News


ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ బంపర్‌ లిస్టింగ్‌..!?

Wednesday 11th December 2019
news_main1576054891.png-30175

  • 50శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ అంటున్న విశ్లేషకులు  

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ బంపర్‌గా లిస్టయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఐపీఓ విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు ఇప్పడు మార్కెట్‌ వర్గాల దృష్టి లిస్టింగ్‌పై పడింది. రేపు జరిగే(డిసెంబర్‌ 12న) జరిగే లిస్ట్‌లో ఇష్యూ ధర రూ.37లతో పోలిస్తే 50శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ జరగవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.750 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ డిసెంబర్‌2న ఐపీఓకు వచ్చింది. ఇదే నెల4న ముగింపు నాటికి ఇష్యూ 166 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇష్యూ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.36-37గా ఉంది. ఐపీఓ డిసెంబర్‌ 12న ఎక్చ్సేంజీల్లో లిస్టింగ్‌ కానుంది. దీంతో గ్రే మార్కెట్లో ఈ స్టాక్‌పై అంచనాలు అధికమయ్యాయి. నిన్నటి వరకు గ్రే మార్కెట్లో రూ.25ల మేర ప్రీమియం పలికినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

 ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన బుక్‌ప్రైస్‌ ప్రకారం ఇష్యూలో నిర్ణయించబడిన అప్పర్‌ బ్రాండ్‌ ప్రైస్‌ ధర రూ.37లతో పోలిస్తే కేవలం 2.18 రెట్లు మాత్రమే అధికంగా ఉంది. ఇది పరిశ్రమ సగటు కంటే తక్కువ. మంచి ఆస్తుల నాణ్యత, అనుభవం కలిగిన యాజమాన్యం కలిగి ఉండటం అదనపు బలం. ఈ కారణాలతో రేపు ఎ‍క్చ్సేంజీల్లో అధిక ప్రీమియం ధరతో లిస్టింగ్‌ అయ్యే అవకాశం ఉంది. సుమారు రూ.64-68 పరిధిలో ఉండే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాము" అని ఆనంద్‌రాఠీ షేర్స్ అండ్‌ స్టాక్ బ్రోకర్స్ హెడ్ ఫండమెంటల్ రీసెర్చ్ నరేంద్ర సోలంకి అన్నారు.

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఐపీఓ లిస్టింగ్‌ జరిగితే, ఉజ్జీవన్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ప్రస్తుత రూ .6,394 కోట్ల నుండి సుమారు 10,000-11,000 కోట్లకు పెరుగుతుంది. ఇది దాని మాతృ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ .4,300 కోట్ల కంటే లిస్ట్‌ కాబోయే బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ చాలా ఎక్కువ. ఈ బ్యాంకు సూక్ష్మ రుణాలు, వ్యవసాయ, దాని అనుబంధ, ఎంఎస్‌ఈ, సరసమైన గృహ, వ్యక్తిగత, వాహన కొనుగోళ్లకు రుణాలను మంజూరుచేస్తుంది.



You may be interested

చివరి గంట కొనుగోళ్లతో లాభాల ముగింపు

Wednesday 11th December 2019

11900 పైన ముగిసిన నిఫ్టీ  173 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  ఆదుకున్న ఐటీ, ఫైనాన్షియల్‌ షేర్ల ర్యాలీ చివరి గంటలో వెలువెత్తిన కొనుగోళ్లతో మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 40,412 వద్ద స్థిరపడింది. నిప్టీ 53 పాయింట్లు పెరిగి 11,900పైన 11,910 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి గంటలో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ, ఆర్థిక, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ రంగాలకు అనూహ్యంగా

10 శాతం ప్రీమియంతో లిస్టయిన అరామ్‌కో

Wednesday 11th December 2019

సౌదీకి చెందిన చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్‌కో రియాద్‌ స్టాక్‌ఎక్చేంజ్‌లో బంపర్‌ లిస్టింగయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం ప్రీమియంతో 35.20 వద్ద సంస్థ షేరు లిస్టయింది. ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా పేరొందిన ఈ పబ్లిక్‌ ఆఫర్‌తో కంపెనీ 2560 కోట్ల డాలర్లు సమీకరించింది. లిస్టింగ్‌తో సంస్థ విలువ 1.88 లక్షల కోట్ల డాలర‍్లకు చేరింది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీఅరామ్‌కో

Most from this category