News


స్మాల్‌క్యాప్‌లో ఇవి ఆకర్షణీయం..!

Monday 3rd June 2019
Markets_main1559585580.png-26072

ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించే చౌక ధరలో లభించే స్టాక్స్‌ కంటే, అధిక నాణ్యత కలిగిన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం... పెట్టుబడుల వృద్ధిలో కీలకమైన అంశం. ఈ విషయంలో ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ విధానాన్ని మార్చిన ఇన్వెస్టర్‌ చార్లీ ముంగర్‌. ఆకర్షణీయమైన ధరలో లభించే గొప్ప వ్యాపారం, చౌకగా లభించే చక్కని వ్యాపారం (కంపెనీ) కంటే బలమైనదన్నది చార్లీ ముంగర్‌ సూత్రీకరణ. స్మాల్‌క్యాప్‌ విభాగంలో ఆల్ట్‌మ్యాన్‌ జెడ్‌ స్కోరు 2.99 శాతం పైన, పియోట్రోస్కీ ఎఫ్‌ స్కోర్‌ ఏడుకుపైన, ఎర్నింగ్స్‌ ఈల్డ్‌ ఐదు శాతం పైన, పీఈజీ రేషియో సున్నా నుంచి ఒకటి, పీఈ నుంచి మేడెన్‌ పీఈ 1.5 లోపు, ఆర్‌వోఈ 15 శాతానికి పైన, డెట్‌ టు ఈక్విటీ ఒకటి... ఈ అంశాలకు సరితూగే రెండు స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ను వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సూచించింది.

 

శారదా మోటార్స్‌
వాహనాల విడిభాగాల తయారీ సంస్థ. 2017-18 ఆదాయంలో సస్పెన్షన్‌, సైలెన్సర్‌, ఎగ్జాస్ట్‌ పైపుల నుంచి 71 శాతం వచ్చింది. కారు సీట్‌ ఫ్రేమ్స్‌, సీట్‌ కవర్ల ద్వారా 27 శాతం ఆదాయం వచ్చింది. ఈ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఈ కంపెనీ సొంతం. ఎంఅండ్‌ఎం, హ్యుందాయ్‌, మారుతి సుజుకీ ఈ సంస్థ క‍్లయింట్ల జాబితాలో ఉన్నాయి. టాప్‌-3 కస్టమర్ల నుంచే 75 శాతం ఆదాయం వస్తోంది. దీంతో మరింత మంది కస్టమర్లతో డైవర్సిఫై చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇటీవలే ఈఈటీ జీఎంబీహెచ్‌తో 50:50 జాయింట్‌ వెంచర్‌ కుదుర్చుకుంది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలకు ఎగ్జాస్ట్‌ సిస్టమ్స్‌ను ఈ జేవీ తయారు చేయనుంది. తన విక్రయాల్లో ఆర్‌అండ్‌డీ కోసం చేసే వ్యయాలను 1.2 శాతానికి పెంచింది. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా తన ఉత్పత్తి ప్రక్రియను మెరుగుపరుచుకుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తు వృద్ధికి చోదకంగా నిలవనున్నాయి. గత ఐదేళ్లలో కార్యకలాపాల నుంచి సానుకూల క్యాష్‌ఫ్లోను సాధిస్తోంది. రుణ రహితంగా మారింది. సీటింగ్‌ వ్యాపారాన్ని డీమెర్జ్‌ చేసే ప్రణాళికతో ఉంది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్‌ 25 శాతం దిద్దుబాటుకు గురవడంతో 9.4పీఈ వద్ద ట్రేడవుతోంది.

 

మైథాన్‌ అలాయ్స్‌
1997లో వాణిజ్య కార్యకలాపాలను ఆరంభించిన ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద మాంగనీస్‌ అలాయ్స్‌ తయారీ, ఎగుమతి దారుగా ఉంది. ఫెర్రో మాంగనీస్‌, ఫెర్రో సిలికాన్‌, సిలికాన్‌ మాంగనీస్‌ను తయారు చేస్తుంది. వీటిని స్టీల్‌ తయారీలో వినియోగిస్తారు. మాంగనీస్‌ ఓర్‌ (ముడి సరుకు)ను ప్రధానంగా ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశంలోనే అతిపెద్ద మాంగనీస్‌ తయారీ కంపెనీ ఎంవోఐఎల్‌ నుంచి కేవలం 10 శాతమే సమకూర్చుకుంటోంది. ఈ కంపెనీ 2019 మార్చి త్రైమాసికం ఆదాయంలో దేశీయ, విదేశీ ఆదాయాలు 50 శాతం చొప్పున ఉన్నాయి. సెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎస్‌పీఎల్‌ కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఏడేళ్లకుపైగా ఈకంపెనీలతో వ్యాపార అనుబంధం ఉంది. గత ఏడాది కాలంలో కంపెనీ ఆదాయాలు 6 శాతం పెరగ్గా, నికర లాభం 12 శాతం తగ్గింది. తయారీలో వినియోగంచే ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఇలా జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో తన సామర్థ్యాన్ని 1.5 రెట్లకు పెంచే ప్రణాళికను ఇటీవలే ప్రకటించింది. ఇది పూర్తయితే కంపెనీ వృద్ధికి తోడ్పడగలదు. ప్రస్తుతానికి పూర్తి సామర్థ్యం మేర కంపెనీ ప్లాంట్లు నడుస్తున్నాయి. గత ఏడాది కాలంలో ఈ స్టాక్‌ 11 శాతం దిద్దుబాటుకు గురైంది. ప్రస్తుతం ఐదేళ్ల సగటు పీఈ 7.1 శాతం సమీపంలో ట్రేడ్‌ అవుతోంది. అయితే, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం వంటి అంశాల ప్రభావం రిస్క్‌ కూడా కంపెనీ ఆదాయం, లాభాలపై ఉంటుందని గమనించాలి.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు డౌన్‌

Tuesday 4th June 2019

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ మంగళవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.35 గంటలకు 30  పాయింట్ల నష్టంతో 12,080 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ జూన్‌ ఫ్యూచర్‌ 12,110  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌, సింగపూర్‌ స్రె‍్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై, కొరియా

పడినప్పుడల్లా కొనుగోళ్లు: యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

Monday 3rd June 2019

నిఫ్టీ మీడియం టర్మ్‌ అప్‌ట్రెండ్‌లో ఉందని, సూచీలు పడినప్పుడల్లా కొనుగోళ్లు చేసుకోవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా సూచించారు. వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచినట్టు చెప్పారు. గరిష్టంలో గరిష్టం, గరిష్టంలో కనిష్టం నమోదు సానుకూలమని పేర్కొన్నారు. నిఫ్టీ టార్గెట్‌ 12,100-12,230గా పేర్కొ‍న్నారు. ఒకవేళ నిఫ్టీ 11,800లోపు ముగిస్తే అమ్మకాలు పెరుగుతాయని, దాంతో సూచీలు 11,750-11,600 వరకు పడిపోవచ్చన్నారు. ఈ వారంలో నిఫ్టీ

Most from this category