News


నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 18th May 2019
Markets_main1558160791.png-25819

మిడ్‌సెషన్‌ నుంచి నెలకొన్న అమ్మకాలతో అమెరికా మార్కెట్ల మూడురోజుల వరుస ర్యాలీకి శుక్రవారం బ్రేకు పడింది. మార్కెట్‌ ప్రారంభానికి ముందు వెల్లడైన కన్జూ‍్యమర్‌ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లో నెలకొన్న అమ్మకాలు ఆరంభలాభాల్ని హరించివేశాయి.  అమెరికా చైనాలు పరస్పరం టారీఫ్‌లను విధించుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చల సఫలంపై సందిగ్ధత నెలకొంది. చైనా టెలికాం దిగ్గజ కంపెనీ హువాయి ఉత్పత్తులపై అమెరికా టారీఫ్‌లు విధించిన నేపథ్యంలో వరుసగా రెండో రోజూ టెక్నాలజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నాస్‌డాక్‌ కాంపోసైట్‌ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయి 7,816.28 వద్ద ముగిసింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌ 0.6శాతం క్షీణించి 2,859.53 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్‌కు ఇది వరుసగా రెండోవారం నష్టాల ముగింపు. డౌజోన్స్‌ ఇండస్ట్రీస్‌ 0.4శాతం పతనమైన 25,764 వద్ద  స్థిరపడింది. పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ స్వల్పంగా 1బేసిస్‌పాయింట్‌  తగ్గి 2.39శాతానికి చేరింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ పతనంతో డాలర్‌ ఇండెక్స్‌ విలువ 0.3శాతం పెరిగింది.



You may be interested

రెండువారాల కనిష్టానికి పసిడి ధర

Saturday 18th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం రెండు వారాల కనిష్టానికి పతనమైంది. డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ, అమెరికా కన్జూ‍్యమర్‌ గణాంకాలు 15 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం పసిడి క్షీణతకు కారణమయ్యాయి. రాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 10.50 డాలర్ల నష్టపోయి 1,275.70 డాలర్ల వద్ద స్ధిరపడింది. ఇటీవల కాలంలో అమెరికా విడుదల చేస్తున్న పటిష్టమైన ఆర్థిక గణాంకాలు ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లు సంకేతాలను ఇస్తున్నాయి. ఈ తరుణంలో

రెండంకెల వృద్ధే లక్ష్యం!

Saturday 18th May 2019

దేశం మధ్యాదాయ చట్రంలోకి వెళ్లకపోవచ్చు ఈఏసీ- పీఎం సభ్యురాలు షమికా రవి న్యూఢిల్లీ: రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అవసరమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) సభ్యురాలు షమికా రవి చెప్పారు. 7 శాతం వృద్ధితో సరిపెట్టుకోకూడదని ఆమె స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదిగే క్రమంలో మధ్యలోనే ఆగిపోయే ‘మధ్యాదాయ చట్రం’లో భారత్‌ ఇరుక్కుపోతుందంటూ సహచర ఈఏసీ-పీఎం సభ్యుడు రతిన్‌రాయ్‌ చేసిన వ్యాఖ్యలను

Most from this category