News


వచ్చే వారానికి రెండు స్టాక్స్‌

Saturday 21st December 2019
Markets_main1576926960.png-30358

గత వారంకొంత కన్సాలిడేషన్‌ తదుపరి శుక్రవారం(20)తో ముగిసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ఇందుకు గత రెండు వారాలలో మెరుగుపడిన సెంటిమెంటు దోహదపడినట్లు మార్కెట్‌ విశ్లేషకులు కునాల్‌ బోత్రా పేర్కొంటున్నారు. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర బ్లూచిప్స్‌ ఇందుకు సహకరించినట్లు  తెలియజేశారు. ఈ సందర్భంగా కునాల్‌ బోత్రా వచ్చే వారానికి రెండు స్టాక్స్‌ సూచించారు. వీటిలో ఒకటి కొనుగోలు(బయ్‌)కు చేసిన సిఫారసుకాగా.. మరొక షేరుని అమ్మవచ్చు(సెల్‌)గా పేర్కొన్నారు. టెక్నికల్స్‌ ఆధారంగా ఇచ్చిన ఈ రెండు స్టాక్‌ రికమండేషన్స్‌ వివరాలు చూద్దాం...

ఐసీఐసీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌
ఇటీవల బీమా రంగ స్టాక్స్‌పట్ల మార్కెట్‌లో ఆసక్తి పెరిగింది. వారాంతాన చివరి గంటలో బీమా రంగ స్టాక్స్‌ జోరందుకున్నాయి. ఈ విభాగం నుంచి ప్రస్తుతం ఐసీఐసీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేరుని కొనుగోలుకి పరిశీలించవచ్చు. ఇప్పటికే ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం పుంజుకోవడంతోపాటు.. ధర విషయంలోనూ బ్రేక్‌ అవుట్‌ నమోదైంది. దీంతో ఈ షేరు ఇకపై మరింత బలపడే వీలుంది. వెరసి శుక్రవారం ముగింపుతో పోలిస్తే మరింత ర్యాలీ చేయవచ్చు. ట్రేడింగ్‌ పరిమాణం, విలువపరంగా వారాంతాన ఈ షేరు బ్రేకవుట్‌ సాధించడంతో ఈ ప్రభావం వచ్చే వారం సైతం కనిపించే అవకాశముంది. ఈ కౌంటర్‌లో వచ్చే వారానికి రూ. 1460 టార్గెట్‌ ధరతో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ. 1375 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. 

బయోకాన్‌
ఇటీవల బయోకాన్‌ కౌంటర్లో కన్సాలిడేషన్‌ కనిపించింది. రూ. 290-300 ధరలో ఈ కౌంటర్లో పంపిణీ అధికంగా జరిగిన సంకేతాలు కనిపించాయి. ఈ ‍ప్రైస్‌బ్యాండ్‌లో బయోకాన్‌ షేరు కన్సాలిడేషన్‌ పూర్తిచేసుకున్నట్లు కనిపిస్తోంది.దీంతో ఇప్పటికే సాంకేతికంగా ఈ షేరు బలహీనపడుతున్న (వీక్‌నెస్‌) సంకేతాలు ఇస్తో‍ంది. దీంతో వచ్చే వారంలో ఈ షేరు నేలచూపులతో కదిలే వీలుంది. నా అంచనా ప్రకారం ఈ షేరు మరింత నీరసించే అవకాశముంది. రూ. 278 టార్గెట్‌ ధరతో ఈ షేరును విక్రయించవచ్చు. అయితే ఇందుకు రూ. 296 స్టాప్‌లాస్‌ను పెట్టుకోవలసి ఉంటుంది. You may be interested

‘నాణ్యమైన స్టాక్స్‌ ర్యాలీ ఇప్పట్లో ముగియకపోవచ్చు’

Monday 23rd December 2019

జీడీపీ వృద్ధి 4.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తప్పకుండా పెట్టబడులు పెట్టాలని సూచించారు క్రెడిట్‌సూసే ఆసియా పసిఫిక్‌ ప్రాంత ఈక్విటీస్ట్రాటజీ కోహెడ్‌ నీలకాంత్‌మిశ్రా. భారత ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ ఇకముందూ కొనసాగుతుందన్నారు. ఇందుకు ఎన్నో కారణాలున్నాయని, దేశీయ పెట్టుబడుల రాక గత 12 నెలల కాలంలో 20 బిలియన్‌ డాలర్లుగా ఉందని, ఇది ఇక ముందూ కొనసాగుతుందని అంచనా వేశారు. ఇప్పటి నుంచి పెట్టుబడుల రాక కొంత తగ్గొచ్చేమో

త్వరలో ఐపీఓకు యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌

Saturday 21st December 2019

సెబీకి ముసాయిదా పత్రాల సమర్పణ రూ.3వేల కోట్ల సమీకరణకు యోచన నిధుల సమీకరణలో భాగంగా మ్యూచువల్‌ ఫండ్‌హౌస్‌ యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఐపీవోకు వచ్చేందు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ముసాయిదా పత్రాలను మార్కెట్‌ నియంత్రణ ప్రాతిపాధిక సంస్థ సెబీకి సమర్పించింది. దేశంలో అతిప్రాచీన, ఏడో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండింగ్‌ హౌస్‌ పేరోందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా 3.9 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ.3వేల కోట్ల సమీకరణకు సిద్ధమైంది.  ఐపీఓలో భాగంగా

Most from this category