News


ఐపీఓ దెబ్బతో పతనమైన ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌!

Monday 19th August 2019
Markets_main1566208670.png-27869

సాధారణంగా ఒక సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ ఐపీఓకి (ఇనీసీయల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తే ఆ సంస్థ షేరు విలువ పెరుగుతుంది. కానీ ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌  మాత్రం సోమవారం ట్రేడింగ్‌లో  8 శాతం మేర పతనమయ్యింది(ఉదయం 10.00 సమయానికి). ఈ కంపెనీకి అనుబంధ సంస్థయిన ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రూ. 1,200 కోట్ల ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాప్ట్‌ పేపర్స్‌ నమోదు చేసింది. ‘ఉజ్జీవన్ పైనాన్స్‌లో ఉన్న ప్రస్తుత వాటాదారులకు ఈ ఐపీఓ ప్రతికూలంగా ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. ఈ ఐపీఓ కారణాన కేవలం హోల్డింగ్‌ కంపెనీలోని షేర్లకు మాత్రమే వీరు పరిమితమవుతారని వివరించారు. అంతేకాకుండా హోల్డింగ్‌ కంపెనీ స్టాక్‌ 20-80 శాతం రాయితీతో ట్రేడవుతుందని, ఫలితంగా ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరుకు నిర్ణయించిన ధరను కూడా తగ్గించాల్సివస్తుందని అంచనావేశారు. కాగా సోమవారం ఉదయం 10 గంటల సమయానికి ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ షేరు 7.88 శాతం తగ్గి రూ .261.70 కనిష్టాన్ని తాకింది. రివర్స్‌ మెర్జర్‌(ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ వెళ్లి ఉజ్జీవన్‌ బ్యాంక్‌తో కలవడం)పై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదని, దీనికి ఆర్‌బీఐ అనుమతి కావాలని ఈక్విరస్‌ బ్రోకరేజి తెలిపింది. ‘ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్  60 శాతం లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్‌తో ట్రేడ్‌కావొచ్చు. ఫలితంగా ఈ కంపెనీ రేటింగ్‌ను తగ్గించడంతో పాటు సెప్టెంబరు 2020కు గాను కంపెనీ స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ. 375 నుంచి  రూ. 200 తగ్గించాం’ అని ఈ బ్రోకరేజి తెలిపింది.   మధ్యాహ్నాం 3.13 సమయానికి ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ షేరు 1.14 శాతం నష్టపోయి రూ. 280.75 వద్ద ట్రేడవుతోంది. కాగా ఈ షేరు సోమవారం రూ. 260.00 వద్ద ప్రారంభమయ్యి, రూ. 281.20 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని, రూ. 260.00 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.. ఐపీఓ: ఫైనాన్స్‌ రంగలో సేవలు అందించే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా బ్యాంకు మొత్తం రూ.1200 కోట్ల నిధులను సమీరించే యోచనలో ఉంది. ఈ మేరకు అనుమతుల కోసం ఆగస్ట్‌ 16న మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ బ్యాంక్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలను నియమించినట్లు తెలిపింది. ధరల శ్రేణిని త్వరలో బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ంగ్‌ మేనేజర్లను నిర్ణయిస్తారని బ్యాంక్‌ సెబీకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అలాగే అర్హత కలిగిన ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్‌ హోల్డర్లకు ఇష్యూలో రూ.120 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కేటాయిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ కావడం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందడం,  బ్రాండ్‌ ఇమేజ్‌, ప్రస్తుత వాటాదారులకు లిక్విడిటీని మెరుగుపరచడం లక్ష్యాలుగా ఈ కంపెనీ ఐపీఓకు వస్తోంది.  You may be interested

గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు

Monday 19th August 2019

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు  11050పైన ముగిసిన నిఫ్టీ 50 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా సోమవారం సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 52.16 పాయింట్లు లాభంతో 37,402.49 వద్ద, నిఫ్టీ  6.10 పాయింట్లు పెరిగి వద్ద 11,053.90 ముగిసింది. సూచీలకిది వరుసగా మూడో లాభాల ముగింపు కావడం విశేషం. మీడియా, ఐటీ, పార్మా రియల్టీ, ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ప్రభ్వుత రంగ,

సెన్సెక్స్‌ టార్గెట్‌ తగ్గించిన సిటీ!

Monday 19th August 2019

ఎర్నింగ్స్‌ గ్రోత్‌లో క్షీణతే కారణం ఫైనాన్షియల్స్‌ పైనే ఆశలు జూన్‌ త్రైమాసిక ఫలితాలు ఆశించినంత బాగాలేకపోవడంతో జూలై తర్వాత నుంచి మార్కెట్లలో పతనం వచ్చింది. దీంతో డౌన్‌గ్రేడ్‌ రిస్కులు మరింత పెరిగాయని బ్రోకరేజ్‌లు తమ రివ్యూ రిపోర్టుల్లో విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల ఎర్నింగ్స్‌ అంచనాలను బ్రోకరేజ్‌లు తగ్గించాయి. దీంతో ఆర్థిక సంవత్సరం చివరకు కంపెనీలు మొదట అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్‌ సెన్సెక్స్‌పై తన

Most from this category