News


ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండేషన్లు

Thursday 18th July 2019
Markets_main1563442019.png-27160

వచ్చే ఆరు నెలల కాలంలో మంచి లాభాన్నిచ్చే రెండు షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండ్‌ చేస్తోంది.
1. దివిస్‌ ల్యాబ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1890. స్టాప్‌లాస్‌ రూ. 1515. ఇటీవలే షేరు మంచి కన్సాలిడేషన్‌ పూర్తి చేసుకుంది. దీంతో ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ ఓవర్‌బాట్‌ నుంచి దిగివచ్చింది. దీంతో షేరులో తాజా ఎంట్రీకి ఆస్కారం ఏర్పడింది. వీక్లీ చార్టుల్లో షేరు హయ్యర్‌ టాప్‌, బాటమ్‌ ఏర్పరుస్తోంది. ఇది అప్‌ట్రెండ్‌ కొనసాగింపు సంకేతం. రూ. 1500 వద్ద షేరు బలమైన బేస్‌ ఏర్పరుచుకుంది. ఈ స్థాయిల వద్ద బలమైన రిట్రేస్‌మెంట్‌ లెవల్స్‌, ఏడాది డీఎంఏ ఉన్నాయి. అందువల్ల దీని పైన ఉన్నంత వరకు అప్‌మూవ్‌ కొనసాగుతూనే ఉంటుంది.
2. ఫస్ట్‌ సోర్స్‌ సొల్యూషన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 58. స్టాప్‌లాస్‌ రూ. 50. ఇటీవలి పతనంలో రూ. 47 వద్ద హయ్యర్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ఐదువారాలుగా ఇక్కడ మద్దతు పొందుతూ హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ వచ్చింది. ఇటీవలే ఈకన్సాలిడేషన్‌ రేంజ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. దీంతో పాటు చార్టుల్లో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడడం పాజిటివ్‌ మూవ్‌కు సంకేతం. ఇండికేటర్లన్నీ అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Thursday 18th July 2019

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 350 పాయింట్లు నష్టపోయింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ షేర్లలో ప్రధానమైన యస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల క్షీణత​ఇండెక్స్‌ను భారీగా నష్టపరిచింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,705.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండంతో ఒక దశలో

వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ మరోసారి కోత

Thursday 18th July 2019

భారత్‌ వృద్ధి అంచనాను ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్(ఏడీబీ) మరోసారి కోత విధించింది. ఏడీబీ ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ) 2019 నివేదికను గురువారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) గానూ భారత్‌ వృద్ధి 7శాతం మాత్రమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇంత క్రితం ఇదే ఏడాది(2019) ఏప్రిల్‌లో దేశీయ వృద్ధిరేటు అంచనా 7.2 శాతంగా ఉంటుందని బ్యాంకు అంచనా వేసింది. ఆర్థిక ఆందోళనలు వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని

Most from this category