07)  ప్రారంభమై అదే రోజున ముగుస్తుంది. తద్వారా మొత్తం రూ.5000 కోట్లను సమీకరించనున్నట్లు పేర్కోంది. బాండ్‌ ఇష్యూ పరిణామం రూ.3వేల కోట్లుగా, కాగా ఓవర్సబ్‌స్క్రిప్షన్‌ను

ఈఎంఐలు కట్టుదాటకుండా చూసుకోండి!

Saturday 4th January 2020

రిటైల్‌ రుణాలు వేగంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో గృహోపకరణాల నుంచి గృహ నిర్మాణం వరకు విద్య నుంచి వైద్యం వరకు లోన్‌ తీసుకోవడం కామనైపోయింది. అయితే ఇలా ఎడా పెడా లోన్లు తీసుకుని నెలసరి వాయిదాలు కట్టలేక చేతులెత్తే బదులు ముందుగానే మీ ఈఎంఐ ఎంతుండాలో నిర్ణయించుకొని తదనుగుణంగా లోన్‌ ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఈఎంఐ ఎంత ఉండాలనేది మీ ఆదాయమే చెబుతుంది. ఇంటి అద్దె, పిల్లల

Most from this category