News


ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు.. మీ స్ట్రాటజీ ఏంటి?

Friday 13th December 2019
Markets_main1576175983.png-30196

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఐపీవోలో ఒక్కో షేరును రూ.37కు జారీ చేయగా, లిస్టింగ్‌లోనే 50 శాతం లాభాలను ఇచ్చింది. బీఎస్‌ఈలో రూ.55.90 వద్ద ముగిసింది. ఐపీవోలో షేర్లు అలాట్‌ అయిన ఇన్వెస్టర్లు ప్రస్తుత ధరలో అమ్మేసుకోవాలా? ఐపీవోలో షేర్లు దక్కని వారు ప్రస్తుత ధరలో కొనుగోలు చేసుకోవచ్చా..? లేక వేచి చూడాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

 

దీర్ఘకాలం కోసం అయితే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు షేరును హోల్డ్‌ చేసుకోవచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. కొందరు అయితే ఐపీవోలో అలాట్‌ అయిన షేర్లలో కొన్నింటిని విక్రయించి, మిగిలిన వాటిని దీర్ఘకాలానికి అట్టిపెట్టుకోవచ్చని పేర్కొంటున్నారు. ‘‘ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ వ్యాపార మూలాలు బలంగా ఉన్నాయి. రుణాల్లో స్థిరమైన వృద్ధి, మెరుగైన ఆస్తుల నాణ్యత, నిధుల పరంగా బలమైన స్థానం, భౌగోళికంగా భిన్న ప్రాంతాలలో కార్యకలాపాలతో వైవిధ్యంతో ఉంది. దీర్ఘకాలం కోసం ఇన్వెస్టర్లు షేర్లను ఉంచుకోవచ్చు’’ అని ఆనంద్‌రాతి షేర్స్‌ అండ్‌ స్టాక్స్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ రీసెర్చ్‌ ఏవీపీ నరేంద్ర సోలంకి తెలిపారు. ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసుకోవచ్చని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ బ్యాంకింగ్‌ అనలిస్ట్‌ మోన ఖేతాన్‌ సూచించారు. అయితే, రుద్ర షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ మాత్రం ఈ స్టాక్‌ను రూ.85 స్థాయి వరకు ఉంచుకుని ఆ తర్వాత లాభాల స్వీకరణ చేసుకోవచ్చని సూచించింది. 

 

కొనుగోలు ధర?
‘‘ఈ స్టాక్‌ రూ.50-55 స్థాయిల్లో స్థిరపడే వరకు వేచి చూడండి. కనిష్ట స్థాయిలకు చేరిన తర్వాత క్రమంగా కొనుగోలు చేసుకోవడం ఆరంభించండి. మా దృష్టిలో ఈ స్టాక్‌కు సహేతుక ధర రూ.50-55 మధ్య అవుతుంది’’అని మోనాఖేతాన్‌ సూచించారు. ప్రశాంత్‌ తాప్సే కూడా ఇదే విధంగా సూచించారు. ఈ బ్యాంకు పట్ల సానుకూల అవుట్‌లుక్‌తో ఉన్నామని, రూ.50-55 ధర మధ్యలో కొనుగోలు చేసుకోవచ్చని హేమ్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఆస్తాజైన్‌ సూచించారు. ‘‘కస్టమర్‌ ఆధారిత బ్యాంకు. విస్తృతమైన పంపిణీ చానళ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు, బలమైన ఆస్తుల నాణ్యత, స్థూల ఎన్‌పీఏలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు విభాగంలో ఎన్‌పీఏల ప్రొవిజన్‌ కవరేజీ రేషియో పరంగా రెండో స్థానంలో ఉంది’’ అని జైన్‌ వివరించారు.
 You may be interested

పరిశ్రమలు మళ్లీ మైనస్‌

Friday 13th December 2019

అక్టోబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల నిరాశ వృద్ధిలేకపోగా - 3.8 శాతం క్షీణత వరుసగా మూడు నెలల నుంచీ ఇదే ధోరణి న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్‌, మైనింగ్‌ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే

కొత్త ఏడాదికి టాప్‌ 10 సిఫార్సులు

Thursday 12th December 2019

వచ్చేఏడాదిలో మంచి రాబడిని ఇచ్చే టాప్‌ 10 షేర్లను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. అలెంబిక్‌ ఫార్మా: బాబ్‌కాప్స్‌ రిసెర్చ్‌ నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 660. ఎర్నింగ్స్‌ మందకొడిగా ఉండడంతో నాలుగేళ్లుగా ఈ షేరు అంతంతమాత్రపు ప్రదర్శన చేస్తోంది. తాజాగా ఎర్నింగ్స్‌ సైకిల్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. ఇది ఇకపై 3-4 ఏళ్లు కొనసాగవచ్చు. 2024-25 నాటికి ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 20 శాతాన్ని దాటుతుందని అంచనా. ఇప్పటివరకు వెచ్చించిన

Most from this category