News


డీలాపడ్డ ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌

Friday 13th December 2019
Markets_main1576230480.png-30212

  • లాభాల స్వీకరణే అంటున్న విశ్లేషకులు 
  • 8.50శాతం క్షీణించిన షేరు

లిస్టింగ్‌ రోజున మెరుపులు మెరిపించిన ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ షేరు రెండో రోజూ డీలా పడింది. నిన్నటి ట్రేడింగ్‌లో ఇష్యూ ధర రూ.37తో పోలిస్తే 57శాతం లాభంతో రూ.58 వద్ద లిస్టయైన సంగతి తెలిసిందే. క్రితం రోజు ఈ షేరు రూ.56 వద్ద ముగిసింది. నిన్నటి రోజు భారీ లాభాల్ని చవిచూసిన నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పూనుకున్నారు. ఫలితంగా నేడు 8.50శాతం నష్టపోయి 51.15 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు (రూ.55.90)తో పోలిస్తే 7.16శాతం నష్టంతో రూ.51.90 వద్ద టేర్డ్‌ అవుతోంది. గత రెండేళ్లలో వచ్చిన పబ్లిక్‌ ఆఫర్లన్నింటిలో ఈ ఇష్యూ అధిక సబ్‌స్క్రిప్షన్‌ నమోదు చేసింది. ఇష్యూ దాదాపు 165 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. అన్ని విభాగాల ఇన్వెస్టర్లు ఐపీఓకి మంచి స్పందన చూపారు. 



You may be interested

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Friday 13th December 2019

యూనియన్‌ బడ్జెట్‌ 2020-21 ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నట్లు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లద్‌ జోషీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేసీ సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికిది రెండో బడ్జెట్‌ కానుంది. వాస్తవానికి ఫిబ్రవరి 1 శనివారం మార్కెట్లకు సెలవు. అయినప్పటికీ ఇదే రోజున కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 

ర్యాలీకి రీజన్స్‌ ఇవే!

Friday 13th December 2019

దేశీయ మార్కెట్లు శుక్రవారం మంచి ర్యాలీ జరుపుతున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల మేర అప్‌మూవ్‌ చూపాయి. నిఫ్టీ కీలకమైన 12056 పాయింట్ల పైన స్థిరంగా కదలాడుతోంది. ఈర్యాలీకి నాలుగు ప్రధాన కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1. ట్రేడ్‌ ఉద్రిక్తతలు చల్లారడం: యూఎస్‌, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ ముగింపునకు వచ్చినట్లు సంకేతాలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఒక డీల్‌కు సంబంధించి ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌

Most from this category