News


యూకో బ్యాంక్‌ 19శాతం అప్‌

Thursday 21st November 2019
Markets_main1574320405.png-29757

ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ షేరు వరుసగా మూడో రోజూ లాభాల బాట పట్టింది. బుధవారం ఉదయం సెషన్‌లో ఈ షేరు దాదాపు 19శాతం లాభపడింది. బ్యాంక్‌ వెల్లడించిన క్యూ2 ఫలితాలను పరిశీలిస్తే... నికర నష్టాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయి. గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.25,665 కోట్లకు తగ్గాయి. నికర మొండి బకాయిలు రూ.11,820 కోట్ల నుంచి రూ.7,238 కోట్లకు చేరాయి. బ్యాంకు ఛైర్మన్‌ అతుల్‌ కుమార్‌ గోయల్‌ ఒక ఛానెల్‌కిచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకుకు "టర్నరౌండ్ ఇయర్" అవుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం స్వర్ణ సంవత్సరం అవుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు బ్యాంకు షేరు ఇంట్రాడే 18.85శాతం లాభపడి రూ.22.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు క్రితం ముగింపు(రూ.18.69)తో పోలిస్తే 16.50శాతం లాభంతో రూ.21.76 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి బీఎస్‌ఈ ‘‘ఏ’’గ్రూప్‌లో షేరు టాప్‌గెయినర్‌గా ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.11.00, రూ.23.40లుగా నమోదయ్యాయి. 



You may be interested

వొడాఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లను ఏం చేద్దాం?

Thursday 21st November 2019

అనలిస్టుల సూచనలు స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై రెండేళ్ల మారిటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది టెల్కోలకు పాజిటివ్‌ వార్తే కానీ వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లు మాత్రం గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏజీఆర్‌ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ సాయం ఏమీ ప్రకటించకపోవడంతో ఈ షేర్ల కౌంటర్లలో అమ్మకాలు పెరిగాయి. మధ్యాహ్న సమయానికి ఐడియా షేరు దాదాపు 4 శాతం, ఎయిర్‌టెల్‌ సుమారు 2.5 శాతం నష్టాల్లో ఉన్నాయి. ఇటీవల

టాప్‌ మిడ్‌క్యాప్‌ రికమండేషన్లు!

Thursday 21st November 2019

దేశీయ మార్కెట్లో చిన్న స్టాకుల టర్నెరౌండ్‌ ఆరంభమవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌ను రికమండ్‌ చేస్తున్నాయి. ఏడాది కాలానికి వీటిని పరిశీలించవచ్చని సిఫార్సు చేస్తున్నాయి. మోతీలాల్‌ఓస్వాల్‌ సిఫార్సులు: కాల్గేట్‌ పామోలివ్‌, అశోక్‌ లేలాండ్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, సీజీ కన్జూమర్‌ కేర్‌, జేకే సిమెంట్‌ తదితరాలు. బ్రోకరేజ్‌ సిఫార్సు చేసిన షేర్లు, వాటి టార్గెట్లు,

Most from this category