News


ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ... అదుర్స్‌

Thursday 5th December 2019
Markets_main1575517899.png-30063

  • 166 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఇష్యూ 
  • ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబయిన ఇష్యూ ఇదే 
  • ఈ నెల 12న లిస్టింగ్‌ 

న్యూఢిల్లీ: ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్‌ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు కేటాయించిన వాటా 114 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 486 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 50 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. మొత్తం మీద ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఏడాదిలో అత్యధిక రెట్లు ఓవర్‌స్క్రైబయిన ఇష్యూ ఇదే. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.36-37ను కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12న ఈ షేర్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నది. అప్పర్‌ ప్రైస్‌బ్యాండ్‌(రూ.37) ధరకు దాదాపు రెట్టింపు ధరకు ఈ షేర్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టవ్వగలదని అంచనా. 



You may be interested

ఇక చిన్న మదుపరికీ బాండ్లు!

Thursday 5th December 2019

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు కేంద్రం ఓకే దీన్లో అన్నీ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లే మూడేళ్లు, ఏడేళ్ల కాలపరిమితితో త్వరలో ఆరంభం కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి మొదలు రిస్కు లేకుండా స్థిరమైన రాబడి వచ్చే అవకాశం ఇక ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సేకరణా ఈజీనే న్యూఢిల్లీ: ఈక్విటీల మాదిరే కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ (భారత్‌ బాండ్‌

జియో బాదుడు ... 39శాతం పైనే

Thursday 5th December 2019

పెంపులో ఐడియా, ఎయిర్‌టెల్‌ కన్నా ఎక్కువే 39 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్‌ జియో ఛార్జీలు న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో... ఛార్జీలు పెంచుతూ కొత్త రేట్లను బుధవారం విడుదలచేసింది. డిసెంబర్‌ 6 నుంచి ధరలు పెరగనున్నట్లు కంపెనీ గతంలోనే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యారిఫ్‌లతో పోల్చితే 39 శాతానికి పైగా పెంపును ప్రకటించింది. రోజుకు 1.5 జీబీ డేటాతో 84

Most from this category