News


ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీఓ సోమవారమే!

Saturday 30th November 2019
Markets_main1575111109.png-29983

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ(స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌) ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫ్‌ర్‌(ఐపీఓ) సోమవారం దలాల్‌ స్ట్రీట్‌లోకి రానుంది. ఈ ఎస్‌ఎఫ్‌బీ రూ. 303.75 కోట్ల నిధులను యాంకర్‌ ఇన్వెస్టర్‌ ద్వారా సమీకరించింది. 8,20,94,594 షేర్లను  షేరు రూ. 37 (అప్పర్‌ లిమిట్‌) చొప్పున ఐపీఓ కేటాయింపులను ఖరారు చేసింది. సింగపూర్ ప్రభుత్వం, సీఎక్స్‌ పార్ట్‌నర్స్ ఫండ్ 2, గోల్డ్‌మన్ సాచ్స్ ఇండియా, అబెర్డీన్ స్టాండర్డ్ ఏషియన్ స్మాల్ కంపెనీస్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, సుందరం మ్యూచువల్ ఫండ్, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు యాంకర్ ఇన్వెస్టర్లలలో ముఖ్యమైనవి. మొత్తంగా 6 మ్యూచవల్‌ ఫండ్స్‌ 33 స్కీమ్‌లతో బిడ్లను దాఖలు చేశాయి. ఇందులో ఐసీఐసీఐ ప్రుడెన్సియల్‌, సుందరం ఎంఎఫ్‌, బీఎన్‌పీ పారిబా, యూటీఐ, ఏబీ సన్‌లైఫ్‌, ఎడెల్వీస్‌ ఏఎంసీ స్కీమ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఎస్‌ఎఫ్‌బీ రూ. 750 కోట్ల ఇష్యు ధర రూ. 36-37  పరిధిలో నిర్ణయిం‍చారు. కాగా గత వారంలో ఐపీఓకి వచ్చిన సీఎస్‌బీ ఐపీఓ 87 రెట్లు అధికంగా చందాదారలను పొందిన విషయం గమనార్హం. ఉజీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన ఉజ్జీవన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ 2016 లో మార్కెట్‌లో నమోదైంది. 
ఐసీఐసీఐ సెక్యురిటీస్‌: సబ్‌స్కైబ్‌
మైక్రో ఫైనాన్స్‌ ఇనిష్టిట్యూషన్‌(ఎంఎఫ్‌ఐ) రుణాలతో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌(‍యుఎస్‌ఎఫ్‌బీ) ప్రారంభమైందని ఐసీఐసీఐ సెక్యురిటీస్‌ తెలిపింది. ఎంఎస్‌ఈ రుణాలు, ఆటో రుణాలు వంటి కొత్త ఉత్పత్తులను ఏర్పాటు ‍చేయడం వలన నాన్‌ ఎంఎఫ్‌ఐ విభాగంపై తన దృష్ఠిని సారించింది. ‘యుఎస్‌ఎఫ్‌బీ తన ఆస్తి నాణ్యతను కొనసాగిస్తునే, ఆడ్వాన్స్‌ వృద్ధి పరంగా నిలకడగా కొనసాగుతోంది’ అని ఈ బ్రోకరేజి పేర్కొంది.  ఐపీఓకు సబ్‌స్రైబ్‌ చేయమని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది. 
ఏంజెల్‌ బ్రోకింగ్‌: సబ్‌స్ర్కైబ్‌
అప్పర్‌ బ్యాండ్‌ ధర వద్ద ఎస్‌ఎఫ్‌బీ విలువ ఆర్థిక సంవత్సరం 2020 క్యూ2లో కంపెనీ బుక్‌ విలువ కంటే 2.8 రెట్లుగా ఉంది. ఈ వ్యాపారంలోని ఇతర కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీ వాల్యుషన్‌ ఆకర్షణియంగా ఉందని ఏంజిల్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. ‘అన్నిటికంటే అనుభవం ఉన్న మేనేజ్‌మెంట్‌, ఆస్తి నాణ్యత బాగుండడం వంటి కారణాల వలన ఈ ఎస్‌ఎఫ్‌బీ ఆకర్షణియంగా ఉంది’ అని ఈ బ్రోకరేజి తెలిపింది.You may be interested

డిజిటల్‌ వేగానికి ‘క్రెడిట్‌ కార్డు’ జోరు

Monday 2nd December 2019

క్రెడిట్‌ కార్డుల వినియోగం దేశంలో మంచి జోరు మీదున్నది. ఈ ఏడాది మే నాటికి వినియోగంలో ఉన్న కార్డులు 4.89 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఈ సంఖ్య 3.86 కోట్లుగానే ఉంది. 27 శాతం వృద్ధి కొత్త వ్యాపార అవకాశాలకు ఊతమిచ్చినట్టుగా చెల్లింపుల పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొంటున్నారు. దేశీయంగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారంలో రెండో అతిపెద్ద సంస్థ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ ఐపీవోకు వచ్చేందుకు గత

వచ్చే ఐదేళ్లలో ఈ 4కంపెనీల ప్రైవేటీకరణ: సీఎల్‌ఎస్‌ఏ

Saturday 30th November 2019

వచ్చే ఐదేళ్లలో భెల్‌, గెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, నాల్కో కంపెనీల ప్రైవేటీకరణ జరగవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ భావిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని సీఎల్‌ఎస్‌ అంచనా వేస్తుంది. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కోల్ ఇండియా వంటి పెద్ద పీఎస్‌యూల ప్రైవేటీకరణకు అవకాశం తక్కువవుండటంతో ఈ  పీఎస్‌యూ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. గడిచిన మూడేళ్లలో ఈటీఎఫ్‌ల ద్వారా

Most from this category