News


త్వరలో ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ

Saturday 17th August 2019
Markets_main1566027193.png-27835

  • సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలు సమర్పణ
  • రూ.1200 కోట్ల సమీకరణ

ఫైనాన్స్‌ రంగలో సేవలు అందించే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా బ్యాంకు మొత్తం రూ.1200 కోట్ల నిధులను సమీరించే యోచనలో ఉంది. ఈ మేరకు అనుమతుల కోసం ఆగస్ట్‌ 16న మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ బ్యాంక్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలను నియమించినట్లు తెలిపింది. ధరల శ్రేణిని త్వరలో బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ంగ్‌ మేనేజర్లను నిర్ణయిస్తారని బ్యాంక్‌ సెబీకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అలాగే అర్హత కలిగిన ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్‌ హోల్డర్లకు ఇష్యూలో రూ.120 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కేటాయిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ కావడం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందడం,  బ్రాండ్‌ ఇమేజ్‌, ప్రస్తుత వాటాదారులకు లిక్విడిటీని మెరుగుపరచడం లక్ష్యాలుగా ఈ కంపెనీ ఐపీఓకు వస్తోంది.  

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికే అరశాతం లాభంతో రూ.284.10 వద్ద స్థిరపడింది.



You may be interested

రికార్డుస్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 17th August 2019

దేశీయ ఫారెక్స్‌ నిల్వలు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు ఆగస్ట్‌ 9తో ముగిసిన వారానికి 1.620 బిలియన్ల డాలర్లకు పెరిగి 430.572 డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అంతకుముందు వారం(ఆగస్ట్‌ 02 తేది వారం) 697.2 డాలర్ల తగ్గుదలతో 428.952 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి.  అయితే గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 15.2 మిలియన్ డాలర్లు పెరిగి 398.739 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని

ఈక్విటీ ర్యాలీతో తగ్గిన పసిడి

Saturday 17th August 2019

ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడంతో పసిడి ఫ్యూచర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి 7.60 నష్టపోయి 1,523.60 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ వారంల మొత్తంలో 15 డాలర్లు లాభపడిన పసిడికి ఇది మూడో వారమూ లాభాల ముగింపు. ఇదేవారంలో 1,490.75 - 1,545.95 రేంజ్‌లో ట్రేడైంది. జర్మనీ ఆర్థిక ఉద్దీపన చర్చలతో

Most from this category