News


స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు షేర్లే సేఫ్‌: యూబీఎస్‌

Monday 17th June 2019
Markets_main1560765795.png-26353

ప్రస్తుతం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ షేర్లు గడ్డుకాలం ఎదుర్కోంటున్న తరుణంలో, ఇన్వెస్టర్లు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు ఎంపిక మంచిదని విదేశీ బ్రోకింగ్‌ దిగ్గజం యూబీఎస్ సూచిస్తుంది. వచ్చే  3-4 ఏళ్లలో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల లోన్‌బుక్స్‌, ఆదాయాలు పరిశ్రమ సగటు వృద్ధి కంటే రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని బ్రోకింగ్‌ సంస్థ తెలిపింది. రుణ విభాగాల్లో పటిష్టమైన నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ కలిగి ఉండటంతో పాటు నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు మార్కెట్‌ వాటాను, ఆదాయాలను చేజిక్కించుకుంటాయని తెలిపింది. వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఏయూఎం ఆస్తుల విలువ 33శాతం పెరిగి రూ.1.1లక్షల కోట్లకు చేరుకుంటుందని యూఎస్‌బీ అంచనా వేస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మార్కెట్‌ వాటా పెరగడం, అండర్-బ్యాంకింగ్ విభాగాలలో ఉనికి, కొత్త ఉత్పత్తి కార్యక్రమాలు పెరగడంతో ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఈక్విటాస్‌ హోల్లిం‍గ్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ 2019 ఆర్థిక సంవత్సరంలో అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఎయుఎం) 47 శాతం వృద్ధిని సాధించాయి. 
ఈ నేపథ్యంలో ఈ రంగానికి చెందిన ప్రధాన షేర్లైన ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌, ఈక్విటీ హోల్డింగ్‌, ఉజ్జీవన్‌ సర్వీసెస్‌ షేర్ల టార్గెట్‌ ధరలను పెంచింది.
ఏయూ స్మాల్‌ షేరు:- 
టార్గెట్‌ ధర:- రూ.700ల నుంచి రూ.760లకు పెంచింది
ఈక్విటీ హోల్డింగ్ షేరు:-
టార్గెట్‌ ధర:- రూ.160 నుంచి రూ.190లకు పెంచింది.
ఉజ్జీవన్‌ సర్వీసెస్‌ షేరు:-
టార్గెట్‌ ధరను రూ.350ల నుంచి రూ.450లకు పెంచింది.



You may be interested

ఉద్యోగార్ధులకు అమెజాన్‌ నెం.1!

Monday 17th June 2019

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగ సంస్థగా నిలిచింది. తరువాత స్థానాలలో మైక్రోసాఫ్ట్ ఇండియా, సోనీ ఇండియాలు ఉన్నాయి. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్‌) సోమవారం విడుదల చేసిన సర్వే- 2019 ప్రకారం ఆర్థికంగా మంచి వాతవరణం కల్పిస్తుండడం, తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, బలమైన సంస్థగా పేరుండడం వంటి అంశాలు అమోజాన్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో సహాయపడ్డాయి. మైక్రోసాఫ్ట్ ఇండియా రెండవ

ఆర్‌ఎన్‌ఏఎమ్‌లో 10.75శాతం వాటాను విక్రయించిన ఆర్‌క్యాప్‌

Monday 17th June 2019

ఆర్‌క్యాప్‌ అప్పులను తగ్గించేందుకే రిలయన్స్‌ నిప్పాన్‌ ఎసెట్‌ మానెజ్‌మెంట్‌(ఆర్‌ఎన్‌ఏఎమ్‌)లో 10.75శాతం వాటాను రిలయన్స్‌ క్యాపిటల్‌(ఆర్‌క్యాప్‌) సోమవారం రెండు వరుస ఆఫర్‌లలో విక్రయించింది. వీటి విలువ రూ.1,450కోట్లని సంస్థ సోమవారం ప్రకటించింది. ఆర్‌క్యాప్‌కున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు నిప్పాన్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ, జపాన్‌కు ఈ వాటాను విక్రయించామని వివరించింది. దీంతో ఆర్‌క్యాప్‌ సంస్థ ఆర్‌ఎన్‌ఏఎమ్‌లో తన మెజార్టీ వాటాను కోల్పోయి 25శాతం వాటాతో మినిమమ్‌ షేర్‌ హోల్డర్‌గా మిగిలింది.  ఈ లావాదేవినే

Most from this category