News


ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బంపర్‌ లిస్టింగ్‌

Thursday 12th December 2019
Markets_main1576129312.png-30189

గురువారం ఉజ్జీవన్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ ఎక్చేంజ్‌లో లిస్టయ్యాయి. ఇష్యూధర కన్నా 56.76 శాతం అధిక ప్రీమియంతో బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ. 58 వద్ద లిస్టయ్యాయి. షేరు ఇష్యూధర రూ. 37. ఎన్‌ఎస్‌ఈలో షేరు 58.78 శాతం ప్రీమియంతో రూ. 58.75 వద్ద లిస్టయింది. అనంతరం గరిష్ఠంగా రూ. 62.80 వరకు దూసుకుపోయింది. ఐపీఓ ద్వారా బ్యాంకు రూ. 750 కోట్లు సమీకరించింది. గత రెండేళ్లలో వచ్చిన పబ్లిక్‌ ఆఫర్లన్నింటిలో ఈ ఇష్యూ అధిక సబ్‌స్క్రిప్షన్‌ నమోదు చేసింది. ఇష్యూ దాదాపు 165 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. అన్ని విభాగాల ఇన్వెస్టర్లు ఐపీఓకి మంచి స్పందన చూపారు. ఆకర్షణీయమైన వాల్యూషన్లు, ప్రమోటర్‌ కంపెనీకి రూరల్‌ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్‌వర్క్‌.. షేరుపై ఆసక్తి పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆఫర్‌కు జేఎం ఫైనాన్షియల్స్‌, కోటక్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ మేనేజర్లుగా వ్యవహరించాయి. 



You may be interested

లాభాల్లో మెటల్‌ షేర్లు

Thursday 12th December 2019

లాభాల మార్కెట్లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. దీంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 2శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మెటల్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 2,525.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2శాతం లాభపడి 2559.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (2,509.55)తో

రెండు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ బుల్లిష్‌

Thursday 12th December 2019

గెయిల్‌ ఇండియా, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్ షేర్లపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ మోర్గాన్‌స్టాన్లీ వెల్లడించింది. ఈ షేర్లలో 26-67 శాతం అప్‌సైడ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. గోద్రేజ్‌ కన్జూమర్‌ షేరుకు రూ. 845 టార్గెట్‌గా నిర్ణయించింది. గెయిల్‌ ఇండియాకు రూ. 188 టార్గెట్‌గా పేర్కొంది. గోద్రేజ్‌ కన్జూమర​ దేశీయ వాల్యూం వృద్ధిలో వేగాన్ని నమోదు చేయగలదని, ఆపరేటింగ్‌ మార్జిన్లలో విస్తరణ చూపుతుందని అంచనా వేసింది. గెయిల్‌ ఇండియా తన

Most from this category