News


అల్ట్రాటెక్‌ నికర లాభం హైజంప్‌

Friday 24th January 2020
Markets_main1579857143.png-31171

మొత్తం ఆదాయం ఫ్లాట్‌
షేరు 1.5 శాతం ప్లస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 49 శాతం ఎగసి రూ. 643 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన గతేడాది(2018-19) క్యూ3లో రూ. 433 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 9982 కోట్లకు చేరింది. ఈ ఏడాది క్యూ3 చివర్లో కొన్ని ప్రాంతాలలో ఆర్థిక రికవరీ కనిపించినట్లు ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం పేర్కొంది. జీడీపీ వృద్ధిపై ప్రభుత్వ దృష్టి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడి ప్రణాళికలు వంటి అంశాలు ప్రభావం‍ చూపుతున్నట్లు తెలియజేసింది. దీంతో సిమెంటుకు డిమాండ్‌ పుంజుకోనున్నట్లు అంచనా వేసింది.

వృద్ధిని అందుకుంటాం
దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ సిమెంట్‌కు పెరగనున్న డిమాండ్‌ అందిపుచ్చుకోగలదని క్యూ3 ఫలితాల విడుదల సందర్భంగా అల్ట్రాటెక్‌ వివరించింది. విభిన్న కారణాలతో దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ వృద్ధిని సాధించగలదని తెలియజేసింది. కాగా.. క్యూ3లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ రూ. 1786 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జిం‍చింది. మార్జిన్లు 17.8 శాతంగా నమోదయ్యాయి. ఇతర వ్యయాల కింద కంపెనీ రూ. 133 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2.30 ప్రాంతం‍లో ఎన్‌ఎస్‌ఈలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు 1.6 శాతం లాభపడి రూ. 4,597 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 4602 వద్ద గరిష్టాన్నీ, రూ. 4453 వద్ద కనిష్టాన్నీ తాకింది.



You may be interested

భారత్‌లో వాల్యూషన్లు అధికం: జేపీ మోర్గాన్‌

Friday 24th January 2020

ఇతర వర్ధమాన మార్కెట్లపై  ఓవర్‌వెయిట్‌! గతేడాది వర్దమాన మార్కెట్ల(ఈఎం)ను నడిపించి ఎర్నింగ్స్‌ బలం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అంచనా వేసింది. ఎస్‌అండ్‌పీ కంపెనీల్లో దాదాపు 80 శాతం కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ఇస్తున్నాయని, గత 30ఏళ్లలో ఈ స్థాయి ప్రదర్శన చూడలేదని జేపీ మోర్గాన్‌ అనలిస్టు జేమ్స్‌ సల్లివాన్‌ చెప్పారు. ఈ బలంతో ఈక్విటీ మార్కెట్ల పరుగు కొనసాగుతుందన్నారు. వాల్యూ స్టాకుల్లోకి పెట్టుబడులు పెరగడం

సమ్మెతో బ్యాంకు కార్యకలాపాలకు ఆటకం:ఎస్‌బీఐ

Friday 24th January 2020

న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు జరిగే బ్యాంకుల సమ్మెతో బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. వేతన సవరణ చర్చలు సఫలం కాని పక్షంలో  యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1వరకు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు దేశవాప్తంగా బ్యాంక్‌ యూనియన్‌లు చేపడుతున్న ఈ సమ్మెతో

Most from this category