News


భారీ డిస్కౌంట్‌లో పలు స్టాకులు.. కొనొచ్చా?

Monday 22nd July 2019
Markets_main1563779041.png-27222

వేచిచూడమంటున్న నిపుణులు
నిఫ్టీలో ట్రేడయ్యే స్టాకుల్లో మూడింట రెండొంతుల స్టాకులు తమ ఏడాది గరిష్ఠాల కన్నా 10- 70 శాతం డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. ఈ స్టాకుల్లో బలహీనత సూచీలను రెండునెలల కనిష్ఠానికి తెచ్చింది. నిఫ్టీలోని 34 స్టాకులు, సెన్సెక్స్‌లోని 18 స్టాకులు తమ ఏడాది హై కన్నా భారీ దిగువన ట్రేడవుతున్నాయి. ఇలా డిస్కౌంట్‌లో ఉన్న స్టాకుల్లో సిప్లా, టైటాన్‌, ఓఎన్‌జీసీ, హీరోమోటోకార్‌‍్ప, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యుస్టీల్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, యస్‌బ్యాంక్‌ లాంటి దిగ్గజాలున్నాయి. ఎన్‌ఎస్‌ఈ టాప్‌ 500 స్టాకుల్లో 56 స్టాకులు సైతం తమ ఏడాది గరిష్ఠాలకు 50- 90 శాతం దిగువన కదలాడుతున్నాయి. వీటిలో శ్రీిన్‌ఫ్రా, జైన్‌ఇరిగేషన్‌, సెంట్రల్‌బ్యాంక్‌, ఇన్ఫీబీమ్‌, హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియా, ఆర్‌క్యాప్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆర్‌కామ్‌, కాక్స్‌అండ్‌కింగ్స్‌ తదితరాలున్నాయి. 


పలు స్టాకులు భారీ పతనాలు చవిచూసి ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడులపై ఆలోచిస్తుంటారు. అయితే వీటిలో ఎంటర్‌కావడానికి మరికొంతకాలం వేచిచూసి, అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎర్నింగ్స్‌లో మెరుగుదల పెద్దగా లేదని, స్థూలార్థికాంశాలు కూడా నిరాశా జనకంగా ఉన్నాయని, అందువల్ల ఇప్పట్లో సెంటిమెంట్‌ ఊపందుకునే అవకాశం కనిపించడం లేదని సామ్‌కో సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. ఇంత నెగిటివిటిలో పెట్టుబడులకు తొందరపడేకన్నా కొంతకాలం వెయిట్‌ చేయడం ఉత్తమమని సూచించింది. రెలిగేర్‌ బ్రోకింగ్‌ సైతం ఇదే సూచన చేస్తోంది. వీటిలో పెట్టుబడులు పెట్టేముందు కేవలం ధరలు దిగిరావడం ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా ఇతర టెక్నికల్స్‌, ఫండమెంటల్స్‌ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తోంది. You may be interested

ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

Monday 22nd July 2019

భారత్‌లో ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన ఏడీబీ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ద్రవ్యోల్బణం అంచనాలను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ముందుగా అంచనా వేసిన దానికన్నా 0.2 శాతం తక్కువగా 4.1 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉండగలదని వివరించింది. రూపాయి బలపడటం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)అంచనాలు తగ్గడం తదితర అంశాలు ద్రవ్యోల్బణ తగ్గుదలకు కారణాలు కాగలవని ఏడీబీ

డైరెక్ట్‌ ప్లానా ? రెగ్యులర్‌ ప్లానా ?

Monday 22nd July 2019

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఫండ్స్‌ ఎన్‌ఏవీ(నెట్‌అసెట్‌వేల్యూ) ప్రస్తుతమున్న స్థాయి నుంచి ఎంత మేర పతనమైతే, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు ? -శ్రీనివాస్‌, విజయవాడ  జ: మీకు ఈ విషయంలో నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. ఎన్‌ఏవీ తగ్గేదాకా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మీరు చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కోసారి  ఈ వెయిటింగ్‌  నిరంతరం ఉండొచ్చు కూడా ! ఒకవేళ మార్కెట్‌ 20–25 శాతం

Most from this category