News


టార్గెట్‌ తగ్గించిన యూబీఎస్‌: టాటా స్టీల్‌ 4శాతం డౌన్‌

Tuesday 3rd December 2019
Markets_main1575353372.png-30024

టాటా స్టీల్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 4శాతానికి నష్టపోయింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ యూఎస్‌బీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.418.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యూబీఎస్‌ ఈ షేరు రేటింగ్‌ను ‘‘బై’’ నుంచి ‘‘సెల్‌’’కు సవరించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.675 నుంచి రూ.360లకు తగ్గించింది. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో షేరు ఒకదశలో 4.14శాతం నుంచి రూ.403.35 పతనమైంది. ఉదయం గం. 11:00లకు షేరు క్రితం ముగింపు(రూ.420.80)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.404.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.320.30 రూ. 560.35లుగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో దాదాపు 13శాతం లాభపడిన షేరు సోమవారం ట్రేడింగ్‌ మరో 1.50శాతం నష్టంతో రూ.420.80 వద్ద స్థిరపడింది. 


యూబీఎస్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌:- 
దేశీయంగా డిమాండ్ రికవరీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు యూరోపియన్ కార్యకలాపాలు ఇప్పటికీ బలహీన డిమాండ్‌తో సతమతవుతున్నట్లు యూఎస్‌బీ తన నివేదికలో పేర్కోంది. వియత్నాంలో నాట్‌స్టీల్‌ వినా కంపెనీలో వాటాను ఉపసంహరించుకోవడం కంపెనీకి పాజిటివ్‌ అంశమని, అయితే థాయ్‌లాండ్‌లో ఉపసంహరణ వాయిదా పడటం ఆందోళన కలిగించే అంశమని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 


సంవత్సరానికి 1 బిలియన్ల రుణాన్ని తగ్గించడానికి మునుపటి గైడ్‌లైన్‌ ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-సెప్టెంబర్)లో దేశీయ డిమాండ్‌ తగ్గడం, విదేశాల్లో బలహీన కార్యకలాపాలతో అప్పుల భారం మరిం పెరిగాయి. 2019 మార్చిలో నికర అప్పు రూ.95,000 కోట్ల నుండి 2019 సెప్టెంబర్‌లో రూ.1,07,000 కోట్లకు పెరిగాయని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. 


మరోవైపు బ్లూమ్‌బర్గ్‌ గణాంకాల ప్రకారం 30మంది అనలిస్టులకు గానూ 21 మంది ఇప్పటికీ ఈ షేరుపై ‘‘బై’’ రేటింగ్‌ అభిప్రాయాన్ని కలిగిఉన్నారు. 4గురు ‘‘హోల్డ్‌’’రేటింగ్‌ను, మరోవైపు 5మంది ‘‘సెల్‌’’ రేటింగ్‌ ఇచ్చారు. 
 You may be interested

లాంగ్‌ టర్మ్‌కు టాప్‌ 9 సిఫార్సులు

Tuesday 3rd December 2019

దీర్ఘకాలానికి మంచి రాబడినిచ్చే తొమ్మిది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌ 1. సన్‌ టెక్‌ రియల్టీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 487. ఇటీవల ప్రారంభించిన అవెన్యూ4 టవర్స్‌తో వచ్చే మూడు నాలుగేళ్లలో దాదాపు రూ. 12-13 వందల కోట్ల ఆదాయం సమకూరనుంది. దీంతో పాటు త్వరలో ఆరంభించబోయే అంధేరీ ప్రాజెక్ట్‌, నైగావ్‌ ఫేజ్‌2 ప్రాజెక్టులు కంపెనీ విక్రయాల్లో జోరును పెంచుతాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ రికమండేషన్లు 1. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌:

ప్రభుత్వ పరిశీలనలో ఆదాయపన్ను తగ్గింపు?!

Tuesday 3rd December 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు తరహాలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని, ఈ విషయమై ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో కొత్త పెట్టుబడులు ఆరంభమయ్యాయని, వ్యవస్థలో రికవరీ చిగురులు వేస్తోందని చెప్పారు. వైయుక్తిక ఆదాయపన్ను ప్రయోజనాలను ప్రభుత్వం క్రమానుగతంగా సమీక్షిస్తుంటుందన్నారు. మందగమనంపై మాట్లాడుతూ, తమది చైతన్యవంతమైన ప్రభుత్వమని, ఎకానమీలో

Most from this category